ఇంట్లో దెయ్యం | Horror, comedy movie | Sakshi
Sakshi News home page

ఇంట్లో దెయ్యం

Published Thu, Feb 25 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

ఇంట్లో దెయ్యం

ఇంట్లో దెయ్యం

‘‘మా చిత్రాన్ని చూసినవారు ఓ మంచి సినిమా చూశామని చెప్పుకునేలా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. సరదాగా నవ్వుతూనే ఉంటారు’’ అని దర్శకుడు ఎంవీ సాగర్ అన్నారు. రుద్ర, వెన్నెల జంటగా ఆయన దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వీరీ వీరి గుమ్మడి పండు’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో కథ తయారు చేసుకుని కిరణ్‌కుమార్‌గారికి చెప్పా.

ఫ్యామిలీ, హారర్, కామెడీ తరహా చిత్రమిది. నేను, నిర్మాత, హీరో, హీరోయిన్ అంతా కొత్తవాళ్లమే. 63మంది కొత్తవారితో ఈ చిత్రం తెరకెక్కించాం. ఉమ్మడి కుటుంబమున్న ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం ప్రథమార్ధంలో తెలుస్తుంది. ఆ దెయ్యం ఎవరిలో ఉందనేది ద్వితీయార్ధం  . ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన డాక్టర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement