![Bandi Sanjay Slams Revanthreddy Government](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/bandi%20sanjay%20.jpg.webp?itok=IP7Ew2a6)
సాక్షి,నల్గొండజిల్లా:తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి9) నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.
‘దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులే కరువైంది తెలంగాణలో మాత్రమే.కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్,హరీష్ రావు జైలుకి పోతారని అన్నారు ఏమైంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు,ఫాంహౌస్ కేసులో జైలు అన్నారు ఏమైంది.ఈ ఫార్ములా కేసులో సుప్రీం కోర్టు చెప్పినా ఎందుకు విచారణ ఆగింది.
నిరుద్యోగ భృతి నాలుగువేలు ఏమైంది. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం 56 వేల అప్పు ఉంది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది. తెలంగాణలో విద్యాశాఖ మంత్రే లేడు.స్కూళ్లలో చాక్‌పీసులు కొనుగోలుకు నిధులు లేవు. విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్స్ చేతిలోకి వెళ్లింది. మోదీ ప్రభుత్వం అంబేద్కర్,భగత్ సింగ్,ఆజాద్ వీర్ సావర్కార్‌ను తయారు చేయాలని అనుకుంటోంది.
రేవంత్ సర్కార్ చండ్ర పుల్లారెడ్డి లాంటి నక్సలైట్లను తయారు చేయాలనుకుంటోంది. 317 జీవోపై కొట్లాడి జైలుకు పోయింది మేమే. కులగణన పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కేసీఆర్ సకల జనులసర్వే చేయించి రిపోర్ట్‌ను సంకలో పెట్టుకున్నాడు.కేసీఆర్ సర్వేలో బీసీల శాతం 51 ఉంటే రేవంత్ సర్వేలో 46 శాతం వచ్చింది.
కుల గణనే ఒక బోగస్.తెలంగాణలో ఓటర్లు 3.34 కోట్లు ఉంటే జనాభా 3.7 కోట్లు ఉండటం ఏంటి. తెలంగాణలో 4.3 కోట్లు జనాభా ఉండాల్సి ఉంది.మిగతా 60 లక్షల మందిని కాంగ్రెస్ హత్య చేసిందా? ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ముప్పై మంది బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లీంలు గెలిచారు.బీసీ సంఘాలు ఎటుపోయాయి. తెలంగాణలో హిందువులు అడుక్కోవాలా. రేవంత్ రెడ్డి గ్యాంగ్,ఓవైసీ కుటుంబం హిందువులను రాచిరంపాన పెడుతున్నారు’ అని బండి సంజయ్ ఫైరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment