సూపర్‌స్టార్ మహేశ్ బాబు సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్న మహేశ్ చిన్నారులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఆర్ధికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేష్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.
ఇప్పటికే చిన్నారుల హాస్ట్ సర్జరీల కోసం రెయిన్‌బో, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ తాజాగా రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలసి పనిచేయనుంది. ఇందుకోసం RCHIలో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు..
కాగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏకంగా వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి గొప్ప మనసు చాటుకున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment