Puttur
-
ఇది ముమ్మాటికీ ప్రజలు ఇచ్చిన ఓటమి కాదు
-
పుత్తూరులో సీఎం జగన్ రోడ్ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు జిల్లా: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ,59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.‘‘వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చాం’’ అని సీఎం చెప్పారు‘‘ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. పేదవాళ్లు ఆరోగ్యం బాగోలేక అప్పులపాలు కాకూడదని రూ.25 లక్షలకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఇంటి వద్దకే రేషన్, పౌరసేవలు, తలుపుతట్టి పథకాలు.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడి సాయం అందేదా?. గ్రామ సచివాలయాల్లో 600 రకాల సేవలు అందిస్తున్నాం. చంద్రబాబు పాలనలో చేసిన మంచిపని ఒక్కటైనా గుర్తొస్తుందా?. ఇలాంటి వ్యక్తి సూపర్ సిక్స్ అంటే నమ్మొచ్చా?. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలంటే వైఎస్సార్సీపీకే ఓటేయండి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?. 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?. చంద్రబాబు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు నమ్ముతారా?. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు.ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్ జగన్ కు ఓటేస్తే .. పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధి పొరపాటున బాబుకు ఓటేస్తే .. పథకాలు ముగింపే బాబుకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందడం గతంలో చూశారా ? ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం మేనిఫెస్టో కు, విశ్వసనీయతకు అర్ధం చెప్పింది మీ బిడ్డే మేనిఫెస్టో లోని 99శాతం హామీలను నెరవేర్చాం నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఐబీ సిలబస్ వరకు వెళ్లాం బడులు తెరిచే నాటికి విద్యాకానుక, గోరుముద్దపూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో 93% విద్యార్థులకు చదువులు ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత అక్కచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అక్కచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం గతంలో లేని విధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎన్నడూ లేని విధంగా అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్ ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు రైతు భరోసాతో రైతన్నకు తోడుగా నిలిచాం రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం సకాలంలో ఇన్ ఫుట్ సబ్సిడీ, రైతన్నలకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం బాబు హయాంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా ? డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం మత్య్సకారులకు మత్య్సకార భరోసా, లాయర్ల కు లా నేస్తం జగనన్న తోడు, చేదోడు తో చిరువ్యాపారులకు తోడుగా నిలిచాం పేదవాడి వైద్యం కోసం రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరాతో ఆదుకున్నాం గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ, డాక్టర్ విలేజ్ క్లినిక్ పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా ? ఏ గ్రామానికి వెళ్లినా 600 సేవలు అందించే గ్రామ సచివాలయం గ్రామాల్లోనే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ గ్రామాల్లోనే ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్ 14 ఏళ్లు సీఎం గా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?బాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా ? 2014 లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా ?రూ. 81,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? రూ. 14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా ? ఇంటింటికి జాబు .. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. చేశాడా ? ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అమ్మేశాడు సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు .. నిర్మించాడా ? చంద్రబాబు సూపర్ సిక్స్, సెవన్ అంటున్నాడు .. నమ్ముతారా ? ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట .. నమ్ముతారా ?చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలేఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా ఆప్యాయత, ఆత్మీయతతో వచ్చిన అందరికీ కృతజ్ఞతలుకేవలం మూడు రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహా సంగ్రామంజరగబోయేవి ఇంటింటి అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్క స్కీమ్ గానీ గుర్తుకు వస్తుందా?అధికారం వస్తే చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలే2014లో ప్రజలు చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేసారుముఖ్యమైన హామీలంటూ చంద్రాబు చెప్పినవాటిలో ఏ ఒక్కటీ చేయలేదురూ.87,612కోట్ల వ్యవసాయరుణాల మాఫీ జరగలేదురూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల మాఫీ జరగలేదుమహాలక్ష్మీ పథకం కింద రూ.25,000 బ్యాంకుల్లో వేస్తామని ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా వేయలేదుఇంటికో ఉద్యోగం, లేదా ప్రతినెలా రూ.2000 నిరుద్యోగ భృతి అని చెప్పి ఎవ్వరికీ ఇవ్వలేదు3 సెంట్ల స్థలం, కట్టుకునేందకు పక్కా ఇల్లు అని ఒక్క సెంటు స్థలం కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు10వేల కోట్లతో ఏటా బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్లూమ్ రుణాల మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సింగపూర్ మించి అభివృద్ధి అన్నదిఏదీ జరగలేదుఇలాంటి వాళ్లని నమ్మవచ్చా?సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్న చంద్రబాబును నమ్మవచ్చా?గత ఎన్నికలప్పుడు చెప్పిన ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో వచ్చాడుపేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. -
సీఎం జగన్ పై దాడి...నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని రోజా డిమాండ్
-
రెండు బటన్లు నొక్కి.. వైఎస్సార్సీపీకి అండగా నిలవాలి: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు మంత్రి రోజా. సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని ప్రశంసించారు. రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురుచూసే రోజులు పోయాయని.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. పూత్తురు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు(ప్రజలు) తమ కోసం రెండు బటన్లు నొక్కాలని తెలిపారు. మొదటి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని కోరారు. ప సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల స్థాయికే వెళ్లే పని లేకుండా ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా సమస్యకు పరిష్కారం అందుతోందని మంత్రి రోజా అన్నారు. ఇంటి వద్దే అర్హులను గుర్తించి స్వయంగా లబ్ధిదారుల అకౌంట్లోకి రుణాన్ని పొందడం జరుగుతుందన్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల రైతులకు నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించి రైతులకు సాయం అందుతోందని తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది: కేశినేని నాని ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నామని రోజా తెలిపారు. సీఎం జగన్ గొప్ప గొప్ప వ్యవస్థలను నెలకొల్పాడని, ఇలాంటి సౌకర్యవంతమైన పరిపాలన ఎవరైనా అందించారా అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు. నాడు నేడు కింద పాఠశాలలను మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకు రావడం వల్ల పిల్లలు చదువులు చక్కబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు స్టేట్ ర్యాంకుల స్థాయికి ఎదిగారని అన్నారు. విద్యలో జగనన్న తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా లబ్ధి అందించే సహాయ సహకారాలను ప్రజలు గమనించాలని ప్రజలు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
మంత్రి రోజాపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమన్న వైఎస్ఆర్సీపీ నేతలు
-
పుత్తూరు వైద్యానికి రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఫిదా!
