బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కలవరాయి గ్రామ వీఆర్‌ఓ మాధవనాయుడు ఒక రైతు నుంచి మంగళవారం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కలవరాయికి చెందిన టి. వెంకటనారాయణరెడ్డి అనే రైతు తన తల్లి కాంతమ్మ పేరుతో ఉన్న భూమిని తన పేరున మార్చాలని వీఆర్వోను కోరగా అందుకు రూ.5వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
రికార్డులన్నీ సరిగా ఉన్నప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో విషయం తెలుసుకున్న ఏసీబీ డీఎస్‌పీ లక్ష్మీపతి బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మాధవనాయుడును రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ వో పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.