
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన వైఎస్ జగన్‌కు పుట్టినరోజు బహుమతి అందజేశారు. ఈ మేరకు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయిన పి. పుష్పకుమారి అనే చిన్నారిని ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటోంది. పుష్ప కుమారికి మెడిసిన్ చేయాలనే లక్ష్యం ఉందని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్ చదవాలని ఎమ్మెల్యే రోజాతో తెలిపిన విద్యార్థిని పుష్పకుమారి. పుష్ప కుమారి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తు చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుష్పను దత్తత తీసుకుంటున్నాని మాటిచ్చారు. చదవండి: సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ‘మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకున్నాను. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున కేవలం బొకేలు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన మన జగనన్నకు ఇదే నా పుట్టినరోజు బహుమతి.. హ్యాపీ బర్త్ డే జగనన్న. అని పేర్కొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..!
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2020
మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు @ysjagan అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది.
పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది.#HBDYSJagan#HBDBestCMYSJagan pic.twitter.com/dQUu8rWZer
Comments
Please login to add a commentAdd a comment