తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయిస్తానని ఒప్పుకొని మాట నిలబెట్టుకోలేదని ఓ మహిళా వీఆర్వో రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.
హయత్ నగర్ : తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయిస్తానని ఒప్పుకొని మాట నిలబెట్టుకోలేదని ఓ మహిళా వీఆర్వో రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. హయత్ నగర్ పోలీసుల కథనం ప్రకారం... ఘట్ కేసర్ మండలంలో వీఆర్వోగా పని చేసే వెన్నెల, హయత్ నగర్ మండలంలో వీఆర్వోగా పని చేస్తున్న వినయ్లు ప్రేమించుకున్నారు.
వినయ్ పెళ్లికి నిరాకరించడంతో వెన్నెల గతంలో హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినయ్ సహచర ఉద్యోగులు స్పందించి ఇద్దరికి వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పట్లో వెన్నెల తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. రెండు నెలలు గడిచినా వివాహం జరిపించకపోవడంతో విసుగు చెందిన ఆమె గురువారం వినయ్తో పాటు హామీ ఇచ్చిన సిబ్బంది, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీఆర్వో, హయత్ నగర్, కేసు నమోదు, పోలీసులు, వెన్నెల, VRO, hayat nagar, case filed, police,vennela