– వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్రలను పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు మరింత కష్టాల్లోకి నెట్టాయని చెప్పారు. బిల్డింగులు, పరిశ్రమలు, వంతెనలు కడితేనే అభివృద్ధి కాదని, సామాన్యుడి జీవనం బాగుపడాలని స్పష్టంచేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం దిశగా పయనిస్తోందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెటర్ ఫర్ ఏపీ సొసైటీ పేరుతో పౌరులకు వాస్తవాలను తెలియజేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ ప్రగతి నాడు–నేడు’ సమగ్ర నివేదికను శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, దేశానికి ఆర్థిక శక్తిని అందించడంలో ఏపీ కీలకంగా మారింది.
ఆర్బీఐ, నీతి ఆయోగ్, సోషియో ఎకనామిక్ రిపోర్టు.. ఇలా అన్ని నివేదికల్లో నాలుగేళ్లుగా ఏపీ సాధిస్తున్న వృద్ధి కనపడుతోంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నాలుగేళ్లలో 3.26 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చరిత్రలోనే ప్రథమం. ఫలితంగా పేదలు ఆర్థి క పరిపుష్టి సాధించారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 16.22 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులతో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఏపీలోనే లభిస్తోంది.
పరిశ్రమల నెట్ అసెట్ విలువలో దక్షిణాదిన టాప్‌లో, ఫ్యాక్టరీల సంఖ్యలో దేశంలో నాలుగో స్థానం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లలో రెండో స్థానం, ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే.. 2018–19లో తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు ఉంటే ఇప్పుడు 2.30 లక్షలకు పెరిగింది. పేదరికం 6.6 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించిన తీరు సీఎం జగన్ దార్శనికతకు అద్దం పట్టింది. సంక్షేమ పథకాలు లేకుంటే కోవిడ్ సమయంలో ప్రజా జీవనం తల్లకిందులయ్యేది.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలకంటే వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది’ అని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నేత్ర వైద్యులు బి.సుబ్బారావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డి్రస్టిక్ట్ గవర్నర్ రామలింగరాజు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర అధ్యక్షుడు అశోక్ కుమార్, రిటైర్డు ప్రొఫెసర్ రెహా్మన్, సీనియర్ జర్నలిస్టు పీజీకే మూర్తి, సామాజికవేత్త అనంత హృదయరాజ్, గీతా విజన్ ట్రస్టు చైర్మన్ గీతా సుబ్బారావు, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో–కన్వినర్ ఎస్.కోటేశ్వరరావు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిల్వెస్టర్, సామాజిక కార్యకర్త బి.జయప్రకాశ్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రంలో నాడు–నేడు అభివృద్ధి’పై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
అసత్యాలే వారికి ఆయుధాలు
సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్. ఏపీలో బాధ్యతాయుత మీడియా సైతం అభివృద్ధి లేదని ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను చూసి ఏపీ అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశాం. మా పరిశీలనలో ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడలేదు.
– వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్
నాలుగు రెట్ల పారిశ్రామిక వృద్ధి
ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తుంటే తప్పుడు ప్రచారం చేసే మీడియాను అందరూ ఎండగట్టాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోంది. పారిశ్రామిక రంగం వృద్ధి గతంలో 3.2 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. ఒకప్పుడు 60 వేల ఎంఎస్‌ఎంఈలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.10 లక్షలకు చేరింది. 10 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరిగింది. 600 పెద్ద పరిశ్రమల్లో 6 లక్షలకు పైగా ఉపాధి వచ్చింది.
– మేడపాటి వెంకట్, అధ్యక్షుడు, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ
సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యం
సామాజిక మార్పు ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం. జీడీపీ పెరిగిందంటే ప్రజా జీవనం బాగుపడినట్టే. రాష్ట్రంలో పేదరికం తగ్గింది. అంటే సామాజిక న్యాయం కచ్చితంగా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఏకంగా రూ.44 వేల కోట్లు సామాజిక న్యాయానికి ఖర్చు చేసింది.
– ఏఆర్ సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు,నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం
నిత్యం అప్పులంటూ విష ప్రచారం
రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తే.. సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు రూ. 2.64 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.77లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది. కానీ, ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రూ.10 లక్షల కోట్లు అప్పు అంటూ దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేవు. అప్పట్లో తెచ్చిన డబ్బంతా ఎటు పోయిందని ఎవరూ అడగట్లేదు. టీడీపీ హయాంలో సంపద పంపిణీ కొంత మంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లింది. – పి.విజయ్‌బాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం
సమానత్వం కోసం కృషి జరుగుతోంది
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏపీలో సమానత్వం కోసం కృషి జరుగుతోంది. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ రూ.21 వేల కోట్లతో 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చారు. అమరావతిలో ఇప్పుడు 50 వేల ఇళ్ల పట్టాలతో రూ.3 లక్షల కోట్ల ఆస్తి రాబోతోంది. – మాదిగాని గుర్నాథం, అధ్యక్షుడు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్
పేదల అభివృద్ధే నిజమైన సూచీ
మనిషి జీవన ప్రమాణం పెరుగుదలే నిజమైన అభివృద్ధికి సూచీ. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం పేదల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతోంది. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి.
– గౌతమ్‌రెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు
చంద్రబాబు హయాంలో దళితులు ఎంఎస్‌ఎంఈలు పెట్టుకోవాలంలే సబ్సిడీ వచ్చేది కాదు. కానీ, సీఎం జగన్ ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేశారు. ఒక్క కరోనాలోనే రూ. 2 వేల కోట్లు ఎంఎస్‌ఎంఈల కోసం ఖర్చు చేశారు. జగనన్న బడుగు వికాసం, ఇతర కార్యక్రమాల ద్వారా ఊపిరిపోశారు. దళితులను ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు. – కాలే వెంకటరమణారావు, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment