లాస్ఏంజెల్స్ : అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ప్రవాసాంధ్ర కార్యకర్తల సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఏడాది మరింత కష్టపడాలని సూచించారు. ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవ వేడుకలో భాగంగా కేక్ కట్ చేశారు.
ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ వైఎస్ జగన్ స్వయంగా రాస్తున్న పాదయాత్రడైరీ చదువుతుంటే.. ప్రజలు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతులు, రైతుకూలీలు పడుతున్నకష్టాలు తెలుస్తున్నాయన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన అబద్దపు హామీలతో ప్రజలు మోసపోయిన విధానం ఎంతో బాధ కలిగిస్తోందని, రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కు వెళ్లిందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిన సాగునీటి, త్రాగునీటి పథకాల్లో మిగిలిన కొద్దిశాతం కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తుందని ప్రవాసాంధ్రులు అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండానే రాష్ట్ర అప్పులు రెండున్నర లక్షలకు ఎలా పెరిగిపోయాయో చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికగా రోజుకి కొంత సమయం కేటాయించి, వైఎస్‌ఆర్‌సీపీ ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధిపథకాలపై ప్రజలకు అవగాహనకల్పిస్తామని ప్రవాసాంధ్రుల తెలిపారు. ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేస్తున్న పోరాటాలను అభినందించారు. తిరుపతిలోని అభయ క్షేత్రం అనాథ పిల్లల కోసం, వైఎస్‌ఆర్‌సీపీ లాస్ ఏంజెల్స్ సభ్యులు వెయ్యి డాలర్లను విరాళంగా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment