![Ys Jagan Meet Visakha Anakapalli And Alluri Districts Ysrcp Leaders](/styles/webp/s3/article_images/2024/09/26/ysjagan1.jpg.webp?itok=WYIJ59YE)
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగనమోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.
ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అవంతి శ్రీనివాస్, కేకే రాజు పాల్గొన్నారు. కాగా, నిన్న(బుధవారం) ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
కాగా, వైఎస్ జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీ (శనివారం) ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు, ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న (శనివారం) ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
![YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం](https://www.sakshi.com/s3fs-public/inline-images/me.jpg)
ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!
Comments
Please login to add a commentAdd a comment