మాది తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు పట్టణం. నా పేరు వీ.బాబు. బాత్రూమ్లో జారిపడ్డాను. నా ఎడమ చేయి విరిగింది. పుత్తూరు కట్టు గురించి నాకు అవగాహన ఉంది. అందుకే నేరుగా ఇక్కడికే వచ్చి కట్టు కట్టించుకున్నాను. మూడుకట్లు పూర్తయ్యాయి. నొప్పి లేదు. చేయి మామూలు స్థితికి వచ్చింది. ఇక్కడి డాక్టర్ల నైపుణ్యం వెలకట్టలేనిది. నా పేరు కే.కన్నభిరామ్. మా ఊరు కాంచీపురం, తమిళనాడు రాష్ట్రం. మోటర్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాను. నా కుడి కాలు తొడ ఎముక విరిగిపోయింది. మూడో కట్టు కట్టుకోవడానికి వచ్చాను. ఈ కట్టుతో నడవగలుగుతానని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి నొప్పి పూర్తిగా తగ్గింది. ఇక్కడ ఫీజు మేము ఇచ్చినంతే తీసుకుంటున్నారు. మానవుని శరీరం మొత్తం ఎముకల గూడు. ఏ అవయవానికి దెబ్బతగిలినా ఆ వ్యక్తి విలవిల్లాడాల్సిందే. అలాంటిది ఏకంగా ఎముకే విరిగిపోవడం, కీళ్లు తొలగిపోవడం లాంటివి జరిగితే ఆ వ్యక్తి బాధ వర్ణణాతీతం. ఇలా విరిగిన, తొలగిన ఎముకలను ఎలా అతికించాలి, ఎలా సరిచేయాలి, నడవలేని వ్యక్తిని ఎలా నడిపించాలి..? అన్న ప్రశ్నలకు సమాధానం ‘పుత్తూరు శల్యంవైద్యం’. నేడు ఆధునిక వైద్య విధానాలు వచ్చినా.. పుత్తూరు కట్టు ముందు అన్నీ తీసికట్టు. ఇది రాజులకు లభించిన వరప్రసాదం. పేద రోగులకు ఆరోగ్యప్రదాయం. వందేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న పుత్తూరు శల్యవైద్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! సాక్షి, తిరుపతి: పుత్తూరు శల్యవైద్యం దైవానుగ్రహంగా ‘రాజు’లకు లభించిన వరప్రసాదం. ఇదే విషయాన్ని సూరపరాజు సుబ్బరాజు వంశస్థులు ఈ వైద్యం పుట్టుక గురించి చెబుతుంటారు. పుత్తూరు మండలం, రాచపాళెంలో 1922లో ఈ వైద్యం పురుడుపోసుకుంది. సూరపరాజు సుబ్బరాజు ఓ రోజు అడవిలో వేటకు వెళ్లి వేటాడిన మాంసపు ముక్కలను చెట్ల ఆకుల్లో చుట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆకుల్లోని ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అదే ఆకులతో ఎముకలు విరిగిన జంతువులకు కట్టుకట్టడం.. ఆ తర్వాత మనుషులకు కట్టుకట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పుత్తూరు శల్య వైద్యం అప్రహితంగా కొనసాగుతోంది. రాచపాళెం గ్రామం నుంచే నేటికీ ఇదే వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. శల్య వైద్య విధానం ఎక్స్‌రే తీయరు. మత్తు మందు ఇవ్వరు. చేతి మునివేళ్లతోనే ఎముక విరిగిందా లేదా గుర్తిస్తారు. తర్వాత తమ రెండు చేతులతో విరిగిన ఎముకలను సరిచేసి కట్ట్టుకడుతారు. ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఆకు పసరుకు కాసింత గుడ్డ, రెండు కోడి గుడ్లు తెల్లసొన, రెండు వెదురు దబ్బలే ఈ వైద్యానికి పరికరాలు. ఎముక విరిగిన, తొలగిన భాగాన దూదిని ఉంచి ఆకు పసరు రాసి గుడ్డ చుడుతారు. ఎముక భాగం కదలకుండా వెదురు దబ్బలను పెట్టి కట్టుకడతారు. ఏడు రోజులకు ఒకసారి వంతున మూడు కట్లు కడతారు. అంతే గాయం నయమవుతుంది. ఇచ్చినంతే ఫీజు రాచపాళెంలోని ప్రధాన ఆస్పత్రిలో పది రూపాయల రశీదు తీసుకొని లోపలికి వెళితే పది నిమిషాల్లో కట్టు కట్టేస్తారు. తర్వాత రోగి తనకు తోచింది ఇస్తే డాక్టర్ ఫీజుగా తీసుకుంటారు. పూర్వీకుల వివరాలు పుత్తూరు శల్యవైద్య వ్యవస్థాపకులు సూరపరాజు సుబ్బరాజు. ఈయనకు నలుగురు తమ్ముళ్లు. వీరిలో ఎస్.మార్కొండేయరాజు, ఎస్.గంగరాజు ఇదే వృత్తిని కొనసాగించారు. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఎస్.చెంగల్రాజు, ఎస్.వెంగమరాజు వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, వారి కుమారులైన ఎస్.ప్రకాష్‌రాజు, కన్నయ్యరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. గంగరాజు కుమారుడైన ఎస్.కృష్ణమరాజు, మార్కొండేయరాజు కుమారులైన రామరాజు, సుబ్రమణ్యంరాజు ఇదే వృత్తిలో కొనసాగారు. పాత తరంలోని ఎస్.కృష్ణమరాజు, ఎస్.ప్రకాష్రాజుతో పాటు సుబ్రమణ్యంరాజు కుమారుడు ఎస్.ప్రతాప్‌రాజు, కన్నయ్యరాజు కుమారుడు ఎస్.బాలసుబ్రమణ్యంరాజు ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రముఖులు ఫిదా! పుత్తూరు శల్యవైద్యం పొంది ఉపసమనం పొందిన వారిలో మాజీ రాష్ట్రపతులు వీవీ.గిరి, నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు టీ.అంజయ్య, నందమూరి తారక రామారావు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం పొందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన వారు విజిటర్స్ బుక్‌లో తమ వివరాలను పొందుపరచడం విశేషం. పేదలకు పూర్తి ఉచితం మా పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్యమిది. మాది నాల్గోతరం. మా వైద్యంలో సక్సస్ రేటు 99.9 శాతంగా ఉంది. వందేళ్ల చరిత్రే ఇందుకు నిదర్శనం. పేదలతోపాటు పుత్తూరు వాసులకు పూర్తి ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలోనే 25 గదులను రోగులకు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రి సమీపంలోనే టీటీడీ వారిచే మరో 25 గదులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎస్.కృష్ణమరాజు, మేనేజింగ్ డైరెక్టర్, పుత్తూరు శల్యవైద్యశాల -
మారిన మందు.. బాలుడికి అస్వస్థత
పుత్తూరు రూరల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన డాక్టర్లకు చెమటలు పట్టించింది. స్థానిక గేటు పుత్తూరులోని శెంగుంధర్ వీధికి చెందిన రాజ్‌కుమార్.. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదేళ్ల తన కుమారుడు రోహిత్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు చూపించాడు. పరీక్షించిన డాక్టర్ సిరప్ రాసిచ్చాడు. తర్వాత చీటీ చూపించి మందు తీసుకెళ్లి 5 ఎంఎల్ తాగించాడు. కొద్ది సేపటికి రోహిత్ కడుపులో మంటగా ఉందని చెప్పడంతో, సిరప్‌ను పరిశీలించి అది ల్యాన్‌డన్ లోషన్‌గా గుర్తించాడు. వెంటనే రోహిత్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్ శంకర్‌నారాయణ పరీక్షించి కడుపులోని మందును వామ్టింగ్ చేయించడంతో పాటు తగిన చికిత్స అందించడంతో నిమిషాల్లోనే కోలుకొన్నాడు. మందు మారడానికి కారణాన్ని అన్వేషించగా.. ఫార్మసిస్ట్ సెలవులో ఉండటంతో సెక్యూరిటీ గార్డ్ (అవుట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న వసంత్ మందును మార్చి ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జరినా సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను తొలగించారు. రోహిత్‌ను మెరుగైన పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మందు మార్చి ఇచ్చిన వసంత్ అనే వ్యక్తి తప్పిదం వల్ల మా బాబు ఇబ్బంది పడ్డాడు గానీ ఇందులో డాక్టర్ల తప్పిదమేమీ లేదని బాలుడి తండ్రి రాజ్‌కుమార్ చెప్పారు. విచారణ జరిపిన ఇన్చార్జి డీసీహెచ్ఎస్ పుత్తూరు రూరల్ః పుత్తూరు ప్రభుత్వ మందు మార్పు–బాలుడి అస్వస్థతపై తిరుపతి డీసీహెచ్ఎస్ వేదసాయి విచారణ చేశారు. ఆదివారం రాత్రి ఆమె పుత్తూరు ఆసుపత్రికి వచ్చి జరిగిన సంఘటపై పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న రోహిత్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సిరప్‌ను ఇచ్చిన అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. జరిగిన మొత్తం సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ డాక్టర్ జరినాకు మెమో ఇచ్చినట్లు తెలిపారు. -
ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా!
పుత్తూరు రూరల్(చిత్తూరు జిల్లా): రెండేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు.. ఆరు నెలల క్రితం తల్లి కూడా కన్నుమూసింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయింది. తల్లిదండ్రులు లేరన్న బాధతో బ్యాంకు ఉద్యోగిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పుత్తూరులో బుధవారం వెలుగుచూసింది. సీఐ లక్ష్మీ నారాయణ కథనం మేరకు.. స్థానిక రెడ్డిగుంట వీధిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్‌గా పనిచేస్తున్న వి.సరస్వతి(38), తన అన్న సుబ్రమణ్యంతో కలిసి నివసిస్తోంది. వీరిరువురూ అవివాహితులే. తండ్రి గోవిందస్వామి విశ్రాంత అటవీ ఉద్యోగి. చదవండి: తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి.. రెండేళ్ల క్రితం తండ్రి, జనవరిలో తల్లి కృష్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగేళ్లుగా తల్లిదండ్రులను కాపాడుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, చివరకు వారిని కోల్పోవడంతో మానసికంగా సరస్వతి కుంగిపోయింది. అన్న సుబ్రమణ్యం మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సరస్వతి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి పిన్నమ్మ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నన్ను ఒంటరిని చేసి అమ్మనాన్నలతో పాటు వెళ్లిపోయావా చెల్లీ.. అంటూ అన్న సుబ్రమణ్యం ఆక్రందన అందరిని కలిచివేసింది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే..! ఈ పాడుబడిన బావిని పూడ్చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉండివుంటే యువతి బతికేది కదా అంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి ఆత్మహత్య చేసుకున్న బావి రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంటూ దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికుల కోరిక మేరకు 24వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.ఏకాంబరం ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డికి బావిని పూడ్చివేయాల్సిందిగా వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్ జనవరి 31వ తేదీ సిబ్బందితో బావిని పూడ్చివేసేందుకు ఉపక్రమించారు. అదే సమయంలో టీడీపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ యుగంధర్ తన అనుచరులతో వచ్చి బావిని పూడ్చేందుకు వీలులేదంటూ అడ్డుకున్నారు. విధులకు అడ్డుతగలడమే కాకుండా దుర్భాషలాడారని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుండా ఉంటే యువతి చావుకు ఆ బావి సాక్షి భూతంగా నిలిచేది కాదని మహిళలు వాపోయారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
లాక్డౌన్: పుత్తూరు కట్టుకు విశ్రాంతి
ఆకుపసరు.. వెదురు దబ్బలతో విరిగిన ఎముకలకు కట్లు కట్టే పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా వందలాది మంది రోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన పుత్తూరు కట్టుకు గతంలో ఎన్నడూ ఇలాంటి అవరోధం కలగలేదు. సాక్షి, పుత్తూరు: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలిక విరామం వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాళెంలో శతాబ్ద కాలంగా శల్యవైద్యశాల ద్వారా విరిగిన ఎముకులకు ఆకు పసురుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే పుత్తూరు కట్టుగా వాసికెక్కింది. సినీ రాజకీయ ప్రముఖుడు ఎన్టీఆర్ మూడుసార్లు ఇక్కడ చికిత్స చేయించుకున్నారు. పల్లెటూరి పిల్ల, సర్దార్ పాపారాయుడు సినిమాల చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడగా.. ఆయనకు పుత్తూరు కట్టు కట్టి సమస్యను పరిష్కరించారు. మాజీ ఉప రాష్ట్రపతి వీవీ గిరి, హీరో కృష్ణంరాజుకు కూడా పుత్తూరు శల్యవైద్యులు సేవలు అందించారు. కొంత కాలం క్రితం ప్రముఖ వైద్య సంస్థల అధినేత డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డికి కూడా సేవలు అందించారు. సగటున రోజూ సుమారు 300 మంది రోగులు చికిత్స కోసం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు వైద్యులు, 50 మంది సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడి వైద్యులు తిరువనంతపురం, బెంగళూరు, ముంబయి తదితర నగరాలకు నెలకు ఒకసారి వెళ్లి సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ సూరపరాజు ప్రతాప్ రాజు తెలిపారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి శల్యవైద్యశాలను మూసివేశారు. ప్రజారవాణాతో పాటు ఇతర రవాణా మార్గాలు మూతబడడంతో రోగుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత తిరిగి ఆస్పత్రిలో వైద్య సేవలను పునరుద్ధరించనున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా.. రోగులతో పాటు వారి బంధువులు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది రోజూ ఆçస్పత్రికి వస్తుంటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆçస్పత్రిని మూసివేశాం. లాక్డౌన్ తరువాత పూర్తిస్థాయిలో రోగులకు చికిత్స అందిస్తాం. పరిస్థితిని రోగులు అర్థం చేసుకుని, సహకరించాలి. – డాక్టర్ కృష్ణంరాజు, శల్యవైద్యులు, పుత్తూరు -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తిరిగి తిరిగి.. చివరకు..
సాక్షి, పుత్తూరు(చిత్తూరు): కుటుంబ పోషణ కష్టంగా మారింది. పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే అప్పులు తీర్చి ఉన్నంతలో జీవించాలని భావించిన ఆయనకు నిరాశే ఎదురైంది. నాలుగేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన కళాశాల మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పుత్తూరులో బుధవారం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాజుకుప్పం గ్రామానికి చెందిన ఎం.మునస్వామి 30 ఏళ్ల క్రితం పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటెండర్‌గా ఒప్పంద ప్రాతిపదికన విధుల్లో చేరారు. 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రిన్సిపల్ ఆయనను పర్మినెంట్ ఉద్యోగిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఆడిటర్ విభాగం అధికా రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. అప్పటి నుంచి తనను పర్మినెంట్ చేయాలని మునస్వామి అధికారులను కలిసి వేడుకున్నారు. ఇది జరుగుతుండగానే మునస్వామి 2015లో ఉద్యోగ విరమణ చేశారు. తన కుటుంబ జీవనం, పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మిగిలిపోయా యి. తీర్చేందుకు తనకు రావాలసిన రిటైర్మెంట్ బెని ఫిట్స్ కోసం నాలుగేళ్లుగా గుంటూరు, కడపలో ఉన్నతాధికారులను కలిసి కోరుతూనే ఉన్నారు. బుధవారం ఉన్నతాధికారి వస్తారనే సమాచారంతో కళాశాలకు వెళ్లారు. ఆయన రాలేదని తెలియడంతో తీవ్ర మనస్తాపం చెంది కళాశాల మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తే తప్ప మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని బంధువులు తేల్చి చెప్పారు. డీఎస్పీ మురళీధర్ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని, కళాశాల సూపరింటెండెంట్, మృతుడి బంధువులతో కలిపి కమిటీగా ఏర్పాటు చేసి కడప ఆర్జేడీ కార్యాలయానికి ఫైల్ పంపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి : కొడుకులు పట్టించుకోవడం లేదని.. -
బాబు పాలనలో జన్మభూమి కమిటీ పేరుతో మాఫీయా
-
‘మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను చూడొద్దంటా’
-
పొరపాటున బాబుకు ఓటేస్తే పెన్షన్, రేషన్ కార్డులు తీసేస్తారు
-
హెరిటేజ్ కోసం చిత్తూరు డైయిరీని మూయించారు
-
‘మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను చూడొద్దంటా’
సాక్షి, పుత్తూరు(చిత్తూరు జిల్లా) : ‘సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడే చూడాలంటా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమాను ఆపాలని కోర్టులకు వెళుతున్నారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలనే చూడాలి. ఆయనను వ్యతిరేకించిన వారిని బతకనివ్వరు. చంద్రబాబు వస్తే మన భూములు, ఇళ్లు ఉండవు’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్ధానాలు గుర్తు తెచ్చుకోమని, మరోసారి అలాంటి అబద్దపు హామీలకు మోసపోవద్దని కోరారు. ప్రసుతం చంద్రబాబు ఇస్తున్న హామీలు, ప్రకటనలు చూసి నమ్మితే నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మినట్టే అని విమర్శించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్కే రోజా, చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి రెడ్డప్పలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. హెరిటేజ్ కోసం చిత్తూరు డైయిరీని మూయించారు ‘చంద్రబాబు సీఎం అయ్యాక రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీలను చంద్రబాబు దగ్గరుండి మూయించారు. ఈ జిల్లా నుంచి సీఎంగా ఉన్న చంద్రబాబు మామిడి రైతులను పీల్చిపిప్పి చేశారు. చిత్తూరు జిల్లాలో గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ రెండూ వాళ్ల పార్టీ నాయకులవే. తోతాపురి మామిడి రైతులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నా కనీస గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంది. హెరిటేజ్ ఫుడ్స్, గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ కలిసి దళారీ వ్యవస్థను ముందుకు తెచ్చాయి. తోతాపురి మామిడి పంటకు కనీసం రూ.16 వేల గిట్టుబాటు ధర కూడా రాకుండా చేశాయి. పాడి రైతులు కూడా బాబు పాలనలో తీవ్రంగా నష్టపోతున్నారు. లీటర్ పాల ధర, వాటర్ ధర సమానంగా ఉన్నాయి. చిత్తూరు డెయిరీ నడిస్తే పాడి రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నా బాబు పట్టించుకోవడం లేదు, కేవలం హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూయించారు. గాలేరి-నగరి ప్రాజెక్ట్ అంచనాలు పెంచి తన బినామీ సీఎం రమేష్‌కు అప్పగించారు. పెన్షన్, రేషన్ కార్డులు తీసేస్తారు అసెంబ్లీలో మహిళల సమస్యల గురించి మాట్లాడిన మీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, దుర్మార్గం. టీడీపీ ఈ ఐదేళ్ల పాలనలో ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూయించారు. బాబుకు మరోసారి ఓటేస్తే ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు కూడా మూతపడి వాటి స్థానంలో ప్రతి గ్రామంలో నారాయణ స్కూల్లు కనపడతాయి. పిల్లలు ఎల్కేజీ చదవాలంటే లక్ష రూపాయల ఫీజు కట్టాలి. బాబుకు ఓటేస్తే పొరపాటున బాబుకు ఓటేస్తే కొన ఊపిరితో ఉన్న 108,104 సర్వీసులు పూర్తిగా మూతపడతాయి, పెన్షన్, రేషన్ కార్డులను తీసేస్తారు, ఫీజు రియింబర్స్ మెంట్ పథకం కూడా రద్దైపోతుంది, పేదలకు ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని పక్కకు పెడతారు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పండి ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రైతుల రుణాలు మాఫీ చేస్తాడని రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావ్
పుత్తూరు: ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు. జత కట్టడం మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం నీ నైజం’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆరు వందల అబద్ధపు హామీలు, పచ్చ మీడియా అండదండలతో గద్దెనెక్కిన చంద్రబాబును రాష్ట్ర ప్రజానీకం నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. టీడీపీ, పవన్ అసలు విడిపోతే కదా పొత్తు గురించి మాట్లాడేందుకని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని స్పష్టం చేశారు. 40 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబుకు సొంతంగా పార్టీ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు. పార్టీలన్నీ విడివిడిగా వచ్చినా, ఒక్కటై వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వ్యాఖ్యానించారు. -
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు..
పుత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నిరసన సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పుత్తూరు రైల్వేస్టేషన్లో రైల్‌రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేస్తుండడం గర్వకారణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని తొలి నుంచి పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్లు ప్యాకేజీ పాట పాడి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నాలుగేళ్లుగా ప్యాకేజీ పాట పాడి ఇప్పుడు హోదా కావాలని అడగడం విడ్డూరంగా ఉందని ఏలుమలై స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణమన్నారు. అంతకుమునుపు స్థానిక బజారువీధిలోని శక్తిగణపతి ఆలయం నుంచి కార్యకర్తలతో కలిసి రైల్వేస్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు ర్యాలీగా వచ్చారు. అనంతరం స్టేషన్ ఎదుట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి తిరుపతి వెళుతున్న మెమో ప్యాసింజర్‌ను అడ్డుకున్నారు. ఇంజిన్ వద్ద అడ్డంగా నిలబడి ప్రత్యేకహోదా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ కొండయ్య, ఎస్ఐ హనుమంతప్ప, రైల్వే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యులు సురేష్‌రాజు, నాయకులు రవిశేఖర్‌రాజు, ప్రతాప్, రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, బాబూరావ్‌గౌడ్, వైఎస్సార్సీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎం మాహీన్, కంచి సుబ్రమణ్యం, నారాయణరెడ్డి, గోవిందస్వామిరెడ్డి, లారీమోహన్,గుణ, మురుగేష్, సంపత్, భాస్కరయ్య, గణేష్, రవి, జేసీబీ బాబు, బైపాస్‌రాజా, దొరస్వామిరెడ్డి, మురళిరాజు, తడుకు బాలాజీ, గూళూరు కరుణ పాల్గొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన ఎంపీలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేకహోదా సాధించే క్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎంపీలు ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ సత్యవేడు సమన్వయకర్త కోనేటి ఆదిమూలం అభిప్రాయపడ్డారు. బుధవారం పుత్తూరులో నిర్వహించిన రైల్‌రోకోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాన్ని ఢిల్లీకి తెలియజెప్పేందుకే రైల్‌రోకో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
మద్యం లోడు లారీ బోల్తా..
