roja selvamani
-
రాజకీయాల్లో సత్తా చాటిన వెండితెర మహారాణులు
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అలాంటి రంగంలో సినిమా హీరోయిన్లు రాణించడం అనేది అంత సులభం కాదు. సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే చాలామందిలో చిన్నచూపు కనిపిస్తుంది. అందుకే కొందరు వారిపై నోటికి వచ్చిన కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి. అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కొందరు దూరంగా ఉంటారు. కానీ మరి కొందరు రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు.. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లు కూడా శివంగిలా తనదైన మాటలతో రాజకీయ యుద్ధంలో పోరాడుతున్నారు. వారి పోరాటంలో అవమానాలు ఎదురైనా భూదేవి అంత సహనంతో ఓర్చుకొని అలాంటి వారి బుద్ధి చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజకీయాల్లో రాణించిన వెండితెర మహారాణుల కొందరి గురించి తెలుసుకుందాం. తమిళనాడు అమ్మగా జయలలిత తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని తలచుకుంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు జయలలిత. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. 1948లో జన్మించిన ఆమె.. సినీ నటిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటేలో.. తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది. జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2016 డిసెంబరు 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమె మరణించారు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆర్ కే రోజా చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఆ తర్వాత వరుసగా 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రోజా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగిన రోజా. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకుని. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు రోజా చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆమె పొలిటికల్ జర్నీ కొనసాగుతుంది. కన్నడలో సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత.220 కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్లో స్వీట్‌స్పాట్‌కు చేరుకొన్నాక అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్‌లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున మాండ్య నుంచే పోటే చేస్తానని ఆమె చెప్పారు. విజయశాంతి సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. 25 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఆమె కొనసాగుతున్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి.. ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మెదక్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. అమరావతిని శాసించిన తొల మహిళగా నవనీత్ కౌర్ నవనీత్ స్వస్థలం పంజాబ్. ఆమె తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘శ్రీను వాసంతి లక్ష్మి’తో మొదలుపెట్టి 2010లో కాలచక్రం వరకు దాదాపు 20 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆపై 2011లో ఎమ్మెల్యే రవి రాణాతో పెళ్లి జరగడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. రవి రానాను పెళ్లి చేసుకున్న తర్వాత, నవనీత్ అమరావతికి వచ్చేశారు. తొలిసారి ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అమరావతి నియోజిక వర్గంలో శివసేన నాయకుడు అనందరావ్ అడ్సూల్‌కు విపరీతమైన పట్టు ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. కానీ, నవనీత్ అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేసేవారు. వారి ఇంట్లోకి వెళ్లి వారి కూతురిలా కలిసిపోయారు. 2019 ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి మళ్లీ ఆనంద్‌రావ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాయి. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతున్న నవనీత్ భారీ ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మరావతి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ ఆమె కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో 2021లో లోక్‌సభలో ఆమె తెలుగులో మాట్లాడి తెలుగు వారందిరినీ మురిపించారు. స్టార్ క్యాంపెయినర్‌గా నగ్మా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం లేదు కానీ.. సినీ నటిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా నగ్మా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా.. ఆ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. -
మంత్రి రోజా ఇంట్లో దీపావళి సంబరాలు
-
నాకు పిల్లలు పుట్టరనుకున్నాను: రోజా ఎమోషనల్
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన ఆర్కే రోజా ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్న ఆమె మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. 'ఫ్యామిలీ విషయాల్లో నేను చాలా ఎమోషనల్. ఎందుకంటే నాకు ఫైబ్రాయిడ్ ఉంది. పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. తర్వాత 2000 సంవత్సరంలో లాప్రోస్క్రోపీ జరిగింది. లాప్రోస్క్రోపీ జరిగిన రెండేళ్లకు (2002లో) పెళ్లయింది. 2003లో నాకు పాప పుట్టింది. అయితే గర్భం దాల్చగానే ఆ విషయాన్ని మా డాక్టర్‌కు చెప్పాను. ఆమె ఎగిరి గంతేసింది. నీ ప్రార్థనలు భగవంతుడు విన్నాడు, అందుకే నిన్ను కరుణించాడని సంతోషించింది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనుకుంటున్న సమయంలో తను నా కడుపున పుట్టింది. అందుకే నాకు పాపంటే ప్రాణం.. నా ఇద్దరు పిల్లలకు వారికి నచ్చినట్లే వారి జీవితాలు ఉండాలనుకుంటాను' అని చెప్తూ ఎమోషనలయ్యారు. కాగా రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీపట్టా అందుకున్నారు. మరోవైపు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ప్రేమ తపస్సు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. దానికంటే ముందు తమిళంలో చంబరతిలో నటించారు. ఆ సినిమా తెలుగులో చేమంతి కింద డబ్ అయింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడగా పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి కుమార్తె అన్షుమాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - నటి రోజా
-
ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ?
చెన్నై సినిమా : ప్రముఖ నటి రోజా సెల్వమణి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తమిళ నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, సంగీత కళాకారుల సంఘాలు మే 7న చెన్నైలో ఆమెను ఘనంగా సత్కరించనున్నాయి. ఈ అభినందన సభకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా నేతృత్వ వహించనున్నారు. దీనికి సంబంధించి బుధవారం (ఏప్రిల్ 27) సాయంత్రం స్థానిక అన్నాశాలైలోని ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు భారతీరాజా, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి పూర్వ అధ్యక్షుడు సి. కల్యాణ్, ప్రస్తుత అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, పెప్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి, సంగీత దర్శకుడు దీన తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ రోజా విజయం వెనుక ఆమె భర్త దర్శకుడు ఆర్.కె సెల్వమణి సహకారం ఎంతో ఉందన్నారు. కాగా రోజాను సత్కరించాలని నిర్ణయించిన దక్షిణ భారత సినీ పరిశ్రమకు ఈ సందర్భంగా సెల్వమణి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఆచార్యను వెంటాడుతున్న రాజమౌళి సెంటిమెంట్! ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్కే రోజా అనే నేను..
-
మహేశ్ బాబుపై ఎమ్మెల్యే రోజా ప్రశంసలు.. హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్
Roja Selvamani Said Hatsoff To Mahesh Babu For Helping Childrens: సూపర్‌స్టార్ మహేశ్ బాబు పలు సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్ శ్రీమంతుడు అనిపించుకుంటారు. చిన్నారులకు సహాయం చేసేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేశ్ తాజాగా 'ప్యూర్ లిటిల్ హార్ట్స్' ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్ బాబుపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మహేశ్ బాబును పొగడ్తలతో ముంచేత్తారు. మహేశ్ చేసిన కొత్త పనికి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. 'చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్ బాబుకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను' అని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే పరశురామ్ డైరెక్షన్లో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్గా అలరిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. 🙏🙏🙏 pic.twitter.com/OwXtyz33GD — Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022 -
ఇంద్రభవనం లాంటి నటి రోజా ఇంటిని చూశారా?
MLA RK Roja Nagari Home Tour Video Goes Viral: ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, మరోపక్క బుల్లితెర హోస్ట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈమధ్య సినిమాలకు కాస్త విరామం ఇచ్చినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమం కోసం రోజా తన హెమ్ టూర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు యూట్యూబ్ వేదికగా తమ ఇంటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం రోజా తన హోం టూర్‌ని మాత్రం ఏకంగా టీవీలోనే విడుదల చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. నగరిలో ఇంద్ర భవనం లాంటి తన సొంతింటిని ఎమ్మెల్యే రోజా ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా అనంతరం పూజాగది, బెడ్ రూమ్, హాల్, పిల్లల రూమ్స్ సహా కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంతో విశాలవంతమైన, ఇంద్రభవనం లాంటి రోజా ఇంటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్.. ఆమెతో కలిసి గృహప్రవేశం -
రోజా కూతకు రాగానే మారుమోగిపోయిన స్టేడియం
-
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోజా
-
రోజా కూతురి అరుదైన ఘనత.. పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో
టాలీవుడ్లో 90'లలో నటిగా, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే రోజా సెల్వమణి. సెల్వమణితో వివాహం కాగా వారికి ఓ కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇప్పుడు ఆమె కూతురు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు. అన్షు మాలిక రైటర్, ప్రోగ్రామర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటడంతో యంగ్ సూపర్ స్టార్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో ఇన్‌ప్లూయెన్సర్ యూకే మేగజైన్ ఆమె కవర్ ఫోటోను ప్రచురించింది. ఇలాంటి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్షు తెలిపింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సైతం క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా ఆమె ఫొటో వేసిన సంగతి తెలిసిందే. చదవండి: విరిగిన వేలు.. నొప్పితోనే షూటింగ్ చేసిన అమితాబ్ Anshu Malika Roja Selvamani Awarded ‘Young Superstar' By Influencer Magazine UK | IMUK Awards: Oct 2021 | #anshumalikarojaselvamani #youngsuperstar | Influencer Magazine UKhttps://t.co/GvjAfqjaFd pic.twitter.com/tdnkS32xcS — Influencer Magazine UK (@influencer_uk) September 30, 2021 -
జగనన్నకు పుట్టినరోజు బహుమతి ఇదే: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన వైఎస్ జగన్‌కు పుట్టినరోజు బహుమతి అందజేశారు. ఈ మేరకు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయిన పి. పుష్పకుమారి అనే చిన్నారిని ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటోంది. పుష్ప కుమారికి మెడిసిన్ చేయాలనే లక్ష్యం ఉందని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్ చదవాలని ఎమ్మెల్యే రోజాతో తెలిపిన విద్యార్థిని పుష్పకుమారి. పుష్ప కుమారి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తు చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుష్పను దత్తత తీసుకుంటున్నాని మాటిచ్చారు. చదవండి: సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకున్నాను. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న. అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు @ysjagan అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.#HBDYSJagan#HBDBestCMYSJagan pic.twitter.com/dQUu8rWZer — Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2020 -
లాస్ఏంజెల్స్లో 'ప్రజా సంకల్పయాత్ర' శతదినోత్సవం
లాస్ఏంజెల్స్ : అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ ప్రవాసాంధ్ర కార్యకర్తల సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఏడాది మరింత కష్టపడాలని సూచించారు. ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవ వేడుకలో భాగంగా కేక్ కట్ చేశారు. ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ వైఎస్ జగన్ స్వయంగా రాస్తున్న పాదయాత్రడైరీ చదువుతుంటే.. ప్రజలు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతులు, రైతుకూలీలు పడుతున్నకష్టాలు తెలుస్తున్నాయన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన అబద్దపు హామీలతో ప్రజలు మోసపోయిన విధానం ఎంతో బాధ కలిగిస్తోందని, రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కు వెళ్లిందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిన సాగునీటి, త్రాగునీటి పథకాల్లో మిగిలిన కొద్దిశాతం కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తుందని ప్రవాసాంధ్రులు అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండానే రాష్ట్ర అప్పులు రెండున్నర లక్షలకు ఎలా పెరిగిపోయాయో చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికగా రోజుకి కొంత సమయం కేటాయించి, వైఎస్ఆర్సీపీ ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధిపథకాలపై ప్రజలకు అవగాహనకల్పిస్తామని ప్రవాసాంధ్రుల తెలిపారు. ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న పోరాటాలను అభినందించారు. తిరుపతిలోని అభయ క్షేత్రం అనాథ పిల్లల కోసం, వైఎస్ఆర్సీపీ లాస్ ఏంజెల్స్ సభ్యులు వెయ్యి డాలర్లను విరాళంగా ఇచ్చారు. -
అమ్మ విలువ... ఉన్నప్పుడు తెలియలేదు!
‘నీ నవ్వే చాలు చామంతీ, పూబంతీ...’ అని పాడాలనిపించే నవ్వు రోజాది. చామంతి సినిమాతో మొదలైన ఈ పూబంతి రీల్ సమరాన్ని, రియల్ సమరాలను ఎదుర్కొంటూ నగరి నియోజకవర్గానికి ఎంఎల్ఎ అయ్యారు. ఆమె తొలి సినిమా ప్రేమతపస్సు, తొలి ప్రసంగం తిరుపతిలో శంఖారావం సదస్సు. ఇక టీవీ షోల విషయానికి వస్తే జల్సా ప్రోగ్రామ్‌కి న్యాయనిర్ణేతగా, మోడరన్ మహాలక్ష్మి కార్యక్రమంతో యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఆమెకు మంచి పేరు తెచ్చిన టీవీ షో జబర్దస్త్. సినిమాల్లో రోజా, రాజకీయాల్లో రోజా సెల్వమణిగా మారిన శ్రీలత అంతర్వీక్షణం ఇది. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? నవంబర్ 16వ తేదీ, కడపలో పుట్టా. సొంత ఊరు తిరుపతి దగ్గర చింతపర్తి. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం... నచ్చే లక్షణం... ఎంత పెద్ద టెన్షన్ అయినా త్వరగా ఓవర్‌కమ్ కాగలగడం. నచ్చని లక్షణం... అందర్నీ నమ్మడం. ఎదుటి వారి నుంచి ఏమాశిస్తారు ? నిజాయితీని ఆశిస్తా. ముందు ఒకమాట వెనుక మాట లేని కచ్చితత్వాన్ని కోరుకుంటా. ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ? నేనంటే ఇష్టపడే వారిని. మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోవడం ఇష్టం ? నటిగానా, రాజకీయ రంగంలో ధీర వనితగానా... రెండూనూ. మనీ మేనేజ్మెంట్లో మీరు నిష్ణాతులా ? అవును, ఇంటి నిర్వహణ నేనే చూసుకుంటాను. ఏ కోర్సు చదవాలనుకున్నారు? ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నాను. ఇంట్లో వాళ్లు డాక్టర్ని చేయాలని బైపిసిలో చేర్పించారు. తర్వాత హోమ్‌సైన్స్‌లో జాయిన్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాను. ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు ? చెన్నైలో స్థిరపడాలనుకున్నాను. రాజకీయాలతో హైదరాబాద్‌కి వచ్చాను. కానీ ఎక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానో వారికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? వ్యక్తి కాదు, వ్యక్తులు. మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి, భర్త సెల్వమణి. మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం... ఎంపి శివప్రసాద్ గారు 1998లో నాన్నగారిని అడిగి ప్రచారం కోసం నన్ను తీసుకెళ్లారు. అప్పుడాయన సత్యవేడు ఎంఎల్ఎగా గెలిచి మంత్రయ్యారు. తొలి సంపాదన ఎప్పుడు? 1991లో. చామంతి సినిమాకి అడ్వాన్స్ ఐదు వేలిచ్చారు. చాలా గ్రేట్‌గా అనిపించింది. అత్యంత సంతోషపడిన సందర్భం కూడా అదేనా? అత్యంత సంతోషం అంటే... నా పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, నా పేరు పక్కన ఎంఎల్ఎ అని వేసినప్పుడు. మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన సందర్భాలు! అమ్మాయి... అన్న తర్వాత అలాంటివి తప్పవు. ిసినీనటి అయినప్పుడు బంధువుల మాటలు నొప్పించాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వాళ్లే నా ఓటమికి ప్రయత్నించడం. ఇవి మానసికంగా. భౌతికంగా అయితే ‘సమరం’ సినిమా షూటింగ్ సమయంలో కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు బాధపడ్డాను. మీకు విచిత్రం అనిపించే విషయాలు? సినిమాల్లో డబ్బు తీసుకుని నటిస్తాం. అప్పుడు ప్రజలకు చేసేదేమీ ఉండదు. కానీ బ్రహ్మరథం పడతారు. రాజకీయాల్లో వందమందిలో పదిమందికైనా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. చేతనైన మంచేదో చేద్దాం అని వస్తే... ఏం చేసినా విమర్శిస్తారు. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా మమ్మీ ఉన్నప్పుడు ఆమె విలువ తెలియలేదు. అమ్మ ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోకుండా ఆమెను ఏడిపించేవాళ్లం. మా అమ్మ ఎప్పుడూ ‘నీకు పెళ్లయి కూతురు పుడితే నా విలువ తెలుస్తుంది’ అనేవారు. అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఆమె పట్ల మరింత అక్కర చూపి ఉంటే బావుండేదనిపిస్తుంటుంది. సహాయం పొంది... ద్రోహం చేశారనే ఆరోపణ? చాలామంది ఉన్నారు. అదీ బంధువుల్లోనే. సొంతవాళ్లే అలా చేస్తే బాధనిపిస్తుంది. డబ్బే పరమావధి కాదు. అలాంటిది వాళ్లు డబ్బే ప్రధానం అన్నట్లు ఉంటే కష్టంగా ఉంటుంది. తల్లిగా రోజా గురించి ఒక్కమాటలో... పిల్లలు మెచ్చుకునే విధంగా ఉన్నాను. షూటింగులు, మీటింగుల కారణంగా వాళ్లు నన్ను మిస్ కాకూడదని నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు! పాప (అన్షు మాలిక) పుట్టినప్పుడు... సంతృప్తినిచ్చిన పాత్ర? భైరవద్వీపంలో యువరాణి పాత్ర. ఎప్పుడైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందా? అబద్ధం చెప్పాల్సి వస్తే నవ్వేసి సరిపెడతాను. మీ నవ్వుతో అవతలి వాళ్లు అన్నీ మర్చిపోతారేమో? (మళ్లీ పెద్దగా నవ్వు) దేవుడు వరమిస్తానంటే... కుటుంబంతో సంతోషంగా ఉండాలి. పేదలకు సహాయం చేసే అవకాశం ఇవ్వమంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... ఏదైనా విషయంలో ఎంత గట్టిగా పోరాడతానో. బంధాలు, బంధుత్వాల దగ్గర అంతటి సున్నిత మనస్కురాలిని. - వాకా మంజులారెడ్డి