ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను వేధించిన కేసులో ఆమె భర్త ఎం.రవికుమార్(37)ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను వేధించిన కేసులో ఆమె భర్త ఎం.రవికుమార్(37)ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాజీగూడకు చెందిన రవికుమార్ వెన్నెలను 12 సంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు.
కొంతకాలంగా వెన్నెలను వేధిస్తుండటంతో ఆమె ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు రవికుమార్, అతని సోదరుడు వినోద్‌లను అరెస్ట్ చేసి బుధవారం రిమాండుకు తరలించారు. వెన్నెల ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.