welfare development
-
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు. -
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్‌ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
జగనన్న సంక్షేమంపై స్పెషల్ కాంటెస్ట్
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్లైన్ పోటీని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు శరత్ ఎత్తపు, తిరుమల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ పోటీని APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయాలని కోరారు. ఎలా చేయొచ్చు అంటే.? ఏపీలో సంక్షేమపథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి? ఆర్ధిక, మౌలిక వసతుల రంగాల్లో ఏపీకి పునర్జీవనం వచ్చిందా ? ప్రజల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం నింపిన వెలుగులపై ఏమనుకుంటున్నారు? మీ ఫోన్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, కింద పేర్కొన్న వెబ్సైట్లో అప్లోడ్ చేయండి బెస్ట్ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయండి ఆసక్తి ఉన్న వారు "మేము సైతం" కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్ బహుమతులు గెలవచ్చన్నారు. వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి కింద రూ.15,000, మూడో బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000, రెండో బహుమతి కింద రూ.3,000, మూడో బహుమతి కింద రూ.2,000 ఇవ్వనున్నట్లు శరత్ చెప్పారు. -
పేదింట అభివృద్ధి
(పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి సాక్షి ప్రతినిధి మేడికొండ కోటిరెడ్డి) : రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమాభివృద్ధి పథకాలు.. కార్యక్రమాల వల్ల పల్లెల్లోని లక్షలాది పేద కుటుంబాల్లో అభివృద్ధితో కూడిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మగౌరవంతో కూడిన ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఆయా కుటుంబాల పెద్దలు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఉండే ఒక రేకుల షెడ్డులో భార్య, భర్త, పెళ్లీడుకొచ్చిన కొడుకుతో కలిసి జీవనం సాగించిన పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామానికి గార్లపాటి కెజియా.. అప్పటిదాకా పనులు చేసుకుంటూ సంపాదించుకున్న సొమ్ముకు ప్రభుత్వ సహకారం తోడు కావడంతో కుమారుడి పెళ్లికి ముందే మూడు గదులు, వరండాతో కూడిన పక్కా ఇంటిని నిర్మించుకోగలిగింది. ఆమె ఇంటి పక్కన నివాసం ఉండే ఆరేటి కోటేశ్వరమ్మ కొడుక్కు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు మరణిస్తే, ఆ కుటుంబంలోనే మరొకరికి కారుణ్య నియామక కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. చేతికి అందివ చ్చి న కొడుకు దూరమైన ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకే ఆమె మూడో కుమారుడికి ప్రభుత్వ వలంటీరుగా అవకాశం దక్కింది. వీరి ఇళ్లకు పక్కనే ఉండే మరో మహిళకు వివాహమై 25 ఏళ్లు అయినా, చెవి దిద్దులు తప్ప మరే ఇతర బంగారు ఆభరణాలు కొనుక్కోలేకపోయానని బెంగపడేది. ఇప్పుడామె ఈ నాలుగున్నరేళ్లలోనే దాదాపు రూ.2 లక్షలకు పైగా విలువైన కొత్త బంగారు ఆభరణాలు కొనుక్కొంది. ఈ ముగ్గురి ఇళ్ల చుట్టుపక్కలే నివాసం ఉండే మేఘన.. వలంటీర్‌గా పని చేస్తూ నెలనెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం పొందడంతో పాటు అంతకు ముందు చేసుకొనే అన్ని పనులను ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకుపోతోంది. వీళ్లంతా ఆ గ్రామంలోని ఒక స్వయం సహాయక పొదుపు సంఘం (యెహోవా) సభ్యులు. ఆసరా ద్వారానే రూ.3.34 లక్షలు లబ్ధి మొత్తం పది మంది సభ్యులు ఉండే ఈ పొదుపు సంఘం పేరిట 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రూ.3,33,440 బ్యాంకు అప్పు ఉండింది. అప్పటి ఎన్నికల్లో హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో చేసిన రుణ మాఫీ మొత్తం నేరుగా వారి చేతికే అందింది. సంఘ సభ్యులు కెజియా, కోటేశ్వరమ్మ, మేఘన.. ఇలా పది మంది ఒక్కొక్కరు ఒక్కో విడతకు రూ.8,336 చొప్పున.. నాలుగు విడతల్లో రూ.33,344 లబ్ధి పొందారు. ఈ సంఘం ఒకసారి రూ.7,50,000 బ్యాంకు రుణం పొందగా, ఒక్కొక్కరూ రూ.75 వేల చొప్పున రుణ లబ్ధి పొందారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రోత్సాహంతో ఈ రుణ మొత్తాన్ని సంఘ సభ్యులందరూ సకాలంలో కిస్తీ రూపంలో చెల్లించారు. 15 రోజుల కిత్రమే మరో విడత ఏకంగా రూ.15,00,000 పొందారు. తద్వారా ఒక్కొక్కరూ రూ.లక్షన్నర దాకా రుణ లబ్ధి పొందారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిరి కాకుండా పొదుపు సంఘాల రుణాలపై వడ్డీని సున్నా వడ్డీ పథకం కింద జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో వారికి మరింత ఊరట లభించింది. గతంలో ఈ సంఘంలోని సభ్యుల కుటుంబాలు తమ కుటుంబానికి ఏ ఆర్థిక అవసరం ఏర్పడినా రూ.100కు నెలకు రూ.2, రూ.3 వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకోనే పరిస్థితి ఉండింది. ఈ నాలుగేళ్లలో వీరు ఏకంగా రూ.22.50 లక్షల రుణం తమ పొదుపు సంఘం ద్వారా పొందడంతో వడ్డీ రూపంలోనే ఒక్కొక్కరూ రూ.25 వేలకు పైబడే అదనపు ప్రయోజనం పొందారు. చేయూత, పింఛను, రైతు భరోసా, ఇతరత్రా లబ్ధి ఈ పేద కుటుంబాలకు ప్రభుత్వ సాయం కేవలం వైఎస్సార్ ఆసరా పథకం ఒక్కటికే పరిమితం కాలేదు. చేయూత కింద ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున అందుతోంది. గార్లపాటి కెజియాకూ, ఆరేటి కోటేశ్వరమ్మకు ఇప్పటికే మూడు విడతలు అందింది. త్వరలో నాలుగో విడత అందనుంది. కెజియా భర్త గార్లపాటి యోహన్‌కు గత 56 నెలల కాలంలో పెన్షన్ రూపంలో రూ.1,32,750.. ఆరేటి కోటేశ్వరమ్మ భర్త ఆరేటి తిరుమలరావుకు రూ.93,750 పెన్షన్‌గా అందింది. కొడుక్కు ఉద్యోగం వచ్చిన కారణంగా కొంత కాలం పింఛను నిలిపి వేసినా, అతను రోడ్డు ప్రమాదంలో మరణించడంలో ఆరేటి తిరుమలరావుకు పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. కోటేశ్వరమ్మ కుటుంబానికి కరోనా సమయంలో ప్రభుత్వ సాయంగా రూ.1000తో పాటు జగనన్న తోడు పథకంలో రెండు విడతల్లో రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందింది. వీరికి రైతు భరోసా పథకం ద్వారా 2022, 2023లో రెండు విడతలుగా రూ.13,500 చొప్పున అందింది. వీరి చిన్న కుమారుడు సురేష్ 2019–20లో డిగ్రీ చివరి సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన పథకం ద్వారా సాయం అందింది. కెజియా కుటుంబానికి కరోనా సాయంగా ప్రభుత్వమిచ్చిన రూ. 1000తో పాటు ఇతర పథకాలన్నీ కలిపి దాదాపు రూ.రెండున్నర లక్షల మేర ప్రయోజనం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా లబ్ధి ► వైఎస్సార్ ఆసరా పథకం సద్వి నియోగం చేసుకోవడం ద్వారా తమ జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులపై 78,189 మంది తమ జీవిత గాధలను వివరిస్తూ వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులపై 76,423 మంది, వైఎస్సార్ పెన్షన్లతో వచ్చిన మార్పుపై 99,436 మంది.. మొత్తంగా 2,54,013 మంది తమ జీవిత గాధలను వీడియోల రూపంలో చిత్రీకరించారు. ► నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం గత చంద్రబాబు ప్రభుత్వ సమయంలో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 11.77 శాతం పేదరికం ఉండగా, 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గింది. ► రాష్ట్రంలో 2020–21తో పోలిస్తే 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 19.79 లక్షల నుంచి 21.65 లక్షలకు పెరిగింది. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కూడ రూ.47,518 చొప్పున పెరగడం గమనార్హం. ► ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా అందజేసే సాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ఏకంగా 18.37 లక్షల మంది ప్రతి నెలా స్థిర ఆదాయం పొందేలా శాశ్వత జీవనోపాధులు ఏర్పాటు చేసుకున్నట్టు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. -
సంక్షేమాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలను పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు మరింత కష్టాల్లోకి నెట్టాయని చెప్పారు. బిల్డింగులు, పరిశ్రమలు, వంతెనలు కడితేనే అభివృద్ధి కాదని, సామాన్యుడి జీవనం బాగుపడాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం దిశగా పయనిస్తోందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెటర్ ఫర్ ఏపీ సొసైటీ పేరుతో పౌరులకు వాస్తవాలను తెలియజేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ ప్రగతి నాడు–నేడు’ సమగ్ర నివేదికను శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, దేశానికి ఆర్థిక శక్తిని అందించడంలో ఏపీ కీలకంగా మారింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్, సోషియో ఎకనామిక్ రిపోర్టు.. ఇలా అన్ని నివేదికల్లో నాలుగేళ్లుగా ఏపీ సాధిస్తున్న వృద్ధి కనపడుతోంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నాలుగేళ్లలో 3.26 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చరిత్రలోనే ప్రథమం. ఫలితంగా పేదలు ఆర్థి క పరిపుష్టి సాధించారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 16.22 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులతో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఏపీలోనే లభిస్తోంది. పరిశ్రమల నెట్ అసెట్ విలువలో దక్షిణాదిన టాప్‌లో, ఫ్యాక్టరీల సంఖ్యలో దేశంలో నాలుగో స్థానం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లలో రెండో స్థానం, ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే.. 2018–19లో తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు ఉంటే ఇప్పుడు 2.30 లక్షలకు పెరిగింది. పేదరికం 6.6 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించిన తీరు సీఎం జగన్ దార్శనికతకు అద్దం పట్టింది. సంక్షేమ పథకాలు లేకుంటే కోవిడ్ సమయంలో ప్రజా జీవనం తల్లకిందులయ్యేది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలకంటే వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది’ అని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నేత్ర వైద్యులు బి.సుబ్బారావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డి్రస్టిక్ట్ గవర్నర్ రామలింగరాజు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర అధ్యక్షుడు అశోక్ కుమార్, రిటైర్డు ప్రొఫెసర్ రెహా్మన్, సీనియర్ జర్నలిస్టు పీజీకే మూర్తి, సామాజికవేత్త అనంత హృదయరాజ్, గీతా విజన్ ట్రస్టు చైర్మన్ గీతా సుబ్బారావు, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో–కన్వినర్ ఎస్.కోటేశ్వరరావు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిల్వెస్టర్, సామాజిక కార్యకర్త బి.జయప్రకాశ్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రంలో నాడు–నేడు అభివృద్ధి’పై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అసత్యాలే వారికి ఆయుధాలు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్. ఏపీలో బాధ్యతాయుత మీడియా సైతం అభివృద్ధి లేదని ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను చూసి ఏపీ అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశాం. మా పరిశీలనలో ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడలేదు. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నాలుగు రెట్ల పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తుంటే తప్పుడు ప్రచారం చేసే మీడియాను అందరూ ఎండగట్టాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోంది. పారిశ్రామిక రంగం వృద్ధి గతంలో 3.2 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. ఒకప్పుడు 60 వేల ఎంఎస్ఎంఈలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.10 లక్షలకు చేరింది. 10 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరిగింది. 600 పెద్ద పరిశ్రమల్లో 6 లక్షలకు పైగా ఉపాధి వచ్చింది. – మేడపాటి వెంకట్, అధ్యక్షుడు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యం సామాజిక మార్పు ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం. జీడీపీ పెరిగిందంటే ప్రజా జీవనం బాగుపడినట్టే. రాష్ట్రంలో పేదరికం తగ్గింది. అంటే సామాజిక న్యాయం కచ్చితంగా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఏకంగా రూ.44 వేల కోట్లు సామాజిక న్యాయానికి ఖర్చు చేసింది. – ఏఆర్ సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు,నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం నిత్యం అప్పులంటూ విష ప్రచారం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తే.. సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు రూ. 2.64 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.77లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది. కానీ, ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రూ.10 లక్షల కోట్లు అప్పు అంటూ దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేవు. అప్పట్లో తెచ్చిన డబ్బంతా ఎటు పోయిందని ఎవరూ అడగట్లేదు. టీడీపీ హయాంలో సంపద పంపిణీ కొంత మంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లింది. – పి.విజయ్‌బాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం సమానత్వం కోసం కృషి జరుగుతోంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏపీలో సమానత్వం కోసం కృషి జరుగుతోంది. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ రూ.21 వేల కోట్లతో 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చారు. అమరావతిలో ఇప్పుడు 50 వేల ఇళ్ల పట్టాలతో రూ.3 లక్షల కోట్ల ఆస్తి రాబోతోంది. – మాదిగాని గుర్నాథం, అధ్యక్షుడు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పేదల అభివృద్ధే నిజమైన సూచీ మనిషి జీవన ప్రమాణం పెరుగుదలే నిజమైన అభివృద్ధికి సూచీ. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం పేదల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతోంది. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. – గౌతమ్‌రెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు హయాంలో దళితులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలంలే సబ్సిడీ వచ్చేది కాదు. కానీ, సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేశారు. ఒక్క కరోనాలోనే రూ. 2 వేల కోట్లు ఎంఎస్ఎంఈల కోసం ఖర్చు చేశారు. జగనన్న బడుగు వికాసం, ఇతర కార్యక్రమాల ద్వారా ఊపిరిపోశారు. దళితులను ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు. – కాలే వెంకటరమణారావు, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
Andhra Pradesh: ఇదిగో మార్పు..
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు అవసరమైన కనీస సామాజిక మౌలిక వసతులను ప్రభుత్వ రంగంలో కల్పిస్తోంది. ఇందుకు ఏకంగా రూ.55,597 కోట్లు వ్యయం చేస్తోంది. తద్వారా గ్రామీణ ముఖ చిత్రంలో సమూల మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక పక్క దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని గత చంద్రబాబు సర్కారు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ఆ రంగాల్లో ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కనీస సామాజిక బాధ్యతగా ఆయా రంగాల్లో ప్రజలకు, రైతులకు అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యయం చేస్తోంది. ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు సచివాలయం కనిపిస్తోంది. అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. మరో నాలుగు అడుగులు వేస్తే డిజిటల్ లైబ్రరీ.. ఇంకో నాలుగు అడుగులు వేస్తే సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ సాక్షాత్కారిస్తోంది. ఇప్పుడు ఏ గ్రామం వెళ్లినా ఈ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విద్యా రంగంలో రూ.16,450.59 కోట్ల వ్యయం మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 61,661 స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా రూ.16,450.69 కోట్లు వ్యయం చేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి దశలో 15,713 స్కూళ్లలో రూ.3,697.86 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఈ స్కూళ్లన్నీ 10 రకాల వసతులతో కార్పొరేట్ స్కూళ్లను మించి సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్లలో రూ.8,000 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. తొలి దశలో ఆయా గ్రామాల్లో రూపు రేఖలు మారిన స్కూళ్లను చూస్తే.. గతానికి, ఇప్పటికి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సకల మౌలిక వసతులు సమకూర్చిన స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నారు. దశల వారీగా గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో రూ.575 కోట్ల వ్యయంతో 3,589 డిజిల్ లైబ్రరీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. పట్టణాల నుంచి సొంతూరు వెళ్లినా, అక్కడి నుంచే పనిచేసేలా డిజిటల్ లైబ్రరీలను చేపడుతున్నారు. చూడ ముచ్చటగా స్కూళ్లు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేక ఆడ పిల్లలు అనేక అవస్థలు పడ్డారు. రేకులు, దుప్పట్లు అడ్డుపెట్టుకునే పరిస్థితులుండేవి. శిథిలమైన బడులు ఆ బడులను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా దీర్చిదిద్దుతున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, సురక్షిత మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా ఫర్నీచర్‌తో పాటు ప్రహరీ.. తదితర మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ బడులు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. తొలి దశ స్కూళ్లలో వచ్చే జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌తో పూర్తిగా డిజిటల్ క్లాసు రూములుగా దర్శనమివ్వనున్నాయి. నాడు–నేడు పేరుతో విద్యా సంస్థల్లో చేపట్టిన పనుల వ్యయం సామాజిక పెట్టుబడిగా.. ప్రజల ఆస్తులుగా పరిగణించాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల చేరికలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయనడానికి పెరిగిన చేరికలే నిదర్శనం. ప్రభుత్వ స్కూళ్లను సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంతో తీర్చిదిద్దుతున్నారు. ఇవి వచ్చే తరం పిల్లల భవిష్యత్ కోసం మన ప్రభుత్వం తీసుకువస్తున్న గొప్ప మార్పుగా విద్యా వేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రజారోగ్యంలో భారీ మౌలిక సౌకర్యాలు ► నాడు–నేడు పేరుతో వైద్య రంగంలోనూ కొత్తగా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల ఆధునికీకరణ, విలేజ్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.16,822 కోట్లు వ్యయం చేస్తోంది. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఐదు కాలేజీల నిర్మాణం 90 శాతం పైగా పూర్తయింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో) ఉంటే కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా 2,100 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల ఆధునికీకరణతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో గతంలో ఏ సర్కారు కూడా ఇన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ► గ్రామ, వార్డు స్థాయిలో క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రజల ముగింటకే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 528 వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా 150 పీహెచ్‌సీలతో పాటు 992 పీహెచ్‌సీలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ► గత చంద్రబాబు సర్కారు వైద్య విద్యా రంగాలల్లో ప్రైవేట్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటే ఇప్పుడు జగన్ సర్కారు ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ సామాజిక బాధ్యను నెరవేరుస్తోంది. రూ.17 వేల కోట్లతో వ్యవ‘సాయం’ ► దేశంలో, రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లోని అత్యధిక ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే. అలాంటి రైతులకు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేస్తోంది. విత్తనం నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► రూ.2269.30 కోట్లతో రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 4095 పూర్తయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అన్ని మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.17 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులను చేపడుతున్నారు. మొత్తం 30 రకాల పనులు చేపడుతున్నారు. ► సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్ రూమ్‌లు, డ్రైయింగ్ ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపడుతున్నారు. డ్రై స్టోరేజీ– డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్ఫ్రా, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ► పాడి రైతుల కోసం ఇప్పటికే తొలి దశలో రూ.399.01 కోట్లతో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టారు. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడి రైతులు పోసే పాల ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తద్వారా ప్రైవేట్ డెయిరీలు కూడా పెంచాల్సిన పరిస్ధితిని తీసుకువచ్చారు. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులకు ఇంత వ్యయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. సచివాలయాలు సామాజిక ఆస్తి ► గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించేందుకు రూ.4,750 కోట్ల వ్యయంతో 10,893 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటికే 5,926 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా ఆయా గ్రామాల ప్రజల సామాజిక ఆస్తిగా నిలిచిపోనున్నాయి. ► రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఆయా గ్రామాల్లోని 1.34 లక్షల మంది యువతీ యువకులు శాశ్వత ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ప్రతి సచివాలయంలోనూ గ్రామ స్థాయిలోనే దాదాపు 600 పౌర సేవలు ఎటువంటి లంచాలు, వివక్షకు తావులేకుండా అందుతున్నాయి. అభివృద్ధి వ్యయం రయ్.. రయ్.. రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా ఏటేటా పెరుగుతోంది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం ఏటేటా తగ్గుతోంది. సామాజిక, కమ్యూనిటీ సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నేరుగా సంబంధించిన కార్యకలాపాలపై చేసే వ్యయమే అభివృద్ధి వ్యయం. ఉదాహరణకు వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై చేసే ఖర్చు అభివృద్ధి వ్యయమే. రాష్ట్రంలో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి సామాజిక రంగ వ్యయం పెరుగుతోంది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహార నిల్వల గిడ్డంగులు సామాజిక రంగ సేవల కిందకు వస్తాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య రంగాల వ్యయం పెరుగుతోంది. – 2020–21 ఆర్థిక ఏడాది నుంచి 2022–23 ఆర్థిక ఏడాది వరకు ఆర్థిక సూచికలపై ఆర్బీఐ అధ్యయన నివేదిక -
CM Jagan Birthday: ప్రజా యోధుడు..
సాక్షి, అమరావతి: సంక్షేమ స్ఫూర్తిదాత.. హరితాంధ్ర రూపశిల్పి.. జలయజ్ఞంతో అపర భగీరధుడిగా తెలుగు ప్రజల హదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయిన దివంగత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి వైఎస్సార్ సీపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. ఎందరో ముఖ్యమంత్రులున్నా వారి కుమారులెవరూ రాజకీయంగా బలమైన ముద్ర వేయలేకపోయారు. దేశంలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే మరణించిన ప్రముఖుల వారసులెవరూ తీవ్రమైన అణచివేత, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొంటూ లక్ష్యాన్ని సాధించిన దాఖలాలు లేవు. సీఎం జగన్ ప్రజల్లోనే ఉంటూ స్థిర సంకల్పంతో తన లక్ష్యాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి దివంగత వైఎస్సార్‌కు మించి మరో రెండడుగులు ముందుకు వేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పరిపాలనలో తండ్రిని మించిన తనయుడుగా రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నారు. నిర్బంధాలను లెక్క చేయకుండా.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను విచారణ కోసమని పిలిచిన సీబీఐ అక్రమంగా అరెస్టు చేసింది. తమ కోసం ఢిల్లీతో తలపడిన వైఎస్ జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేసినా ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను 17 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానంలో రికార్డు మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జనం చిత్తు చేశారు. వైఎస్ జగన్‌ను సీబీఐ అక్రమంగా నిర్బంధించటాన్ని నిరసిస్తూ ‘జగన్ కోసం జనం’ ద్వారా కోటి సంతకాలను సేకరించారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందటాన్ని తట్టుకోలేక వందల మంది గుండె పగిలి అసువులు బాశారు. ఆ కుటుంబాలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని వైఎస్ జగన్ మాట ఇచ్చారు. అందుకు కట్టుబడి ఓదార్పు యాత్ర తలపెట్టిన ఆయన్ను నాడు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వైఎస్ జగన్‌ను అణగదొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ అధిష్టానం చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నుంచి సంక్రమించిన కడప ఎంపీ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఉద్యమబాట పట్టారు. ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షమే.. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్ల కోసం టీడీపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వగా.. సాధ్యమయ్యే హామీలను మాత్రమే జగన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. రైతులు, డ్వాక్రా మహి ళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసగించటాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నైతిక విలువకు తిలోదకాలిచ్చి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఫిరాయింపులకు ప్రోత్సహించటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను వైఎస్ జగన్ బహిష్కరించారు. నేనున్నానంటూ ఆయన చేపట్టిన 3,648 కి.మీ. ప్రజాసంకల్ప పాదయాత్ర 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసింది. ప్రజాభ్యుదయమే ఆశగా.. శ్వాసగా ప్రజాభ్యుదయమే పరమావధిగా వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీని వైఎస్ జగన్ స్థాపించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ జగన్, పులివెందుల శాసనసభ స్థానం వైఎస్ విజయమ్మ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. తమ కోసం నిలబడిన వారిద్దరినీ ప్రజలు రికార్డు మెజార్టీతో జనం గెలిపించారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే కాంగ్రెస్ నుంచి సంక్రమించిన పదవులకు రాజీనామా చేశాకే పార్టీలోకి రావాలని షరతు విధించి రాజకీయాల్లో మాయమవుతున్న నైతిక విలువలను పరిరక్షించేందుకు వైఎస్ జగన్ నడుం బిగించారు. నాడు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ పోరాటం.. దాదాపు 16 నెలల అక్రమ నిర్భందం నుంచి బయటకొచ్చిన వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర విభజనలో కేంద్రం తీరును నిరసిస్తూ ఉద్యమబాట పట్టారు. ఆమరణ దీక్ష చేశారు. లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చారిత్రక విజయంతో.. 2019 సాధారణ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో సాధారణ ఎన్నికల్లో ఈ స్థాయిలో విజయం సాధించిన రాజకీయ పార్టీ మరొకటి లేదు. 2019 మే 30న అధికారం చేపట్టిన తొలి రోజే సంక్షేమాభివృద్ధి పథకాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మూడున్నరేళ్లుగా సుపరిపాలనతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. హామీల్లో ఇప్పటికే 98% అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పి రాజకీయాల్లో నవశకానికి తెరతీశారు. వరుసగా పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధించడం సీఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న మద్దతుకు నిదర్శనం. -
Andhra Pradesh: సుపరిపాలనలో నం.1
సాక్షి, అమరావతి: సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ‘స్కోచ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వరుసగా రెండో ఏడాదీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ఇంటి ముంగిటకే ఫలాలను చేరవేస్తుండటం వల్లే దేశంలో అన్నింటా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని, ‘స్కోచ్’ 2021 సర్వే ఫలితాలే అందుకు నిదర్శనమని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ తొలి ఐదు స్థానాల్లో నిలవకపోవడం గమనార్హం. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్(7), మధ్యప్రదేశ్ (8), అస్సాం(9), హిమాచల్‌ప్రదేశ్ (10), బిహార్(11), హరియాణా (12) ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సమగ్రాభివృద్ధికి తీసుకున్న చర్యలపై స్కోచ్ సంస్థ ఏటా అధ్యయనం చేస్తోంది. సంస్కరణలతో పారదర్శక పాలన.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి పారదర్శక పాలన అందిస్తున్నారు. సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. పట్టణ, నగర ప్రాంతాల్లో వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తెచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఏ సమస్యనైనా నిర్దిష్ట కాలపరిమితితో పరిష్కరించేలా సచివాలయాలకు విధి విధానాలను రూపొందించారు. ఫలితంగా అత్యధిక సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. అర్హులకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లను వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందజేస్తున్నారు. సుపరిపాలన వల్ల అన్ని రంగాల్లోనూ అవినీతికి అడ్డుకట్ట పడింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు ఇవి దోహదం చేశాయి. గ్రామీణాభివృద్ధిలో మొదటి స్థానం.. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారు. ప్రతి సచివాలయంలోనూ సగటున పది మంది చొప్పున ఉద్యోగులను నియమించారు. సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, స్వచ్ఛమైన తాగునీరు, అంతర్గత రహదారులు లాంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శరవేగంగా సాగుతోందని ‘స్కోచ్’ సర్వేలో వెల్లడైంది. దేశంలో గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. శాంతి భద్రతల్లో మేటి.. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉంటేనే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తూ దిశ బిల్లు ద్వారా పిల్లలు, మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. శాంతి భద్రతల విభాగంలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడానికి ఇది దోహదం చేసింది. జిల్లా పరిపాలనలో మొదటి స్థానం.. పరిపాలన సంస్కరణల ద్వారా జిల్లాల్లో యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కలెక్టర్‌తోపాటు నలుగురు జాయింట్ కలెక్టర్లను నియమించారు. దీంతో సంక్షేమాభివృద్ధి పథకాల అమలు శరవేగంగా సాగుతూ ప్రజలకు సత్వరమే ఫలాలు అందుతున్నాయి. జిల్లా పరిపాలన విభాగంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి ఇది బాటలు వేసింది. వ్యవసాయంలో అగ్రభాగాన.. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం మంది ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ వ్యవసాయం, అనుబంధరంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అందజేస్తున్నారు. వ్యవసాయ సహాయకుడి ద్వారా పంటల సాగులో సలహాలు ఇప్పిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులను ఆదుకునేందుకు ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని అందజేసి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన ధర దక్కేలా చేశారు. ఫలితంగా స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వ్యవసాయంలో అగ్రభాగాన నిలిచింది. సర్వేలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్ రాష్ట్రాలుగా గుర్తించారు. స్టార్ రాష్ట్రాలు ఇవీ.. ఆంధ్రప్రదేశ్ (1) పశ్చిమ్‌బంగా (2) ఒడిశా (3) గుజరాత్ (4) మహారాష్ట్ర (5) సర్వేలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను సత్ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు(పర్ఫార్మర్స్)గా పేర్కొన్నారు. పర్ఫార్మర్ రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ (6) ఉత్తరప్రదేశ్ (7) మధ్యప్రదేశ్ (8) అసోం (9) హిమాచల్‌ప్రదేశ్ (10) సర్వేలో 11 నుంచి 15 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు(క్యాచింగ్ అప్)గా గుర్తించారు. క్యాచింగ్ అప్ రాష్ట్రాలు ఇవే.. బిహార్ (11) హర్యానా (12) జమ్మూకశ్మీర్ (13) ఛత్తీస్‌గఢ్ (14) రాజస్థాన్ (15) -
దమ్ముంటే లక్ష కోట్లు తెండి
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నాయకులు బాధ్యతారహితంగా అలవిగాని హామీలు ఇవ్వడం మానుకొని... దమ్ముంటే హైదరాబాద్‌కు కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని తేవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సవాల్ విసిరారు. వరదసాయం కింద కేంద్రం నుంచి నయాపైసా తేలేకపోయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల వేళ... అడ్డగోలుగా మాట్లాడుతోందని మండిపడ్డారు. ‘తెలంగాణకు హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ లాంటిది. నగరం బాగుంటేనే రాష్ట్రంతో పాటు రైతులు బాగుంటారు. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. హైదరాబాద్‌లో అశాంతి చెలరేగితే అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు రావు. నగరంలో బిర్లామందిర్, తాడ్‌బండ్ ఆంజనేయస్వామి వంటి గుడులు ఎన్నో ఉండగా, చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి వద్దే బీజేపీ నేతలు ధర్నా పేరిట ఎందుకు కెలుక్కోవాలి. వారం రోజుల పాటు వాళ్లు కావాల్సినంత వినోదం పంచుతారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్‌కు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని కేంద్రంతో ప్రకటన ఇప్పించాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 150 మందికి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్లో బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో రూ.67 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను విడుదల చేశారు. ‘రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైన ఎన్నిక. విద్వేష, విషప్రచారంతో కూడినహైదరాబాద్ కావాలా? అశాంతి కావాలా? అభివృద్ది కావాలా? అని ప్రజల్లో చర్చ పెట్టండి. గ్రేటర్ ఎన్నికలను రొటీన్‌గా కొట్లాడొద్దు. అభ్యర్థులు గర్వం, అహం లేకుండా టికెట్లు రాని వారిని కూడా కలుపుకొని వెళ్లండి. ప్రగతి నివేదిక మన పార్టీ అభ్యర్థులకు ప్రచార అస్త్రం. శనివారం ఉదయం పార్టీ అభ్యర్థులు అందరూ బీ– ఫారాలు సమర్పించాలి’అని కేటీఆర్ సూచించారు. ఈసారి సెంచరీ కొట్టాల్సిందే ‘గత ఎన్నికల్లో ఒక్క సీటు తేడాతో గ్రేటర్లో సెంచరీ మిస్సయ్యాం. ఈసారి ప్రజల ఆశీర్వాదంతో వందస్థానాల్లో గెలుపొందేలా పార్టీ అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడాలి. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భారీ సంఖ్యలో డివిజన్ల నుంచి కార్యకర్తలు తరలివచ్చేలా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నేను కూడా శనివారం నుంచే రోడ్ షోలలో పాల్గొంటా’అని కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ సొమ్ముతో జరిమానాలు కడతారా... ఇదెక్కడి విడ్డూరం? ‘కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవడంతో పాటు వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాం, వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం నయాపైసా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంది. ఇటీవలి వరదల సమయంలో మనం ప్రజల్లో ఉండి వరదసాయాన్ని అందించాం. కేంద్రం ఇప్పటివరకు నయాపైసా ఇవ్వకున్నా... బల్దియాలో గెలిస్తే ఇంటికి రూ.25 వేలు ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారికి జరిమానా కట్టేందుకు... గుజరాత్, కర్నాటక, యూపీల్లో ఎక్కడైనా ప్రభుత్వ సొమ్ము చెల్లించారా’అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆరేళ్లుగా శాంతిభద్రతల సమస్య లేదని, తాగునీటి సమస్యలు 95 శాతం వరకు పరిష్కరించామని అన్నారు. టికెట్ల కేటాయింపులో సామాజికన్యాయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇస్తూ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించినట్లు కేటీఆర్ వెల్లడించారు. 150 డివిజన్లలో 50 శాతం కింద 75 స్థానాలు మహిళలకు రిజర్వు అయితే... తాము అంతకంటే ఎక్కువగా 85 చోట్ల అవకాశమిచ్చామన్నారు. బీసీలకు 75, ఎస్టీలకు 3, ఎస్సీలకు 13, మైనారిటీలకు 17 స్థానాల్లో టికెట్లు ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, మహిళా కేటగిరీల్లో అన్ని సామాజికవర్గాలకు అవకాశం ఇచ్చామన్నారు. తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన అరవ మాలలకు రెండు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన 8 మందికి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రుల మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్లతో పాటు నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీ ఫారాలు జారీ.. ప్రతిజ్ఞ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న 150 మంది అభ్యర్థులకు కేటీఆర్ బీ ఫారాలు అందజేశారు. నగర ప్రజల సంక్షేమం, అభివృద్ది కట్టుబడి ఉంటామని, అవినీతికి ఆస్కారం లేకుండా జీహెచ్ఎంసీ, ప్రభుత్వం, పార్టీ గౌరవాన్ని నిలబెడతామని, పార్టీ, ప్రజల పట్ల విధేయులుగా ఉంటామని అభ్యర్థులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ @ 6 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం విడుదల చేశారు. ‘హైదరాబాద్– ది రైజింగ్ గ్లోబల్ సిటీ’పేరిట రూపొందించిన ఈ నివేదికలో రంగాల వారీగా మౌలికవసతుల కల్పన కోసం ప్రభుత్వం చేపట్టిన పనులు, వెచ్చించిన నిధుల వివరాలను వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని 1.60 కోట్ల జనాభాతో దేశంలోని మెట్రో నగరాల్లో ఆరో స్థానంలో, అర్బన్ ఎకానమీలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నట్లు ప్రగతి నివేదికలో వెల్లడించారు. ►మెట్రో రైలు, రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యుత్, శాంతిభద్రతలు తదితరాల కోసం ఆరేళ్లలో రూ.67,149.23 కోట్లు వెచ్చించాం. ► దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.17,290 కోట్లతో నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్‌లో ఉంది. 66 స్టేషన్లతో 72 కి.మీ. పొడవుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ► ఎస్ఆర్డీపీ, హెచ్ఆర్డీసీఎల్, సీఆర్ఎంపీ, ఓఆర్ఆర్ ప్రాజెక్టుల ద్వారా రోడ్డు సౌకర్యం కోసం రూ.14,738.55 కోట్ల వ్యయం. 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్‌ఓవర్ బ్రిడ్జీలు, 1 కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. ► రూ.313.65 కోట్లతో 126.2 కిమీ పొడవుతో 137 రోడ్ల నిర్మాణం. మియాపూర్ హెచ్‌టీ లైన్, పాత ముంబై రోడ్డు హెచ్‌టీ లైన్, ప్రశాసన్‌నగర్ లింక్ రోడ్ల పూర్తి. ►రూ.709.49 కోట్లతో 709.49 కి.మీ పొడవునా రోడ్డు నిర్వహణ కార్యక్రమం. ► 158 కి.మీ పొడవునా రూ.3,309 కోట్లతో ఓఆర్ఆర్ అభివృద్ది. ► రూ.14,175 కోట్లతో 4,725 కి.మీ. పొడవైన తాగునీరు, మురుగునీటి పైపులైన్ల నిర్మాణం ►రూ.2,374.36 కోట్లతో నిరంతర విద్యుత్ సరఫరా. ► శాంతిభద్రతల కోసం రూ.1,940.33 కోట్లు, పోలీసు వ్యవస్థ ఆధునీకీకరణ, లక్షకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు. ► రూ.9,700 కోట్లతో 111 చోట్ల లక్ష డబుల్‌బెడ్ రూం ఇళ్లు. ► రూ.1,716.33 కోట్లతో స్వచ్చ హైదరాబాద్, స్వచ్ఛ ఆటోలు, 3 వేలకు పైగా పబ్లిక్ టాయిలెట్లు. రూ.332.70 కోట్లతో హరితహారం. ఆరేళ్లలో 8 కోట్లకు పైగా మొక్కల పెంపకం ► 250 కోట్లతో పార్కులు ► రూ.156.59 కోట్లతో ప్రజారవాణా మెరుగు, రూ.45 కోట్లతో బస్షెల్టర్ల నిర్మాణం. పాదచారుల కోసం 430 కి.మీ. పొడవైన ఫుట్‌పాత్‌లు. ► రూ.66.97 కోట్లతో వైకుంఠధామాలు, రూ.97.37 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు. ► ఐటీ, పారిశ్రామిక రంగంలో మౌలిక వసతులకు రూ.2,115.93 కోట్లు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల రాక... 15 లక్షల మందికి ఉద్యోగాలు. ► రూ.30.51 కోట్లతో బస్తీ దవాఖానాలు, రూ.152.03 కోట్లతో 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకు 40 వేల మందికి భోజనం. -
గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి నాలుగురోడ్ల కూడలిలో నిలబడినట్లుంది. ఏ దిశగా, ఏ వేగంతో వెళ్లాలన్నది త్వరితంగా నిర్ణయించుకోవాల్సిన విషయం. అడ్డగోలు విభజన పరిణామాల్ని దిగమింగుకుని భవిష్య త్తుపై దృష్టిసారించాల్సిన సమయమిది. ముఖ్యంగా పాలకులు దూర దృష్టితో, విశాల దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడాలి తప్ప ఇతరేతర ఒత్తిడులకు తావివ్వరాదు. అన్ని ప్రాంతాలవారూ అభివృద్ధిలో తమకూ సమప్రాధాన్యత దక్కిన ట్లు భావించినప్పుడే ఒక జాతిగా ముందడుగు వెయ్యగలం. ఆ భావన ఆదినుండే పాదుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికను వెల్లడి చేశారు. విద్యాసంస్థల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటు తదితర విషయాల్ని వివరంగా ప్రజల ముందుంచారు. అందులో విజయనగరం జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడమన్నది ఒకటి. జిల్లా ప్రజలకు ఈ హామీ ఎంతో భరోసానిచ్చింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అలాంటి ఉన్నత విద్యాకేంద్రం అవసరమన్నది నాలుగు దశాబ్దాల కల. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా అందుబాటులో ఉండే ఈ వర్సిటీ ఏర్పాటు వల్ల పున రావాస సమస్యలూ తక్కువే. ఆరోగ్య, జీవన ప్రమాణాల స్థాయిని తెలిపే సూచీల్లో అట్టడుగున ఉన్న విజయనగరం జిల్లాకి ఈ విశ్వవిద్యా లయం ఏర్పాటు ఎంతో కొంత అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో ఏర్పాటు కాకపోవచ్చని, విశాఖ జిల్లాలో సబ్బవరం మైదాన ప్రాంతంలో దాని ఏర్పాటుకు అవకాశం ఉందని పత్రికలకు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని రకాలా అనువైన ప్రాంతాన్ని, ఆదివాసులకు అందుబాటులో ఉన్న స్థలాన్ని, పైగా ప్రభుత్వ ప్రణాళికలో భాగమైన హామీని ఉపేక్షించి, వేరే ఆలోచన చెయ్యడం విజయనగర జిల్లా వాసుల్ని నిరాశపర్చింది. గిరిజన సంఘాలూ ప్రజాప్రతినిధులూ, వివిధ సంస్థలు తమ తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహా వ్యతిరేక భావనల్ని ప్రభుత్వం చేజేతులా కొని తెచ్చుకోరాదు. ఏ ప్రాంత ప్రజలకూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావం కలుగకుండా పాలకులే శ్రద్ధ వహించాలి. ఎలాంటి ఒత్తిడులకూ లోబడని దృఢవైఖరితోనే రాష్ట్ర సంక్షేమ సమగ్ర అభివృద్ధి సాధ్యం. డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా -
డీఆర్సీ.. ఏమైనట్టు..?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాల అమలును సమీక్షించే నాథులే లేకపోవడం.. వివిధ శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం.. అధికారుల్లో సమన్వయం కొరవడటంతో జిల్లా ప్రగతి తిరోగమిస్తోంది. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు కావస్తోన్నా ఇప్పటికీ జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించిన దాఖలాలు లేకపోవడమే అందుకు తార్కాణం. జిల్లా ప్రగతికి దిశానిర్దేశం చేసే డీఆర్సీలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం.. ఇన్చార్జ్ మంత్రిని నియమించకపోవడం సంక్షేమాభివృద్ధి పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలుచేయడం, సమస్యలను పరిష్కరించడం, అధికారులను సమన్వయం చేయడం కోసం జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం రివాజు. డీఆర్సీ చైర్మన్ హోదాలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతి మూణ్ణెళ్లకు ఒకసారి సమావేశాలు నిర్వహించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తే ప్రగతిపథంలో దూసుకెళ్లవచ్చునన్నది ప్రభుత్వ భావన. 1995-2004 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ.. 2004-2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఆర్సీలను ఏర్పాటు చేయడమే అందుకు తార్కాణం. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఐదు నెలలు పూర్తికావస్తోన్నా ఇప్పటికీ డీఆర్సీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదు. కనీసం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిని కూడా నియమించలేదు. ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం) కింద శాసనసభ స్థానానికి ఏడాది రూ.కోటి కేటాయిస్తారు. ఇందులో రూ.50 లక్షల విలువైన పనులను ఎమ్మెల్యే, రూ.50 లక్షల విలువైన పనులను ఇన్చార్జ్ మంత్రి ప్రతిపాదిస్తారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో నియోజకవర్గానికి ఆర్పీహెచ్ పథకం కింద ఏటా కేటాయించే 1000 ఇళ్లల్లో 500 గృహాలకు ఎమ్మెల్యే, తక్కిన 500 ఇళ్లకు ఇన్చార్జ్ మంత్రి లబ్ధిదారులను ఎంపి చేసేవారు. కానీ ఇప్పటికీ ఏసీడీపీ, ఆర్పీహెచ్ల కింద నిధులను మంజూరు చేయలేదు. ఇన్చార్జ్ మంత్రి డీఆర్సీకి ఛైర్మన్‌గానూ.. కలెక్టర్ సభ్య కార్యదర్శిగానూ వ్యవహరిస్తారు. డీఆర్సీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే డీఆర్సీ సమావేశాలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతోపాటూ వివిధ శాఖల ఉన్నతాధిరులు అందరూ విధిగా హాజరుకావాలి. ఈ సమావేశాల్లో సంక్షేమాభివృద్ధి పథకాల అమలును సమీక్షించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మినీ అసెంబ్లీగా పరిగణించే డీఆర్సీ సమావేశాలు వివిధ శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుని.. ప్రభుత్వం ఆమోదముద్ర వేసేలా చూస్తుంది. ఇది సంక్షేమాభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసేది. కానీ ఇప్పుడు డీఆర్సీ సమావేశాలు నిర్వహించకపోవడంతో సంక్షేమాభివృద్ధి పథకాలను సమీక్షించలేని దుస్థితి నెలకొంది. అధికారుల మధ్య సమన్వయంలోపించడంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి.పరిపాలన అస్తవ్యస్తంగా మారడం, సంక్షేమాభివృద్ధి పథకాల అమలు పడకేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి ఎద్దడిని నివారించడంలోనూ.. ఉపాధిహామీ పథకాన్ని చేపట్టి వలసలను నిరోధించడంలోనూ, గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులను చెల్లించడంలోనూ అధికారులు విఫలమవుతోండటమే అందుకు నిలువెత్తు నిదర్శనం.