Sidham : లండన్ లో YSRCP భారీ కార్ ర్యాలీ | Siddham Sabha At London By YSRCP Leaders In Support To CM Jagan, Car Rally Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Sidham : లండన్ లో YSRCP భారీ కార్ ర్యాలీ

Published Sun, Mar 10 2024 9:44 PM | Last Updated on Fri, Mar 15 2024 1:51 PM

Sidham Sabha at London by YSRCP leaders in support to CM Jagan - Sakshi

లండన్‌లో ఘనంగా సిద్ధం సభ & కార్‌ ర్యాలీ

ఉత్సాహంగా పాల్గొన్న వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు

సీఎం జగన్ పాలనను కొనియాడిన ప్రవాసాంధ్రులు

మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ వస్తాడని నినాదాలు

#why not 175 వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుపై లండన్ లోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. YSRCP UK కమిటీ ఆధ్వర్యంలో లండన్‌లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా YSRCP సిద్ధం సభను నిర్వహించారు. అనంతరం భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో YSRCP ఘన విజయం సాధిస్తుందని, రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. YSRCP లండన్ కన్వీనర్లు Dr ప్రదీప్ చింతా, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అద్దంకి సిద్ధం సభను పురస్కరించుకుని UKలోని వైఎస్సార్ సిపి అభిమానులు, నాయకులు గత కొన్ని నెలలుగా పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో UKలో నిర్వహించిన 5వ YSRCP సభ ఇది. ఈ కార్యక్రమంలో UK నలుమూలల నుండి YSRCP కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి కిషోర్ మలిరెడ్డి, కిరణ్ పప్పు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సిద్ధం స్మరణతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలకు మరింత వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉందని YSRCP NRI ఛైర్మన్ వెంకట్‌ మేడపాటి  కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. NRIలు ఏవిధంగా ఎన్నికలకు సన్నద్దమవాలో వివరించారు. 

Dr ప్రదీప్‌ చింతా తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సీఎం జగన్ జనరంజక పాలన  చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ దేశంలోనే బెస్ట్ గా నిలిచారని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు వచ్చే పాతికేళ్లు కొనసాగాలని ఆశించారు. 

ఈ సభలో YSRCP నూతన కార్యవర్గాన్ని కన్వీనర్లు సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో UK కమిటీ సభ్యులు శ్రీకాంత్‌ పసుపుల, మన్మోహన్ యమ్మసాని , PC రావు కోడె, అనంత్ రాజ్ పరదేశి, శ్రీనివాస్ తాల్ల, సుబ్బారెడ్డి ఆకేపాటి, శ్రీనివాస్ దొంతిబోయున,  సురేందర్‌ అలవల, రవి మోచర్ల, రాజేష్ యాదవ్‌, వంశీ కృష్ణ మద్దూరి, విజయ్ పెండేకంటి, కార్తీక్ కొలిశెట్టి ,జయంతి రెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, NR నందివెలుగు, మధు గట్టా, వజ్రాల రాజశేఖర్ , సుధాకర్‌ ఏరువ, భస్కర్ మాలపాటి , శ్యామ్ తొమ్మండ్రు , నరసింహారెడ్డి వేములపాటి పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement