మహేశ్​ బాబుపై ఎమ్మెల్యే రోజా ప్రశంసలు.. హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్​ | Roja Selvamani Said Hatsoff To Mahesh Babu For Helping Childrens | Sakshi
Sakshi News home page

Roja On Mahesh Babu: మహేశ్​ బాబుపై ఎమ్మెల్యే రోజా ప్రశంసలు.. హ్యాట్సాఫ్ అంటూ పోస్ట్​

Published Sun, Mar 6 2022 3:48 PM | Last Updated on Sun, Mar 6 2022 4:14 PM

Roja Selvamani Said Hatsoff To Mahesh Babu For Helping Childrens - Sakshi

Roja Selvamani Said Hatsoff To Mahesh Babu For Helping Childrens: సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పలు సేవా కార్యక్రమాలతో రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడు అనిపించుకుంటారు. చిన్నారులకు సహాయం చేసేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్‌ సర్జరీలు చేయించిన మహేశ్​ తాజాగా 'ప్యూర్​ లిటిల్ హార్ట్స్'​ ఫౌండేషన్​కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్​ బాబుపై పలువురు సెలబ్రిటీలు సోషల్​ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్​ నటి, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మహేశ్​ బాబును పొగడ్తలతో ముంచేత్తారు. మహేశ్​ చేసిన కొత్త పనికి ట్విటర్​లో ప్రశంసలు కురిపించారు. 'చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్​ బాబుకు హ్యాట్సాఫ్​ చెబుతున్నాను' అని ఓ వీడియోను పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్​ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది. ఇదిలా ఉంటే పరశురామ్​ డైరెక్షన్​లో మహేశ్​ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్​ హీరోయిన్​గా అలరిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement