రేవంత్‌.. ఇదేమైనా పిల్లల ఆటనా?: బండి సంజయ్‌ ఫైర్‌ | Minister Bandi Sanjay Serious Comments On CM Revanth Over Gaddar | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. గద్దర్‌ను అవమానించింది ఎవరు?: బండి సంజయ్‌ ఫైర్‌

Published Sat, Feb 1 2025 7:33 AM | Last Updated on Sat, Feb 1 2025 7:37 AM

Minister Bandi Sanjay Serious Comments On CM Revanth Over Gaddar

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా గాయకుడు గద్దర్‌ను జీవితాంతం అవమానించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. గద్దర్‌ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సీఎం రేవంత్‌ చిల్లర రాజకీయాలు మానేసి ఆరు గ్యారంటీలు.. 420 నకిలీ వాగ్దానాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని హితువు పలికారు. దీంతో, మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ ట్విట్టర్‌ వేదికగా సీఎం రేవంత్‌కు కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ ట్విట్టర్‌లో..‘పద్మా అవార్డులు ఇవ్వనందుకు నాంపల్లి ఏరియా పేరు మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు నవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఇదేమైనా చిన్న పిల్లల ఆటా సీఎం చెప్పాలి. గద్దర్‌ను జీవితాంతం అవమానించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా?. గద్దర్‌పై ఉపా కేసు ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీనే కదా. గద్దర్ పై 21 కేసులు పెట్టింది ఎవరు?. గద్దర్‌ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా.

పార్టీలను పక్కన పెడితే దుద్దిల్ల శ్రీపాదరావు.. చిట్టెం నరసింహారెడ్డి వంటి నాయకులు.. ఇంకా చాలామంది ఐపీఎస్ అధికారులు.. పోలీసు కుటుంబాలు నక్సలిజానికి బాధితులు కాదా?. తెలంగాణ హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం మాట్లాడే మాటలు ఇవేనా?. సీఎంకు తన ఈగో ప్రదర్శించాలనుకుంటే నాంపల్లి పేరు మార్చుకోవచ్చు. అలాగే సీఎంకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొదట హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా.. నిజామాబాద్ పేరును ఇందూరుగా.. మీ సొంత జిల్లా పేరుని పాలమూరుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాను. ఇకనైనా సీఎం చిల్లర రాజకీయాలు మానుకుని ఆరు గ్యారంటీలు.. 420 నకిలీ వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం మీ జాగీరు కాదు మీరిచ్చిన హామీల అమలు చేసేంత వరకు బీజేపీ మిమ్మల్ని వెంటాడుతుంది’ అంటూ హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement