యువతి అనుమానాస్పద మృతి | The mysterious death of a young woman | Sakshi

యువతి అనుమానాస్పద మృతి

Jul 27 2016 6:51 PM | Updated on Sep 4 2017 6:35 AM

16వ అంతస్తు పై నుంచి పడి ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

మాదాపూర్: 16వ అంతస్తు పై నుంచి పడి ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19) మాదాపూర్ ఖానామెట్‌లోని మినాక్షీ స్కైలాంచ్ ఫోలరీస్ బీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 1606లో అదే ప్రాంతానికి చెందిన యాజమాని మోహన్ కృష్ణరాజు ఇంట్లో గత నెల రోజులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున 16వ అంతస్తు నుంచి వెన్నెల కిందికి దూకింది. పోలీసుల విచారణలో తాను పడుకున్న బెడ్ పై మూత్ర విసర్జన చేసిందని, అది యాజమానికి ఎక్కడ తెలిసిపోతుందోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement