సాక్షి, చిత్తూరు జిల్లా: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ,59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.
‘‘వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చాం’’ అని సీఎం చెప్పారు
‘‘ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. పేదవాళ్లు ఆరోగ్యం బాగోలేక అప్పులపాలు కాకూడదని రూ.25 లక్షలకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఇంటి వద్దకే రేషన్, పౌరసేవలు, తలుపుతట్టి పథకాలు.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడి సాయం అందేదా?. గ్రామ సచివాలయాల్లో 600 రకాల సేవలు అందిస్తున్నాం. చంద్రబాబు పాలనలో చేసిన మంచిపని ఒక్కటైనా గుర్తొస్తుందా?. ఇలాంటి వ్యక్తి సూపర్ సిక్స్ అంటే నమ్మొచ్చా?. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలంటే వైఎస్సార్‌సీపీకే ఓటేయండి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
‘‘14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?. 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?. చంద్రబాబు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు నమ్ముతారా?. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్
- జగన్ కు ఓటేస్తే .. పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధి
- పొరపాటున బాబుకు ఓటేస్తే .. పథకాలు ముగింపే
- బాబుకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
- 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
- వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం
- సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందడం గతంలో చూశారా ?
- ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం
- మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం
- మేనిఫెస్టో కు, విశ్వసనీయతకు అర్ధం చెప్పింది మీ బిడ్డే
- మేనిఫెస్టో లోని 99శాతం హామీలను నెరవేర్చాం
- నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం
- ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
- 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు
- 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు
- ఇంగ్లీష్ మీడియంతో పాటు ఐబీ సిలబస్ వరకు వెళ్లాం
- బడులు తెరిచే నాటికి విద్యాకానుక, గోరుముద్ద
- పూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన
- పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో 93% విద్యార్థులకు చదువులు
- ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు
- అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత
- అక్కచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం
- అక్కచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం
- గతంలో లేని విధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం
- ఎన్నడూ లేని విధంగా అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్
- ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు
- రైతు భరోసాతో రైతన్నకు తోడుగా నిలిచాం
- రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
- సకాలంలో ఇన్ ఫుట్ సబ్సిడీ, రైతన్నలకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ
- విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం
- బాబు హయాంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా ?
- డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం
- మత్య్సకారులకు మత్య్సకార భరోసా, లాయర్ల కు లా నేస్తం
- జగనన్న తోడు, చేదోడు తో చిరువ్యాపారులకు తోడుగా నిలిచాం
- పేదవాడి వైద్యం కోసం రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ
- పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరాతో ఆదుకున్నాం
- గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ, డాక్టర్ విలేజ్ క్లినిక్
- పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా ?
- ఏ గ్రామానికి వెళ్లినా 600 సేవలు అందించే గ్రామ సచివాలయం
- గ్రామాల్లోనే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ
- గ్రామాల్లోనే ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్
- 14 ఏళ్లు సీఎం గా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?
- బాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా ?
- 2014 లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా ?
- రూ. 81,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ?
- రూ. 14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా ?
- ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా ?
- ఇంటింటికి జాబు .. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా ?
- రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. చేశాడా ?
- ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అమ్మేశాడు
- సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ?
- ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు .. నిర్మించాడా ?
- చంద్రబాబు సూపర్ సిక్స్, సెవన్ అంటున్నాడు .. నమ్ముతారా ?
- ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట .. నమ్ముతారా ?
చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలే
- ఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా ఆప్యాయత, ఆత్మీయతతో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు
- కేవలం మూడు రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహా సంగ్రామం
- జరగబోయేవి ఇంటింటి అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు
- 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్క స్కీమ్ గానీ గుర్తుకు వస్తుందా?
- అధికారం వస్తే చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలే
- 2014లో ప్రజలు చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేసారు
- ముఖ్యమైన హామీలంటూ చంద్రాబు చెప్పినవాటిలో ఏ ఒక్కటీ చేయలేదు
- రూ.87,612కోట్ల వ్యవసాయరుణాల మాఫీ జరగలేదు
- రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల మాఫీ జరగలేదు
- మహాలక్ష్మీ పథకం కింద రూ.25,000 బ్యాంకుల్లో వేస్తామని ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా వేయలేదు
- ఇంటికో ఉద్యోగం, లేదా ప్రతినెలా రూ.2000 నిరుద్యోగ భృతి అని చెప్పి ఎవ్వరికీ ఇవ్వలేదు
- 3 సెంట్ల స్థలం, కట్టుకునేందకు పక్కా ఇల్లు అని ఒక్క సెంటు స్థలం కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు
- 10వేల కోట్లతో ఏటా బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్‌లూమ్ రుణాల మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సింగపూర్ మించి అభివృద్ధి అన్నది
- ఏదీ జరగలేదు
- ఇలాంటి వాళ్లని నమ్మవచ్చా?
- సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్న చంద్రబాబును నమ్మవచ్చా?
- గత ఎన్నికలప్పుడు చెప్పిన ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో వచ్చాడు
- పేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి.
Comments
Please login to add a commentAdd a comment