సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.
కాగా, వెన్నెల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నా పేరును పరిశీలిస్తోంది. టికెట్ విషయంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. కంటోన్మెంట్‌లో పుట్టి పెరిగాను. ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గద్దర్ కూతురుగా మీ ముందుకు వస్తున్నాను. ఓట్ల విప్లవం రావాలని గద్దర్ అన్నారు. అందుకే చివరగా కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతుగా నిలిచారు. గద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. కానీ, అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో గద్దర్ భార్య విమల గద్దర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు టికెట్ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. నా కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వండి. వెన్నెలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని అన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా మంచి అనుబంధమే ఉంది. కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ గెలిపించాలని గద్దర్ పలు సందర్భాల్లో కూడా తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment