రెండు బటన్లు నొక్కి.. వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలి: మంత్రి రోజా | MInister Roja Comments At Puttur Rural On CM Jagan Ruling | Sakshi
Sakshi News home page

రెండు బటన్లు నొక్కి.. వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలి: మంత్రి రోజా

Published Thu, Mar 7 2024 5:35 PM | Last Updated on Thu, Mar 7 2024 5:45 PM

MInister Roja Comments At Puttur Rural On CM Jagan Ruling - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు మంత్రి రోజా. సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని ప్రశంసించారు. రోజుల తరబడి పెన్షన్‌ కోసం ఎదురుచూసే రోజులు పోయాయని.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్‌ అందిస్తున్నారని తెలిపారు. 

పూత్తురు రూరల్‌ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు(ప్రజలు) తమ కోసం రెండు బటన్లు నొక్కాలని తెలిపారు. మొదటి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు.

ప సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల స్థాయికే వెళ్లే పని లేకుండా ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా సమస్యకు పరిష్కారం అందుతోందని మంత్రి రోజా అన్నారు. ఇంటి వద్దే అర్హులను గుర్తించి స్వయంగా లబ్ధిదారుల అకౌంట్లోకి రుణాన్ని పొందడం జరుగుతుందన్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల రైతులకు నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించి రైతులకు సాయం అందుతోందని తెలిపారు.
చదవండి: పార్లమెంట్‌లోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది: కేశినేని నాని

ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి  మెరుగైన వైద్యం కోసం సిఫార్సు మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నామని రోజా తెలిపారు. సీఎం జగన్‌ గొప్ప గొప్ప వ్యవస్థలను నెలకొల్పాడని, ఇలాంటి సౌకర్యవంతమైన పరిపాలన ఎవరైనా అందించారా అనేది  ప్రజలు ఆలోచించాలని సూచించారు. 

నాడు నేడు కింద పాఠశాలలను మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకు రావడం వల్ల పిల్లలు చదువులు చక్కబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు స్టేట్‌ ర్యాంకుల స్థాయికి ఎదిగారని అన్నారు. విద్యలో జగనన్న తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి కుటుంబంలో  ఏదో ఒక విధంగా లబ్ధి అందించే సహాయ సహకారాలను ప్రజలు  గమనించాలని ప్రజలు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement