ఆయన గ్రేటర్‌లో కార్పొరేటర్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం శ్రీశైల పుణ్యక్షేత్రం వెళ్లారు.