Vennela
-
కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వాల్సిందే.. గద్దర్ కూతురు వెన్నెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా, వెన్నెల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నా పేరును పరిశీలిస్తోంది. టికెట్ విషయంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. కంటోన్మెంట్లో పుట్టి పెరిగాను. ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గద్దర్ కూతురుగా మీ ముందుకు వస్తున్నాను. ఓట్ల విప్లవం రావాలని గద్దర్ అన్నారు. అందుకే చివరగా కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతుగా నిలిచారు. గద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. కానీ, అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గద్దర్ భార్య విమల గద్దర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు టికెట్ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. నా కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వండి. వెన్నెలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని అన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా మంచి అనుబంధమే ఉంది. కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ గెలిపించాలని గద్దర్ పలు సందర్భాల్లో కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ -
Banothu Vennela: మట్టిని కాపాడుకుందాం!
మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదగగలదు. కానీ, సారం లేని మట్టిలో ఏ విత్తనమూ మొలకెత్తదు. మనిషి స్వార్థంతో చేసే కలుషిత కారకాల ద్వారా మట్టి సారం కోల్పోతోంది. భూసారాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు తలెత్తవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బానోత్ వెన్నెల అనే గిరిజన అమ్మాయి ‘సేవ్ సాయిల్’ పేరుతో ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు పూనుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మారుమూల గిరిజన గ్రామపరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ వెన్నెల 60 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్ యాత్ర ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు ‘మట్టి’ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండు వేల కిలోమీటర్లకు చేరువైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీదుగా ఆమె సైకిల్ యాత్ర చేస్తోంది. మే1న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించిన వెన్నెల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులను, గ్రామ పెద్దలను కలిసి ‘మట్టిని ఏ విధంగా కాపాడాలో, ఎందుకు కాపాడాలో’ వివరించి, తిరిగి తన యాత్రను కొనసాగిస్తోంది. కలల అధిరోహణ వెన్నెల చిన్నతనంలోనే ఆమె తండ్రి మోహన్ చనిపోయాడు. తల్లి భూలి కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. వెన్నెలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసింది వెన్నెల. తల్లి కూలి పనికి వెళితే గానీ కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన వెన్నెలకు పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఎన్ని కష్టాలైనా సరే వాటిని సాధించాలన్న పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది. పర్వతారోహణ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇందుకోసం కొంతకాలం భువనగిరిలో రాక్ క్లైబింగ్ స్కూల్లో మౌంటెనీర్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే పేదరికం ఆమెకు శాపంగా మారింది. సోషల్‌మీడియాలో జగ్గీవాస్‌దేవ్ ‘సేవ్ సాయిల్’ కథనాలు విని స్ఫూర్తి పొందిన వెన్నెల భవిష్యత్తు భూసారాన్ని పెంచడానికి తన వంతుగా సమాజాన్ని జాగృతం చేయాలనుకుంది. రెండు నెలల పాటు ఒంటరిగా సైకిల్‌పై వెళ్లే యాత్రకు పూనుకుంది. తల్లి చెవి కమ్మలతో సైకిల్... ఒంటరి యాత్రకు తల్లిని ఒప్పించింది. కానీ, సైకిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. తిరిగి తల్లినే బతిమాలుకుంది. తల్లి చెవి కమ్మలు అమ్మి, ఆమె ఇచ్చిన డబ్బులతో సైకిల్ కొనుగోలు చేసింది. మే 1 న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించింది. ప్రస్తుతం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. 60 రోజుల్లో 5,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించాలని లక్ష్యం పెట్టుకుంది. రాత్రిపూట ఉండాల్సిన పరిస్థితులు, యాత్రలో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ‘ఇప్పటి వరకు ఆరు గరŠల్స్ హాస్టల్లో రాత్రిళ్లు బస చేశాను. మిగతా చోట్ల. పోలీస్ స్టేషన్లలో ఉన్నాను. ఈ రోజు (రాత్రి) కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 10 రోజులు యాత్ర పూర్తయ్యాక ఈషా ఫౌండేషన్ వాళ్లు కలిశారు. ఒక అమ్మాయిగా ఇలాంటి సాహసమైన పనిని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. రోజూ వంద కిలోమీటర్లు ‘రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నాను. దారిలో రైతులు, గ్రామస్తులను కలుస్తున్నాను. భూసారం గురించి, వారు చేస్తున్న పంటల పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాను. చాలా వరకు భూమిలో సేంద్రీయత కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. ఇది ఇలాగే తగ్గితే భవిష్యత్తులో పంటల దిగుబడులకు, మనుషుల మనుగడకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మేలుకోవాలి. 2050 నాటికి కనీసం 3 నుంచి 6 శాతం తిరిగి భూసారం పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు సేంద్రీయ పద్ధతులను అవలంభించి భూసారాన్ని కాపాడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని దారిపొడవునా కలిసిన వారికల్లా వివరిస్తున్నాను’ అని తెలిపింది వెన్నెల. నిన్నటితో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తయ్యింది. ఎక్కడా ఏ ఇబ్బందులూ లేవని, గ్రామస్తుల ఇళ్లలోనే వారి ఆహ్వానం మేరకు భోజనం సదుపాయం కూడా పొందుతున్నాను’ అని తెలిపింది వెన్నెల. మట్టిబిడ్డగా మట్టి కోసం... మాది పేద కుటుంబం. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేస్తోంది. ఎవరెస్ట్ అధిరోహించాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాలి. అందుకే కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు భూ సారాన్ని కాపాడమంటూ సైకిల్ యాత్ర చేపట్టా. యాత్ర ద్వారా ఎంతో మంది చైతన్యం అవుతున్నారు. మట్టి బిడ్డగా మట్టికోసం చేస్తున్న ఈ యాత్ర సక్సస్ అవుతుంది. దీని తరువాత కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్వతారోహణ మీద దృష్టి పెడతా. – బానోత్ వెన్నెల, సర్దాపూర్ తండా, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
లవ్ యూ చందమామ
వెన్నెల రోజున భూమి ఎలా ఉంటుంది? వెన్నెల కురిసే ఆ రోజున కాస్తంత ఎత్తు మీద నుంచో, వీలైతే ఏ కొండపై నుంచో చూడండి. ఎలా కనిపిస్తుంటుంది భూమి?వెన్నెల టాల్కమ్ పౌడర్‌ను దూమెరుగ్గా రాసుకుని, ఫ్రెష్‌గా ఉన్నట్టుంటుంది భూమి.రాత్రి చీకటిలో డార్క్ కాంప్లెక్షన్ చాయతక్కువగ ఉన్నట్టుండే ధరణి... ఫెయిర్‌నెస్ క్రీము రాసుకుని ఫెయిర్‌గా కనిపిస్తున్నట్టుంటుంది. ఆ నిగారింపుల మిలమిలలతో, వెన్నెల సింగారింపుల కళకళలతో మెరిసిపోతుంటుంది. చందమామ అనగానే అందరికీ భావావేశమే. కోటిపూలతో కొండెక్కీ, బంతిపూలతో బండెక్కీ, పల్లకీలో పాలుపెరుగులతో, పరుగుపరుగున పనసపండుతో, అలయకుండా అరటిపండుతో రావాలనీ... అన్నింటినీ తెచ్చి తమ చిన్నారికి ఇవ్వాల్సిందే అని అన్నమయ్య డిమాండ్ చేశాడు. ఇక శ్రీరాముడు మాత్రం తక్కువా? చందమామ అందితేగానీ అన్నం తిననని మారాం చేశాడు. అద్దం చేతనుంచుకొని, దాంట్లో చూసి, అద్దం ఫ్రేమ్‌లో బిగించాడు కాబట్టే రామ‘చంద్ర’మూర్తి అయ్యాడేమో. ఇంతటి చందమామ గురించి ఎన్నెన్నో విశేషాలు. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. ఆ శక్తి కారణంగానే అవి పరిభ్రమిస్తూ ఒకదానితో ఒకటి ఢీకొనకుండా తిరుగుతూ ఉంటాయి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగానే సముద్రజలాలు ఆకర్షితమై ఆటుపోట్లు వస్తుంటాయని తెలుసు. మరి భూభాగం సంగతో?... అక్కడా ఆ శక్తి పనిచేస్తుంటుంది. జలాలు ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి ఆటుపోట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ... నీటిమట్టం పెరగడం తగ్గడం జరుగుతుంది. అలాగే మన కాళ్ల కింది భూభాగమూ కాస్తంత ఉబుకుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ భూమ్మీద ఉన్న సమస్త కొండగుట్టలూ, భవనాలూ, నిర్మాణాలూ ఒకింత పైకి లేస్తాయి. మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. కాకపోతే దాన్ని మనం గమనించలేం అంతే. చంద్రుడు సరిగ్గా భూమి చుట్టే తిరుగుతున్నాడా? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడని మనం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. అది నిజమే అయినా పూర్తిగా వాస్తవం కాదు. భూమీ, చంద్రుడూ పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి కాబట్టి చంద్రుడు తిరిగే కేంద్రం భూమి కేంద్రస్థానానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఆ ఊహాకేంద్రకాన్ని మనం ‘బ్యారీసెంటర్’ అని పిలుస్తాం. ఈ బ్యారీసెంటర్ అన్నది భూమి పైపొర అయిన క్రస్ట్‌లో ఉంటుంది. అక్కడా కావాల్సినంత చెత్త! మనిషి అంటేనే చెత్త పుట్టించేవాడు. తానెంత మంచి పిక్నిక్ స్పాట్‌కు వెళ్లినా తాగేసిన నీళ్లబాటిళ్లు, ఇతరత్రా చెత్తనక్కడ పడేస్తూ ఉంటాడు. చంద్రుడూ ఇందుకు మినహాయింపు కాడు. మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకూ మానవుడు వెళ్లినప్పుడు వదిలేసినవీ, మనం పంపించిన ఉపగ్రహాల వల్ల వెలువడినవీ... ఇవన్నీ కలిసి దాదాపు లక్షా ఎనభై రెండు వేల కిలోల (కచ్చితంగా చెప్పాలంటే 1,81,437 కిలోల) చెత్త చంద్రుడి ఉపరితలం మీద చేరిందట. అదో మరుస్థలి కూడా... అంతేకాదు... అక్కడ ఓ శ్మశానం కాని శ్మశానమూ ఉంది. ఆ కథాకమామిషూ చూద్దాం. యూజీన్ షూమాకర్ అనే ఓ అద్భుతమైన ఖగోళ పరిశోధకుడూ, జియాలజిస్టూ చాలా కీలకమైన పరిశోధనలు చేశాడు. చంద్రుడి మీదకు వెళ్లాలన్నది అతడి తీరని కోరిక. కానీ అతడిలోని చిన్న శారీరక లోపం చంద్రుడిమీదకు వెళ్లడానికి అవరోధంగా మారింది. తన ప్రగాఢ వాంఛ అందని చందమామఅయ్యింది. ఖగోళరంగంలో అతడి కీలక పరిశోధనలకు ఓ నివాళిగా అతడి చివరి కోర్కెను మరోలా తీర్చారు శాస్త్రవేత్తలు. అతడు చనిపోయాక అతడి చితభస్మాన్ని లూనార్ ప్రాస్పెక్టర్ ద్వారా1998లో చంద్రుడి మీదకి తీసుకెళ్లి అక్కడి చంద్రధూళిలో ఖననమయ్యేలా చూశారు. అలా అతడి చివరి కోర్కెను తీర్చారు నాసా వారు. అంతేనా... చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలన్నది చిరకాలంగా చాలా మంది మన భూలోక వాసుల కోరిక కూడా. అందుకే దాదాపు క్రీస్తుపూర్వం 450 నాటి నుంచే కొందరి కోరిక మేరకు వారి చితాభస్మాన్ని ఎల్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేసేవారు. అది చంద్రుడి మీదికి చేరి అక్కడ ధూళిలో కలిసిపోతుందని వాళ్ల ఆశ. అయితే ఇలాంటి కోరికలెవరికైనా ఉంటే అవి భవిష్యత్తులో తీరే అవకాశాలున్నాయి. ‘లూనార్ మెమోరియల్ సర్వీస్’ పేరిట ‘ఎసైలమ్ స్పేస్’ వంటి కొన్ని కంపెనీలు చంద్రుడి మీద వారి చితాభస్మాలనూ, అవశేషాలను ఖననం చేసే పనికి పూనుకుంటున్నాయి. 2013 నెలకొల్పిన ఎసైలస్ స్పేస్ సంస్థ ఇస్తున్న భరోసా ప్రకారం... కేవలం చంద్రుడి మీదే కాకుండా... సౌరకుటుంబానికి ఆవలనున్న సుదూర అంతరిక్ష స్థలాల్లోనూ ఆ చితాభస్మాన్ని వదులుతామంటూ ఆ కంపెనీ వాగ్దానాలు చేస్తోంది. అయితే ఈ దిశగా వారి మొదటిమజిలీ శ్మశానస్థలి మాత్రం జాబిల్లేనట. చంద్రకంపాలూ ఉంటాయి భూమ్మీద భూకంపాలు వస్తాయన్నది మనకు తెలిసిందే కదా. అలాగే చంద్రుడిమీద కూడా అలాంటివే సంభవిస్తాయి. మనం భూకంపం అన్నట్టుగానే దాన్ని చంద్రకంపం అనవచ్చు. ఇంగ్లిషులో ‘మూన్‌క్వేక్’ అన్నమాట. ఇందులోనూ మళ్లీ నాలుగు రకాలుంటాయి. చాలా లోతుగా వచ్చే డీప్ క్వేక్స్, ఏవైనా ఉల్కలు చంద్రతలం మీద పడటం వల్ల వచ్చే కంపనాలైన మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రత ప్రభావం వచ్చే థర్మల్ క్వేక్స్... ఈ మూడూ ఒకింత తక్కువ శక్తిమంతమైనవి. కానీ రిక్టర్ స్కేలు మీద 5.5 వరకు వచ్చే ‘షాలో మూన్ క్వేక్’ లనేవి మాత్రం చాలా భయంకరమైవి. మన భూమ్మీద భూకంపం వస్తే అది సెకన్లపాటు, మహా అయితే కొన్ని అరనిమిషం ఉంటుంది. కానీ చంద్రకంపం దాదాపుగా అరగంట పాటూ రావచ్చు. నాసా పరిశీలన ప్రకారం.. ఒక గంట మోగుతున్నప్పుడు ఆ లోహంపై కలిగే ప్రకంపనల్లాగే చంద్రకంపం సమయంలో చంద్రుడి ఉపరితలం అలా ప్రకంపనాలకు లోనవుతుంటుంది. నాసా భాషలో చెప్పాలంటే ‘ద మూన్ రింగ్స్ లైక్ ఎ బెల్’! ఇప్పట్లో పిక్నిక్ స్పాట్ కాబోదు చంద్రుడి మీదకెళ్లడం మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అక్కడి చంద్రధూళి మానవుల ఆరోగ్యానికెంతో ప్రమాదం. మనం స్పేస్ సూట్ తొడుక్కుని పోయినప్పటికీ ఆ ధూళి ఎలాగోలా మన బట్టల్లోకి చేరిపోతుంది. ఈ ధూళి కారణంగా మనకు ‘లూనార్ హే ఫీవర్’ అనే వైద్య సమస్య రావచ్చట. దీన్నే ‘మూన్ డస్ట్ ఫీవర్’ అని కూడా అంటారట. అందరి చంద్రుడు అందని చంద్రుడవుతున్నాడా? మనందరికీ ప్రియాతి ప్రియమైన చందమామ రోజురోజుకూ మనకు దూరమవుతున్నాడా? ఒకనాటికి మనకు అందకుండా పోతాడా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి ఏడాది చంద్రుడు మననుంచి 3.78 సెం.మీ. దూరంగా జరుగుతున్నాడట. ఇప్పటికైతే జాబిల్లి దూరమవుతున్నందువల్ల మనకా ప్రభావం గణనీయంగా కనిపించకపోవచ్చు. కానీ ఒకనాటికి బాగా దూరం వెళ్లిపోతే మన భూగోళం తిరిగే వేగం (భూభ్రమణ వేగం) కూడా తగ్గిపోతుందట. అయితే ఆ ప్రమాదం మాత్రం ఇప్పట్లో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మీరు చందమామ అనండి. జాబిల్లి అనండి. ఇంగ్లిష్‌లో మూన్ అనండి. లూనా అనండి. కానీ చందమామ కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు. మన ఎన్నో ఎమోషనల్ అంశాలకు ఒక కేంద్రస్థానం. సౌరకుటుంబంలో మన భూమితో పాటు పుట్టిన మన ఉపగ్రహం. భూమిని మనం భూమాత అంటాం. అంటే మన తల్లిలాంటిదే మన భూగ్రహం. మరి దాని తోబుట్టువు మనకు మేనమామే కదా. అందుకే చంద్రుణ్ని మనం చందమామ అంటాం. తల్లి పుట్టిలు మనం మేనమామకు చెబితే ఎలా ఉంటుంది. అందుకే మన తల్లి అయిన భూమాత పుట్టుకకు సంబంధించిన ఎంతో సమాచారం తెలుసుకోవాలన్నా చంద్రుడికి తెలుసేమో. దాని గురించి ఆయన్నే అడగాలేమో! అలా అడగగా వెల్లడయ్యే ఎన్నో అంశాలు తెలిసిరావచ్చు. మరెన్నో రహస్యాలు విడివడవచ్చు. మన చంద్రుడికి సంబంధించిన చిత్రవిచిత్రాల్లో ఇవి కొన్ని మాత్రమే. తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే అప్పటి విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని దించినట్టుగా మన ఈ పరిశోధనా విక్రముడు... చంద్రుడి ఎత్తులు విక్రమార్కుడిలా ఎక్కుతూనే ఉంటాడు. తెలియని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంటాడు.– యాసీన్ -
నెన్నెలలో ఆధిపత్య పోరు..!
సాక్షి, బెల్లంపల్లి: అక్కడ ఆధిపత్య ధోరణి పరాకాష్టకు చేరుకుంది. రెండువర్గాలు సమఉజ్జీలుగా మారి ఏ తీరైన గొడవలకైనా ‘ సై ’ అంటున్నాయి. రాజకీయ పరంగా శత్రువులుగా మారి ఏ సమస్యనైనా సరే అనువుగా మల్చుకుంటున్నారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు, పొలంగట్ల జగడాలు, రా జకీయ, ఇతరత్రా గొడవలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇరువర్గాలు చె రోదిక్కు చేరిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం అక్కడ రెండేళ్ల పైబడి నుంచి నిరాటంకంగా సాగుతోంది. ప్రతి స మస్యను రాజకీయపరంగా మలు చు కుని ఆ రెండు వర్గాలు క్రమంగా శాంతిభద్రతలకు భంగం వాటిళ్లేలా ప్రవర్తిస్తున్నాయి. అధికార పక్షంగా ఓవర్గం, విపక్షంగా మరో వర్గం ప్రతి సమస్యను గొడవలకు దారితీసేలా వ్యవహరిస్తుండటంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నెన్నెల మండలంలో ఆధిపత్య అహంకారం తలకెక్కి వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివవాదాలకు మారుపేరుగా ... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న నెన్నెల మండలం ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా నిలుస్తోంది. రెం డేళ్ల పైబడి నుంచి అధికార, విపక్షాలుగా ఉన్న రెండువర్గాలు ఏ అంశంలోనూ వెనక్కితగ్గకుం డా కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. చివరికి వారిపైత్యం భార్యాభర్తల గొడవల వరకు కూడా వెళ్లినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నా యి. గ్రామాలలో ఏ ఇద్దరు తగువులాడినా ఓ వ్యక్తి పక్షాన ఓవర్గం, మరోవ్యక్తి పక్షాన ప్రత్యర్థి వర్గం దూరిపోయి ఆధిపత్యం కోసం ఘర్ష ణ వాతావరణానికి పురిగొల్పుతున్నారనే వి మర్శలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా పంతాలు, పట్టింపులకు పోవడం, ఒకరిపై ఒకరు పోలీసు ఠాణాల్లో ఫిర్యాదు చేసుకోవడం, విచారణ చేపట్టకముందే కేసు నమోదు కోసం పోలీసులపై వొత్తిళ్లు తేవడం, తాము చెప్పిందే నడవాలనే అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు. భూ ఆక్రమణలు, భూ వివాదాలకు దిగడం, దౌర్జన్యంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు దిగడం ఓవ ర్గం నాయకుడికి పరిపాటిగా మారిందని గ్రా మీణులు పేర్కొంటున్నారు. ఓ ముఖ్యనేతకు బినామీగా ఉండి అతడి అండదండలతో ఎవర్నీ లెక్కచేయకుండా దుందూకుడుగా వ్యవహరించడం జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. అదేతీరుగా ఆ వర్గానికి ప్ర త్యర్థిగా వ్యవహరిస్తున్న వర్గం కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఇరువర్గాల మధ్య కక్షలు పెరిగి పోతున్నాయి. వ్యక్తిగతంగా, ఆస్తుల పరంగా ఆ రెండువర్గాల ముఖ్యనాయకుల మధ్య తగాదాలేం లేకపోయినా రాజకీయ పరంగా వైరివర్గాలుగా మారి ‘హమ్ కిసీసే కమ్ నహీ’ అంటున్నారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసులకు సరికొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. రూట్ మార్చిన పోలీసులు నెన్నెల మండలంలో జరుగుతున్న ఘర్షణలు, ఇతరత్రా అంశాలకు ఎటు తిరిగి శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తున్నట్లు పోలీసువర్గా లు అంచనాకు వచ్చాయి. ఏ వర్గానికి నచ్చజెప్పినా వినకపోగా పైపెచ్చు పోలీసులు ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా రని దుష్ప్రచారం చేయడం, ఉన్నతాధికారుల కు తప్పుడు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇక్కడి వర్గ రాజకీయాలలో అనివార్యంగా పోలీసులు పావులుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నడస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు భిన్నంగా పోలీసు ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘ట్రబుల్ మాంగర్స్’ గా ముద్రపడ్డ 16 మందిని మంగళవారం కౌన్సెలింగ్‌కు పిలిపించి తమదైన ధోరణిలో మర్యాద చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. ఈ అంశం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మచ్చుకు కొన్ని సంఘటనలు.. నెన్నెల మండల కేంద్రంలో ఓవర్గ నాయకుడు భూకబ్జాకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చి వివాదంగా మారింది. ఆవ్యవహారంపై రామాగౌడ్ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. చివరికి ఆ వ్యవహారంలో ఓ వ్యక్తి పేరుమీద తప్పుడు కుల ధృవీకరణ పత్రం తీసుకుని తనపై తప్పుడు కేసు పెట్టించారని రామాగౌడ్ మనస్థాపం చెంది మంచిర్యాల కలెక్టరేట్‌కు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లంబాడి తండాలో ఓ మహిళ మంత్రాలు చేస్తోందని అనుమానించి ఆమెపై దాడి చేసిన ఘటనలో ఓ వర్గం నాయకుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గొడవలకు దిగడం నైజంగా మార్చుకున్న ఓవర్గం నాయకుడిని ఇటీవల సత్ప్రవర్తన కోసం పోలీసులు నెన్నెల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. కానీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులు మరో కేసు పెట్టారు. మరో వర్గానికి చెందిన ఓ నాయకుడు తానేమీ తక్కువగా కాదన్నట్లుగా ఓ కేసు వ్యవహారంలో జోక్యం కల్పించుకుని ఏకం గా ఏఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడమే కాకుండా అతడి విధులకు ఆటంకం కలిగించడంతో ఆ నాయకుడిపై కేసు నమోదైంది. ప్రభుత్వ భూమిని కబ్జాచేశాడని నెన్నెల మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఓ వర్గం నాయకుడిపై హైకోర్టులో కేసు వేయడం, ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉండడం విశేషం. -
ఫీజుల ఒత్తిడి.. నారాయణ విద్యార్థినికి అస్వస్థత
శ్రీకాకుళం , కాశీబుగ్గ: కాశీబుగ్గ నారాయణ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గేదెల వెన్నెల కళాశాల యాజమాన్యం తీరుతో అస్వస్థతకు గురైంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారిథికి చెందిన గేదెల మన్మధరావు, రాజేశ్వరిల కుమార్తె వెన్నెలను కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేసింది. అయితే తిత్లీ ధాటికి ఉన్నదంతా పోవడంతో తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి గురై ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు ఆ మెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల నేతలు కళాశాల వద్ద ఆందోళన చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్‌కుమార్, సీఐటీయూ నెయ్యిల గణపతి, జిల్లా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, ప్రగతిశీల కార్మిక సంఘ నాయకులు పుచ్చ దుర్యోధన, గ్రామస్తురాలు అరుణ, కొర్రాయి నీలకంఠం తదితరులు కళాశాల వద్ద ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును నిలదీశారు. అయితే అటువైపు నుంచి మాత్రం సరైన సమాధానం రాలేదు. ఆమె మూడు రోజులుగా రావడం లేదు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వెన్నెల మూడు రోజులుగా కాలేజీకి రావడం లేదు. ఆమె డయాబెటిక్ పేషెంట్. ఇన్సులిన్ లేకపోవడం వల్ల పడిపోయింది. ఆమెపై ప్రత్యేకించి ఒత్తిడి చేయలేదు. అందరినీ అడిగినట్టే అడిగాం.– తిరుపతిరావు, ఏజీఎం,నారాయణ విద్యాసంస్థ -
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న పాఠమా
ప్రతి పొద్దూ ఇలా ఉండాలి. కాంతిమంతంగా.అజ్ఞానాన్ని పారద్రోలేలా. ధనిక, పేద.. అందరికీ.. ‘వెన్నెల’ సమానం అనేలా! సికింద్రాబాద్ ఆల్వాల్‌లోని వెంకటాపురంలో ఉంది ఆ పాఠశాల. పాఠశాల బయట బోర్డుపై బోధివృక్షం, దానికి పైగా అర్ధచంద్రాకారంలో ‘మహాబోధి విద్యాలయ’ అనే పేరు, దాని కింద స్కూల్‌ని స్థాపించిన సంవత్సరం (1992) ఉంటుంది.బోధివృక్షం ఆ పాఠశాల గుర్తు. అంబేడ్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ఆ పాఠశాలను నడుపుతోంది. సమాజంలో మహిళ స్థానం ఎలా ఉండాలని అంబేడ్కర్ ఆశించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంటుంది మహాబోధి విద్యాలయలో. అంబేడ్కర్ ఒక సందర్భంలో ‘ఒక సమాజాన్ని అంచనా వేయాలంటే ముందుగా ఆ సమాజంలో మహిళలు సాధించిన అభ్యున్నతిని చూడాలి. వారి పురోగమనం మీదనే సమాజం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’ అన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన జరుగుతోంది. ఈ పాఠశాలలో బోధనా సిబ్బంది అంతా మహిళలే. మొత్తం 27 మందిలో ప్రిన్సిపాల్, పిఈటీ టీచర్, వాచ్‌మన్... ఈ ముగ్గురు మాత్రమే మగవాళ్లు. మిగిలిన 24 మంది మహిళలే. సహనమూర్తులు కనుకనే ఈ పాఠశాలలోని విద్యార్థులలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన కుటుంబ స్థితి. వీరిలో సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో తల్లి కష్టపడి పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో పరిపూర్ణమైన కుటుంబంలో ఉండే భరోసాపూరిత వాతావరణం ఉండదు. ఆ ప్రభావం పెరిగే పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. అంచేత ఆ పిల్లలకు వాళ్ల ఇంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలి. ఒకవేళ ఒక విద్యార్థి హోమ్‌వర్క్ చేయకపోతే కారణాన్ని కనుక్కోవాలి. తల్లితోపాటు పనికి వెళ్లడం, నీళ్లు పట్టుకోవడానికి వెళ్లి ఆ పని పూర్తయ్యే సరికి కాలనీలో కరెంట్ పోవడం.. ఇలాంటివెన్నో కారణాలు ఉంటాయి. అవేవీ కాకపోతే ఆ రోజు రాత్రి వాళ్ల నాన్న మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టడం, పిల్లల్ని కొట్టినంత పని చేసి బెదరగొట్టడం వంటిది జరిగి ఉంటుంది. అలాంటి పిల్లల్ని హోమ్‌వర్క్ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, వీధుల్లో తిరగడానికి వెళ్లడమే కాకుండా, వాళ్ల వంటి పిల్లల్నే వెతుక్కుని ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు స్కూలుకి వెళ్లమని ఎంత ఒత్తిడి చేసినా వెళ్లనని మొండికేస్తారు, పద్నాలుగు, పదిహేనేళ్లు వచ్చేసరికి తల్లికి ఎదురు తిరగడం కూడా అలవాటవుతుంది. ఇన్ని ఉంటాయి. ‘‘వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పాలంటే అంత సహనం ఉండేది మహిళలకే’’ అంటారు స్కూలు నిర్వాహకురాలు వెన్నెల. మూడవ బిడ్డకు సగమే ఫీజు ‘‘సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉండే పిల్లలతోపాటు అమ్మమ్మ, నాయనమ్మ సంరక్షణలో ఉండే పిల్లలు కూడా ఉంటారు. వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ సంగతి కూడా టీచర్‌కు తెలిసి ఉంటే విద్యార్థి పట్ల చూపించే ఆదరణ వేరుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే టీచర్ తల్లిలా పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని చదువు చెప్పాలి’’ అంటున్నారు వెన్నెల. ‘‘అలాగే ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి, చదివించడానికి ఈ రోజుల్లో తల్లిదండ్రులు తలకిందులవుతున్నారు. అలాంటిది మూడవ బిడ్డను చదివించడమంటే వాళ్లు తలకు మించిన భారంగానే ఉంటుంది. దాంతో ముగ్గురిలో ఒకరిని చదువు మాన్పించి పనుల్లో పెట్టేస్తుంటారు. ముగ్గురిలో ఎవరో ఒకరు చదువును నష్టపోతుంటారిలా. అందుకే మూడవ బిడ్డకు ఫీజులో సగం రాయితీ ఇవ్వాలనుకున్నాం. ఈ రాయితీ వర్తించాలంటే మొదటి ఇద్దరినీ చదివిస్తూ ఉండాలి. పెద్దవాళ్లను చదువు మాన్పించి పనికి పంపిస్తున్న వాళ్లకు ఈ రాయితీ వర్తించదనే కండిషన్ కూడా పెట్టాం. బాలికలకు ప్రాధ్యానం ‘‘ఈ పాతికేళ్లలో పది వేలకు పైగా విద్యార్థులు మా స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లారు. వారిలో దాదాపు ఐదు వేల మంది బాలికలు ఉండడం మాకు గర్వంగా అనిపించే విషయం. మా స్టూడెంట్స్ ఇళ్లలో అబ్బాయిని స్కూలుకి పంపించి, అమ్మాయిని ఇంట్లో పనులకు ఆపిన కుటుంబం ఒక్కటీ లేకుండా చూడగలిగామనేది మహిళగా నాకు పెద్ద సంతృప్తి. మా నాన్న (విప్లవ గాయకుడు గద్దర్) ఈ స్కూల్ స్థాపించిన ఉద్దేశం నెరవేరుస్తున్నాననే సంతోషం కూడా. మా స్కూల్ స్టాఫ్ అంతా అదే భావాలతో పని చేస్తుండడంతోనే ఇది సాధ్యమైంది’’ అని వివరించారు వెన్నెల. ఆదర్శాన్ని వల్లించడం కాకుండా ఆచరణలో చూపిస్తోంది మహాబోధి విద్యాలయ. ఇంట్లో పరిస్థితులు సరిగా లేని పిల్లల్ని హోమ్‌వర్క్ చేయలేదనే కారణంగా కఠినంగా శిక్షిస్తే ఇక స్కూలుకి కూడా దూరమై, ఆకతాయితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిని చక్కదిద్ది దారిలో పెట్టే సహనం మహిళా టీచర్లకు మాత్రమే ఉంటుంది. – వెన్నెల, స్కూలు నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'వెన్నెల' క్రీడా వెలుగులు
మట్టిలో ఉన్నా మాణిక్యం కాంతులీనుతుందంటారు. అలాంటి కోవకు చెందినదే ఓ చిన్నారి. చదివేది గ్రామీణ పాఠశాలలోనైనా.. క్రీడా పోటీల్లో మాత్రం మిస్సైల్లా దూసుకుపోతోంది. తొమ్మిదో తరగతిలోనే తన ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రశంసలందుకుంటోంది. అయితే నిరుపేద కుటుంభంలో పుట్టిన ఆ బాలిక ప్రతిభను పేదరికం అడ్డుకుంటోంది. ఎవరైనా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు తెస్తానంటున్న చిన్నారి శ్రీవెన్నెల వివరాలు చదవండి. మేదరమెట్ల: క్రీడల్లో వెలుగులు నింపుతున్న శ్రీవెన్నెల ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి చెందిన కోటా దేవదాసు, సుజాతల కుమార్తె. ఈ బాలిక గ్రామంలోని ఆరివారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈఏడాది తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడల పట్ల వెన్నెల కున్న ఆసక్తి గమనించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రతిమ ఆ బాలికకు, డిస్కస్‌త్రో. షాట్‌పుట్‌లలో తర్ఫీదునిచ్చారు. ఆ రెండు ఈవెంట్స్‌లో విద్యార్థిని ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సా«ధించి, జాతీయ స్థాయికి ఎంపికై అందరి మన్ననలను అందుకుంటోంది. ఆశయానికి అడ్డోస్తున్న పేదరికం.. శ్రీ వెన్నెల తండ్రి బేల్దారీ పనులు చేస్తుంటాడు. పేద కుటుంబం కావడంతో తమ కుమార్తెను గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిస్తున్నారు. తన బిడ్డ డిస్కస్‌త్రో, షాట్‌పుట్ ఈవెంట్లలో జాతీయ స్థాయికి ఎంపికైందని తెలుసుకుని బాలిక తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఆమెకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి, తమ పేదరికం అడ్డొస్తుందని, ఎవరైనా దాతలు ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి పతకాలను అందిస్తానని చెబుతోందంటున్నారు కన్నవారు. శ్రీవెన్నెల సాధించిన విజయాలు.. ♦ 2016–17 సంవత్సరం పొదిలిలో నిర్వహించిన డిస్కస్ త్రో షాట్çపుట్ పోటీల్లో మొదటి స్థానం సాధించింది. ♦ 2017–18లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో రెండు ఈవెంట్స్‌లో మొదటి స్థానం సాధించింది. విద్యార్థిని ప్రతిభను గమనించిన స్టేట్ సెలక్షన్ కమిటీ బాలికను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసింది. ♦ పలాసాలో నిర్వహించిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని డిస్కస్ త్రోలో మొదటి స్థానం, షాట్పట్లో మూడో స్థానం సాధించింది. జాతీయ స్థాయికి ఎంపిక.. ♦ ఈనెల 18న మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రోత్సహిస్తే దేశానికి పతకాలు తెస్తా.. క్రీడల్లో మరింత రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలను అందించాలని ఉంది. క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదుకొని పోలీసు అధికారి కావాలని ఆసక్తిగా ఉంది. పెద్ద కోచ్‌ల వద్ద కోచింగ్ ఇప్పించే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే మంచి స్థాయిలో నిలిచేందుకు కృషి చేస్తా. – కోటీ శ్రీ వెన్నెల -
ఆ అనుభూతి మరిచిపోను..
భూత్పూర్(దేవరకద్ర): చిన్నప్పటినుంచీ ఆకాశంలో ఎగరాలని కలలు కనేదాన్ని.. పైలట్‌గా ఉద్యోగం చేసి విమానం నడపాలని నా కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మెట్రో లోకో పైలట్‌గా ఓ అడుగు ముందుకేశాను.. నా చివరి టార్గెట్.. పైలట్.. ఆ లక్ష్యం చేరేదాక కృషి చేస్తూనే ఉంటా.. నని మెట్రో రైల్ లోకో పైలట్ వెన్నెల అన్నారు. సోమవారం స్వగ్రామమైన అమిస్తాపూర్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ వెన్నెలతో ఇంటర్వ్యూ నిర్వహించింది. చిన్నప్పటినుంచి మా అమ్మానాన్న చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. వారి ఆశీస్సులు, అన్న సహకారంతో మెట్రో లోకో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాను. క్రిష్టియన్ పల్లిలోని క్రీస్తు జ్యోతి విద్యాలయంలో 10వ తరగతి వరకు చదివాను. అనంతరం డిప్లామాలో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ కోర్సు చేశాను. పత్రికల్లో చూసి దరఖాస్తు చేశా.. నా పేరు పక్కన మొదటినుంచీ పైలట్ అని ఉండాలని అనుకునేదాన్ని. ఆ కోరికను తీర్చుకోవడానికి ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ కోర్సు పూర్తి చేశాను. తర్వాత ఈసీఐఎల్‌లో అంప్రెంటీస్ చేస్తుండగా ఓ పేపర్లో మెట్రో రైల్ నోటిఫికేషన్ చూశాను. దరఖాస్తు పూర్తిచేసి ఎంట్రెన్స్ రాశాను. ఇంకేముంది మంచి మార్కులు వచ్చాయి.. ట్రెనింగ్‌కు సెలక్టయ్యా ను. ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ అనుభూతి మరిచిపోను మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఎందరో ప్రముఖులు వచ్చారు. వారిని అంత దగ్గరనుంచి చూడటం చాలా సంతోషం అనిపించింది. వారు వచ్చినప్పుడు నేను లోకో పైలట్ టీం మెంబర్‌గా ఉన్నందుకు ప్రౌడ్‌గా ఫీలయ్యాను. ఆ అనుభూతి మరిచిపోలేను. మా బ్యాచ్‌లో నేనే జూనియర్ లోకో పైలట్ టీంలో ఉన్న సభ్యుల్లో పోలిస్తే అందరిలో నేనే జూనియర్. అయినప్పటికీ మా టీం సభ్యులు నన్ను ఆ భావనతో చూడ లేదు. అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. ప్రస్తుతం మెట్రో రైలులో నేను ఒక్కదాన్నే విధులు నిర్వహిస్తున్నా. రోజు నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు నడుపుతున్నాను. వేలాదిమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నానని సంతోషంగా ఉంది. క్రమశిక్షణే ఈ స్థానానికి చేర్చింది మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: క్రమశిక్షణే వెన్నెలను ఉన్నత స్థానానికి చేర్చిందని జ యప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ అన్నారు. మెట్రో రైలు నడుపుతున్న కళాశాల పూర్వవిద్యార్థి వెన్నెలను సోమవారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. కష్టపడే తత్వం, పట్టుదల వంటి లక్షణాలు ప్రతి ఒక్కరినీ జీవితంలో విజయం సాధించేలా చేస్తాయన్నారు. అందుకు నిదర్శనం వెన్నెల అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగన్‌గౌడ్ కులకర్ణి, కళా శాల పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వెన్నెల తల్లిదండ్రులు వీరేశం, ఉమాదేశి, కుటుంబ సభ్యులు మహాదేవమ్మ, వినోద్‌కుమార్, విజయ, మంజుల, రాజశేఖర్ పాల్గొన్నారు. వెన్నెలకు ఘన సన్మానం వెన్నెల స్వగ్రామానికి రావడంతో మహబూబ్‌నగర్ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు సోమవారం ఘనంగా సన్మానించారు. ముందు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం షాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ తొలి మెట్రో రైల్‌ను మా ప్రాంతానికి చెందిన యువతి ఆనందంగా ఉందని వారు కొనియాడారు. ఏయిర్‌లైన్ పైలెట్ కావాలన్న వెన్నెల లక్ష్యం నెరవేరాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సీమ నరేందర్, ఎదిర ప్రమోద్ కుమార్, పీఈటీ రమేశ్, సతీష్, రాజశేఖర్, ప్రసాద్, సంజీవ్ ఉన్నారు. -
యువతి అనుమానాస్పద మృతి
మాదాపూర్: 16వ అంతస్తు పై నుంచి పడి ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19) మాదాపూర్ ఖానామెట్‌లోని మినాక్షీ స్కైలాంచ్ ఫోలరీస్ బీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 1606లో అదే ప్రాంతానికి చెందిన యాజమాని మోహన్ కృష్ణరాజు ఇంట్లో గత నెల రోజులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున 16వ అంతస్తు నుంచి వెన్నెల కిందికి దూకింది. పోలీసుల విచారణలో తాను పడుకున్న బెడ్ పై మూత్ర విసర్జన చేసిందని, అది యాజమానికి ఎక్కడ తెలిసిపోతుందోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
16వ అంతస్తు నుంచి పడి.. యువతి...
హైదరాబాద్ : మాదాపూర్‌లోని మీనాక్షి స్కైలాంజ్ అపార్ట్మెంట్ 16వ అంతస్తుపై నుంచి పడి వెన్నెల (19) అనే యువతి మరణించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వాచ్మెన్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిది ఆత్మహత్యా ? లేక హత్య ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వెన్నెల స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి అని పోలీసులు తెలిపారు. -
ఇంట్లో దెయ్యం
‘‘మా చిత్రాన్ని చూసినవారు ఓ మంచి సినిమా చూశామని చెప్పుకునేలా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. సరదాగా నవ్వుతూనే ఉంటారు’’ అని దర్శకుడు ఎంవీ సాగర్ అన్నారు. రుద్ర, వెన్నెల జంటగా ఆయన దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వీరీ వీరి గుమ్మడి పండు’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో కథ తయారు చేసుకుని కిరణ్‌కుమార్‌గారికి చెప్పా. ఫ్యామిలీ, హారర్, కామెడీ తరహా చిత్రమిది. నేను, నిర్మాత, హీరో, హీరోయిన్ అంతా కొత్తవాళ్లమే. 63మంది కొత్తవారితో ఈ చిత్రం తెరకెక్కించాం. ఉమ్మడి కుటుంబమున్న ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం ప్రథమార్ధంలో తెలుస్తుంది. ఆ దెయ్యం ఎవరిలో ఉందనేది ద్వితీయార్ధం . ఫేస్బుక్ ద్వారా పరిచయమైన డాక్టర్‌ను హీరోయిన్గా తీసుకున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని తెలిపారు. -
ఇద్దరు బాలికల అదృశ్యం
చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. బుగ్గవీధిలో మంగళవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న గాయత్రి (12), వెన్నెల (8) కనిపించకుండా పోయారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. జాడ లేకపోవడంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి జరిపించలేదని మహిళా వీఆర్వో ఫిర్యాదు
హయత్ నగర్ : తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయిస్తానని ఒప్పుకొని మాట నిలబెట్టుకోలేదని ఓ మహిళా వీఆర్వో రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. హయత్ నగర్ పోలీసుల కథనం ప్రకారం... ఘట్ కేసర్ మండలంలో వీఆర్వోగా పని చేసే వెన్నెల, హయత్ నగర్ మండలంలో వీఆర్వోగా పని చేస్తున్న వినయ్‌లు ప్రేమించుకున్నారు. వినయ్ పెళ్లికి నిరాకరించడంతో వెన్నెల గతంలో హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినయ్ సహచర ఉద్యోగులు స్పందించి ఇద్దరికి వివాహం చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పట్లో వెన్నెల తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. రెండు నెలలు గడిచినా వివాహం జరిపించకపోవడంతో విసుగు చెందిన ఆమె గురువారం వినయ్‌తో పాటు హామీ ఇచ్చిన సిబ్బంది, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్వో, హయత్ నగర్, కేసు నమోదు, పోలీసులు, వెన్నెల, VRO, hayat nagar, case filed, police,vennela -
వేధింపుల కేసులో గద్దర్ అల్లుడి అరెస్ట్
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను వేధించిన కేసులో ఆమె భర్త ఎం.రవికుమార్(37)ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాజీగూడకు చెందిన రవికుమార్ వెన్నెలను 12 సంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా వెన్నెలను వేధిస్తుండటంతో ఆమె ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు రవికుమార్, అతని సోదరుడు వినోద్‌లను అరెస్ట్ చేసి బుధవారం రిమాండుకు తరలించారు. వెన్నెల ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.