కళాశాలకు వెళుతున్న ఓ విద్యార్థినిని ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది.
హయత్‌నగర్: కళాశాలకు వెళుతున్న ఓ విద్యార్థినిని ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాట సింగారం గ్రామానికి చెందిన అక్తర్ అనే విద్యార్థిని హయత్‌నగర్‌లోని అభ్యాస ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం హయత్‌నగర్‌లో కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.