పుత్తూరు(చిత్తూరు): చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం లారీ బోల్తా పడిపోయింది. వడమాలపేటకు చెందిన మద్యం వ్యాపారుల లారీ మంగళవారం మధ్యాహ్నం విజయపురి వైపు వైన్ లోడుతో బయలుదేరింది. ఆ వాహనం పుత్తూరు బైపాస్ రోడ్డులో మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. దీంతో లారీలోని మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, డ్రైవర్ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, యజమానులు గ్రామస్తులను నిలువరించారు. పగిలిపోయిన బాటిళ్లను పక్కకు పడేసి, సురక్షితంగా ఉన్న సరుకును మరో వాహనంలో తరలించుకుపోయారు. -
టీచర్ కోసం తరగతుల బహిష్కరణ
పుత్తూర్: టీచర్ బదిలీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనబాట పట్టగా.. వారికి మద్దతుగా తల్లిదండ్రులు కూడా రోడ్డెక్కారు. టీచర్ బదిలీని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూర్‌లో సవితా కుమారి 19 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. తనదైన శైలి బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు తల్లిదండ్రుల్లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కాగా 185 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో సవితా కుమారిని అదనపు టీచర్‌గా గుర్తించిన అధికారులు ఆమెను మరోచోటుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తరగతులను బహిష్కరించి, తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. వీరికి ప్రజాసంఘాలు కూడా మద్దతుగా నిలవడంతో ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగాల్సి వచ్చింది. సవితా కుమారిని బదిలీ చేస్తే దాని ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడుతుందని, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తల్లిదండ్రులు చేసిన డిమాండ్‌పై స్థానిక ఎమ్మెల్యే శంకుతల స్పందిస్తూ... బదిలీని ఉపసంహరించే అధికారం తనకు లేదని, అయితే ప్రభుత్వానికి ఈ మేరకు సిఫారసు చేస్తానంటూ హామీ ఇచ్చారు. అంతేకాక బదిలీ చేయడానికిగల కారణాలను తెలియజేయాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అయితే నిబంధనల మేరకే సవితా కుమారిని బదిలీ చేశామని అధికారులు చెప్పడంతో ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తాము తరగతులకు వెళ్లబోమని విద్యార్థులు ప్రకటించారు. తల్లిదండ్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. -
విద్యుత్ విధానాల్లో సరళీకరణ అవసరం
పుత్తూరు : విద్యుత్ ఉత్పత్తి, వినిమయం వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వ విధానాల్లో సరళీకరణ జరగాలని శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.మునస్వామి అన్నా రు. శుక్రవారం కళాశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోజిత పునరుత్పాదక ఎలక్ట్రికల్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ ఆటోమిషన్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 145 మంది విద్యార్థులు సమర్పించిన పరిశోధనాత్మక పత్రాల్లో 74 మందివి మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. అమర్‌రాజా ఇండస్ట్రియల్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ తిరుపతి హెడ్ దామోదర్‌రావు మాట్లాడుతూ నాణ్యత, స్వచ్ఛత, పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పాదనే దేశ ప్రగతికి మూలమని అన్నారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ హెచ్‌వోడీ డాక్టర్ ఆర్వీఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సదస్సుకు సంబంధించిన బ్రోచర్స్‌ను విడుదల చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదరం, ఆర్ అండ్ డీ డెరైక్టర్ డాక్టర్ జి.నరేష్కుమార్, ఈఈఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఎ.హేమశేఖర్, కో-కన్వీనర్ కె.విజయభాస్కర్ పాల్గొన్నారు. -
ఎంత పని చేశావమ్మా..
రుణాలు ఆమె పాలిట మరణ శాసనాలయ్యాయి... అప్పులు ఆమెను అథఃపాతాళానికి తొక్కేశాయి. వడ్డీలకు అప్పు తీసుకుని వేసిన బోర్లు ఆ కుటుంబాన్నే మింగేశాయి. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానాలు ఆమెకు భరోసా ఇవ్వలేకపోయాయి. తానుపోతే.. పెళ్లికెదిగిన కూతుళ్లు ఏమైపోతారన్న భయం ఆ తల్లిని కుంగదీసింది. రక్తం పంచి ప్రాణం పోసిన తల్లే.. విషమిచ్చే పాషాణమైంది.. చివరికి పెద్దబిడ్డతో పాటు తనూ తనువు చాలించింది. మరో బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పుత్తూరు: ఎన్ని కష్టాలొచ్చినా నిబ్బరంతో ఎదుర్కొన్న బిడ్డల్ని కాపాడుకున్న ఆ తల్లి ఆత్మస్థైర్యాన్ని అప్పులు దెబ్బతీశాయి. తిండికున్నా.. లేకున్నా.. కాడిని నమ్ముకుని జీవించిన తల్లికి. రుణాలు.. పాడెనే మిగిల్చాయి. మనస్సున్న ప్రతి ఒక్కరికీ కదలిస్తున్న ఈ విషాదమంతా...నగరి నియోజకవర్గం మండల కేంద్రమైన నిండ్ర బీసీ కాలనీలోని మాధవి కుటుంబానిదే. వివరాల్లోకి వెళితే... క్రిష్ణయ్య, మాధవి దంపతులు. వీరికి శరణ్య, గాయత్రి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానికంగా వీరికి ఎకరా పొలం ఉంది. ఇందులో బోరు వేసి పంటలు పండించుకుని తద్వారా సంఘంలో గౌరవంగా బతకాలని వారు భావించారు. శరణ్య, గాయిత్రిలను బాగా చదివించాలనుకున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఉన్న పొలంలో మల్లెపూల తోట నాటి సాగు చేస్తే ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అప్పలు చేసి బోర్లు వేశారు. అయినా చుక్కనీరు పడలేదు. దీంతో అప్పులు చేసి 12 బోర్లు వేశారు. అయినా దురదృష్టం వారిని వెంటాడింది. బోర్లనుంచి నీరు రాలేదు సరికదా... అందుకు చేసిన అప్పు రూ.3 లక్షలు కొండలా పేరుకుపోయింది. ఇదే సమయంలో మాధవి డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న రుణం మాఫీ కాలేదు. దీంతో అప్పుతో పాటు వడ్డీ భారీగా కట్టాల్సివచ్చింది. దంపతులిద్దరూ... కూలీ పనులకు వెళ్లగా వచ్చిన సొమ్ము కాస్తా రోజూవారి జీవనానికే సరిపోయేది. ఈ సమయంలో పుత్తూరులోని ఓ ప్రయివేటు జూనియర్ కాలేజీలో పెద్ద కుమార్తె శరణ్య ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుకు ఫీజు చెల్లించాలనే ఒత్తిడి ఏర్పడింది. ఇంట్లో పరిస్ధితి తెలుసుకున్న శరణ్య తన చదువును మానేస్తాని తల్లి మాధవికి తెలిపింది. మూడు రోజులుగా ఇంటిలోనే ఉన్న శరణ్యను చూసిన మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది. చిన్నకుమార్తె గాయత్రీ 8 వ తరగతి చదువుకుంటోంది. ఒకవైపు ఎదిగిన కుమార్తెలు వారిని చదివించలేని పరిస్థితి, అప్పులిచ్చిన వారి ఒత్తిడి సమాధానం చెప్పలేని పరిస్ధితిలో భర్త క్రిష్ణయ్యను చూసి పూర్తిగా నిస్సహాయలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే భర్త ఇంటిలో లేని సమయంలో మాధవి కుమార్తెలిద్దరితో కలసి కఠిన నిర్ణయం తీసుకుని పురుగుల మందు వారికి ఇచ్చి తాను సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు ప్రభావానికి పిల్లలిద్దరూ కేకలు వేయడంతో స్థానికులు వైద్యశాలకు తరలించారు. తల్లి మాధవి, పెద్దకుమార్తె శరణ్యలు మృతిచెందగా గాయిత్రి తిరుపతి రూయాలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది. -
చిత్తూరు జిల్లా కోర్టుకు అల్-ఉమ్మా ఉగ్రవాదులు
చిత్తూరు : గత ఏడాది అక్టోబర్ 5న పుత్తూరులో పట్టుబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 13 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వేలూరు జైలుకు తరలించారు. కాగా పుత్తూరులో ఉగ్రవాదులు మకాం వేశారన్న పక్కా సమాచారం తమిళనాడు పోలీసులకు అందటంతో రాష్ట్ర పోలీసులతో కలిసి కమాండో ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను గత ఏడాది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల కమాండో ఆపరేషన్‌లో బిలాల్ మాలిక్, మున్నా ఇస్మాయిల్ ప్రాణాలతో చేతికి చిక్కగా, వారితోపాటు బిలాల్ భార్య హుస్సేన్ బాను (27), కుమార్తెలు అయేషా (4), ఫాతిమా (3), కుమారుడు యాసిన్ (1)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరినుండి 80 జిలిటెన్‌టిక్స్, ఐఇడిలు, పిస్టల్స్, రెండు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులైన బిలాల్ బృందాన్ని పట్టుకోవడంలో ఆక్టోపస్ పోలీసులుకాని తమిళనాడు, చిత్తూరు జిల్లా పొలీసులు ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా టియర్ గ్యాస్‌తో ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించడం గమనార్హం. -
పుత్తూరు చేరుకున్న జగన్ సమైక్య శంఖారావం
-
అది ‘గాలి’ మాటేనా !
నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు బీరాలు పోతుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మరచిపోతుంటారు. శాసనసభ్యుడి తీరు కారణంగా పుత్తూరులో 80 కుటుంబాలు జీవనోపాధి కరువై రోడ్డున పడి అవస్థలు పడుతున్నాయి. పుత్తూరు, న్యూస్‌లైన్ : ఇక్కడ థర్టిఫైవ్ ఇయర్స పొలిటికల్ ఇండస్ట్రీ..అభివృద్ధి అంతా నా హయాంలో జరిగిందే అంటూ నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు బీరాలు పోతుంటారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మరచిపోతుంటారు. ఆయన తీరు కారణంగా 80 కుటుంబాలు రోడ్డున పడి అవస్థలు పడుతున్నాయి. పుత్తూరులోని కార్వేటినగరం రోడ్డు కూడలి వద్ద సుమారు ఎకరా విస్తీర్ణం కలిగిన కోనేటి స్థలం (రెవెన్యూశాఖ లెక్కల్లో కొలను) ఉంది. కోనేటి గట్టున 40 ఏళ్లుగా 80 కుటుంబాలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాయి. శ్రీ కామాక్షి అంబికా సమేత సదాశివేశ్వర దేవస్థానానికి ధూప దీప నైవేద్యాలకు పన్ను చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధి అనుచరుల్లో ఒకరైన కాంట్రాక్టర్ కన్ను కోనేటి స్థలంపై పడింది. నివాస గృహాలను తొలగించేసి, కోనేరును పూడ్చి వేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే పథకం రూపొందిం చారు. ఇక్కడి 80 కుటుంబాల వారికి కాంప్లెక్స్ గదుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న ముద్దుకృష్ణమ నాయుడు నేరుగా కోనేటి గట్టు నివాసితులతో సంప్రదింపులు జరిపినట్లు పలువురు పేర్కొంటున్నారు. బ్యాంకులతో మాట్లాడి రుణం తీసుకుని ఏడాదిలోపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామనే ముద్దుకృష్ణమనాయుడి హామీతో 2007 జూలై 31న కోనేటి గ ట్టున ఉన్న నివాసాలను తొలగించారు. ఆగమేఘాలపై కోనేరును మట్టితో పూడ్చేశారు. ఇంతవరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది లేదు. మరోవైపు 80 కుటుంబాలు జీవనోపాధి కరువై రోడ్డున పడ్డాయి. మెజారిటీ తగ్గిందనే అక్కసుతోనే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారిన ముద్దుకృష్ణమనాయుడికి పుత్తూరు పట్టణ పరిధిలో మెజారిటీ శాతం తగ్గిందనే అక్కసుతోనే పట్టణాభివృద్ధికి కృషి చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సంపాదన వనరుగా కోనేటి స్థలం సదాశివేశ్వర స్వామి ఆలయ నిర్వహణలో ఉన్న కోనేటి స్థలంపై కొందరి కన్ను పడింది. ఆలయానికి ఆదాయం పేరిట పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు సంపాదన వనరులుగా మారాయి. ప్రతి ఏటా వేలం పాటలో కాంట్రాక్టు పొందుతున్న వారు పవిత్ర ఆలయ స్థలాన్ని అపవిత్రం చేస్తూ నిషేధిత వ్యాపార నిర్వాహకులకు అద్దెకు ఇస్తున్నారు. -
పుత్తురు ఘటనతో..భక్తుల్లో ఆందోళన
-
సహకరించింది ఎవరు?
పుత్తూరు, న్యూస్‌లైన్: వారిది ఉగ్రవాద చరిత్ర. పైకి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటు న్న వారిలా నటించారు. స్థానికులు కాకపోయినా పుత్తూరులో దర్జాగా అద్దె నివాసంలో ఉంటూ మరో కంటికి తెలియకుండా ఉగ్ర కార్యకలాపాలు నడిపిస్తూ చివరికి పోలీసులకు దొరికారు. అయితే, వీరికి స్థానికంగా ఎవరెవరు సహకారం అందించారనే దిశగా పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఉగ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్‌కు పుత్తూరు పట్టణం మేదరవీధిలో అద్దె ఇల్లు ఇప్పించడంలో సహకరించిన వారెవరో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. వీరికి ఎవరెవరితో పరిచయాలున్నాయి, ఆర్నెల్లుగా ఏం చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇన్ని రోజులుగా నివాసముంటున్నా ఏం జరుగుతోందో కనీసం పక్క ఇంటికి కూడా తెలియకుండా జాగ్రత్త వహించారు. అయితే, వేరే రాష్ట్రం నుంచి వచ్చి పుత్తూరులో నివాసం ఉంటూ ఓ వర్గానికి పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో సహకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో మేదరవీధికి పై వీధిలో ఉన్న ఉగ్రవాదులు ప్రస్తుతం పట్టుబడిన ఇంట్లోకి రెండు నెలల కిందటే వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతిలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న పుత్తూరుకు చెందిన వ్యక్తి వీరికి అద్దె ఇల్లు ఇప్పించినట్టు తెలుస్తోంది. ‘చిన్న చిన్న వ్యాపారాలు చేసి జీవనం సాగిస్తారు’ అని అతను ఇంటి యజమానికి చెప్పినట్లు సమాచారం. ఇస్మాయిల్ పుత్తూరుకు రావడానికి ముందు నగరిలోని ఇందిరానగర్‌లో రెండు నెలల పాటు ఉన్నాడని తెలిసింది. అనంతరం ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే పుత్తూరుకు వచ్చేసినట్లు సమాచారం. ఇతను స్థాని కంగా పాతసామాన్ల వ్యాపారాన్ని చేసేవాడు. ఇక, పుత్తూరులో 6 నెలలుగా ఉన్న మరో ఉగ్రవాది బిలాల్ మొదట్లో గృహావసర వస్తువులను విక్రయించేవాడు. తర్వాత పండ్లు, కూరగాయల వ్యాపారం చేశాడు. పోలీసుల పాత్రపై ప్రశంసలు: పుత్తూరులో ఉగ్రవాదులను పట్టుకోవ డానికి జరిగిన సుదీర్ఘ ఆపరేషన్‌లో ఎస్ఐ తులసీరామ్ పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఉగ్రవాదులను పట్టుకోవడంలో, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా తులసీరామ్‌కు పేరుంది. ఉగ్రవాదులు మకాం వేసిన ఇంట్లో ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు ఉండటంతో కాల్పులు జరపొద్దని పైఅధికారులకు తులసీరామ్ నచ్చజెప్పారు. ఒకదశలో తమిళనాడు పోలీసులకు ఓపిక నశించి వాళ్లను చంపేయండన్నారు. అయినప్పటికీ తులసీరామ్ వారికి నచ్చజెప్పి ఇంట్లో ఉన్న ఉగ్రవాదులతో హిందీలో, తమిళంలో మాట్లాడుతూ బయటకు వచ్చి లొంగిపోయేలా చేశారు. -
పోలీసుల పనితీరుపై విమర్శలు
సాక్షి, చిత్తూరు: తీవ్రవాదుల ఉనికి వెలుగుచూడటంతో పుత్తూరు పోలీసు సబ్‌డివిజన్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏడాదిగా తీవ్రవాదులు ఉంటున్న ఇంటికి పుత్తూరు పోలీసుస్టేషన్, డీఎస్పీ కార్యాలయం కూతవేటు దూరంలో ఉన్నాయి. ఆపరేషన్ లైవ్ షో.... ఇటీవల సినిమాల్లో పోలీసు ఆపరేషన్లు చూపిన తీరులోనే పుత్తూరు పోలీసు ఆపరేషన్ జరిగింది. తమిళనాడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, తిరుమల ఆక్టోపస్ కమాండోలు మిద్దెలపైకి వెళ్లి పొజిషన్ తీసుకున్నారు. తీవ్రవాదులు ఉంటున్న వీధిలో తెల్లవారుజామునే కాల్పులమోత, పోలీసుల అరుపులతో దద్దరిల్లడంతో ఏం జరుగుతుందో అర్థంకాక స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రవాదులు ఉన్న ఇంటికి సమీపంలోని ఇళ్ల నుంచి జనాన్ని ఖాళీ చేయించారు. అక్కడ ఏం జరుగుతున్నదీ ప్రజలకు కనబడకుండా పరదాలు కట్టారు. తమిళనాడు, తిరుపతి నుంచి వచ్చిన లైవ్ మీడియా వెహికల్స్ ఏం జరుగుతుందో చిత్రీకరించేందుకు పోటీలు పడ్డాయి. జనం కూడా భయపడకుండా రైల్వే ఓవర్బ్రిడ్జిపైన, ట్రాక్‌పైన, చుట్టుపక్కల ఉన్న ఇళ్ల డాబాలపైన ఎక్కి చూస్తూ నిలబడ్డారు. తీవ్రవాదులను అరెస్ట్ చేశాక ఆ ఇళ్లు చూసేందుకు జనం పోటీపడ్డారు. -
‘తీవ్ర’ అలజడి
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పుత్తూరులో ఇద్దరు తీవ్రవాదులు శనివారం పట్టుబడ్డారు. ఆరేళ్ల క్రితం మదనపల్లెలో షెల్టర్ తీసుకున్న పేరు మోసిన ఒక కాశ్మీర్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. తర్వాత ఏకంగా పుత్తూరులో ఏడాదిగా కాపురం ఉంటూ తీవ్రవాదులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా నేతృత్వంలో తమిళనాడు, ఆంధ్ర పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు పుత్తూరు ఆపరేషన్‌లో కాల్పులు జరపకుండా టియర్ గ్యాస్ ప్రయోగించి తీవ్రవాదులను అరెస్టు చేశారు. ముందుగా తీవ్రవాదులు బయట ప్రాంతాల వారితో మాట్లాడకుండా జామర్లు పెట్టి మొబైల్ సిగ్నల్స్ లేకుండా చేశారు. పట్టుబడిన తీవ్రవాదుల ఇంట్లో పేలుడు పదార్థాలు తయారీకి ఉపయోగించే విడి పరికరాలు పోలీసులకు దొరి కాయి. ఒక పిస్టల్, రెండు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల తీవ్రత ఎక్కువని చెప్పిన జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా ఆ తరువాతే తిరుమలలో ఉన్న తీవ్రవాద వ్యతిరేక పోరాట దళం(ఆక్టోపస్) కమాండోలను యుద్ధప్రాతిపదికన రం గంలోకి దించారు. ఉదయం సమాచారం అం దిన వెంటనే ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి తీవ్రవాదుల ఆట ఎలా కట్టించాలనే దానిపై తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అనుక్షణం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తూ ఇం టి లోపలున్న మహిళ, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసి, విజయవంతం గా పుత్తూరు ఆపరేషన్ పూర్తి చేశారు. తీవ్రవాదులను చెన్నయ్ పోలీసులకు అప్పగించారు. ఎవరికీ అనుమానం రాకుండా.... పుత్తూరులో ఏడాదిగా గేటు పుత్తూరులోని మేదరవీధిలో బిలాల్, ఇస్మాయిల్ తమ కుటుంబం సహా కాపురం ఉంటున్నారు. పెంకుటింట్లో తీవ్రవాది బిలాల్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ఉండేవారు. పక్కనే ఉన్న ఇంటి మిద్దిపైన గదిలో ఇస్మాయిల్ ఉండేవాడు. శనివారం బాంబు స్క్వాడ్ ఒక ట్రంకు పెట్టెను స్వాధీనం చేసుకుంది. ఇందులో పెద్ద ఎత్తున కరెన్సీ ఉన్నట్లు సమాచారం. అలాగే బాంబులు తయారు చేసేందుకు వాడే విడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, రద్దీ ప్రాంతాలు, ఆలయాల వద్ద బాంబులు పేల్చాలనే లక్ష్యంతో పేలుడు పదార్థాలు తయారీ సొంతంగా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల తీవ్రవాదులు అలిపిరి ప్రాంతంలో, సీఎం సొంత ఊరు నగరిపల్లె వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీరికి ఏఏ తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కోణంలోనూ నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. మేదరవీధిలో ఇరుగు పొరుగు వారితో కూడా తక్కువ సంబంధాలు కలిగి, బయట కూడా మౌనంగా ఉండేవారని ఆ వీధి వాసులు చెబుతున్నారు. నిద్రపోతున్న నిఘా సంస్థలు: తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా వేసేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం యూనిట్ తిరుపతిలో ఉంది. ఈ యూనిట్‌ను హైదరాబాదు నుంచి ఉన్నతాధికారులు సమన్వయం చేస్తుం టారు. తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా మొత్తం మీద అనుమానితుల కదలికలు, గతంలో తీవ్రవాద చరిత్ర ఉండి జిల్లాలో సంచరిస్తున్నవారు ఎవరైనా ఉంటే తిరుపతిలోవారి వివరాలు ఈ నిఘా సంస్థ ఆరా తీయాలి. వీరితో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తిరుపతిలో ఉంది. ఇవికాకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ తరహా కదలికలపై నిఘా వేసి ప్రత్యేక సమాచారం తెలుసుకునేందుకు స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు ఉన్నారు. ఇన్ని నిఘా సంస్థలు ఉన్నా ఏడాదిగా పుత్తూరులో తీవ్రవాదులు ఏకంగా కాపురం పెట్టి, స్టీల్ సామాన్లు అమ్మే వారిగా చలామణి అయ్యారంటే మన నిఘా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందనేది అర్థమవుతోంది. పుత్తూరులో తీవ్రవాదులు ఉన్నారని విషయం తమిళనాడు పోలీసులు చెబితేనే తెలిసింది. జిల్లాలో ఇంకా ఎవరైనా తీవ్రవాదులు తలదాచుకున్నారని నిఘా సంస్థలు ఆరా తీస్తే మంచిది. -
పుత్తూరు ఆపరేషన్ సక్సెస్
పుత్తూరు, న్యూస్‌లైన్:జిల్లాలో తీవ్రవాదుల ఉనికి చోటుచేసుకోవడం ఇదే ప్రథమమని జిల్లా ఎస్పీ క్రాంతి రాణాటాటా తెలిపారు. శనివారం పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇస్లామిక్ ఉగ్రవాదులైన బిలాల్, ఇస్మాయిల్‌లను పుత్తూరులో అదుపులోకి తీసుకోవడానికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందన్నారు. చెన్నైలో పట్టుబడిన ఉగ్రవాది పోలీస్ ఫకృద్దీన్‌ను విచారించగా పుత్తూరులో మరికొందరు ఉన్నట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. దీని ఆధారంగా తమిళనాడు పోలీసులు తీవ్రవాదులను పట్టుకోవడానికి తనను సంప్రదించడంతో నగరి పోలీసుల సాయాన్ని తీసుకోవాలనే సూచనల మేరకు శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తమిళనాడుకు చెందిన సీఐ లక్ష్మణ్ బృందం గేటు పుత్తూరులో తీవ్రవాదులు ఉన్న ఇంటి తలుపులు తట్టారన్నారు. ఉగ్రవాదులు అప్రమత్తమై సీఐ లక్ష్మణ్‌ను లోపలికి లాగి ఆయన తలపై తీవ్రంగా గాయపరచడంతో అక్కడే ఉన్న పోలీసులు కాల్పులు జరిపారన్నారు. దీంతో ఉగ్రవాదులు గాయపడిన సీఐ లక్ష్మణ్‌ను బయటకు తోసేసి తలుపులు వేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఇస్మాయిల్ అనే ఉగ్రవాది కాలికి బుల్లెట్ గాయం తగిలినటు ్లపేర్కొన్నారు. ఆక్టోపస్ కమాండోలు రంగంలోకి దిగి తీవ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టుముట్టి ఇంటిపై నుంచి రంధ్రంలో టియర్ గ్యాస్ విడుదల చేశారని తెలిపారు. దీంతో ఊపిరాడ క ఉగ్రవాది బిలాల్ తన భార్య, ముగ్గురు పిల్లలను బయటకు పంపించేశారని పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని ఇంటిలోపలున్న బిలాల్, ఇస్మాయిల్‌ను బయటకు రావాలని పోలీసులు హెచ్చరించడంతో వారు స్పందించలేదన్నారు. దీంతో మరోసారి టియర్ గ్యాస్ వదలడంతో వారు ఎట్టకేలకు ఊపిరాడక వెలుపలికి రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారందరిని తమిళనాడు ఐజీ కన్నప్ప, సీబీసీఐడీ ఎస్పీ అన్బు, డీఎస్పీ నరేంద్రపాల్సింగ్లకు అప్పగించడంతో తీవ్రవాదులను చెన్నైకు తరలించారని వివరించారు. -
పోలీస్ ఫక్రుద్దీన్ అరెస్ట్
కరుడుగట్టిన తీవ్రవాది పోలీస్ ఫక్రుద్దీన్ పట్టుబడ్డాడు. అద్వానీపై హత్యాయత్నం, పలు కేసుల్లో ఇతను నిందితుడు. హిందూవాదులే లక్ష్యంగా దాడులు సాగించాడు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి చెన్నైలో పట్టుబడ్డాడు. ఇతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. సుమారు 11 గంటలు పోరాడి తీవ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో కొన్నేళ్లుగా తీవ్రవాదుల దాడులు అధికమయ్యూరుు. హిందూవాదులే లక్ష్యంగా దాడులు సాగుతుండడం సంచలనం కలిగించింది. హిందూమున్నని రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్ ఈ ఏడాదిజూలై 1న హత్యకు గురయ్యూరు. అదే నెలాఖరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఆడిటర్ రమేష్ తన ఇంటి వద్దే దారుణహత్యకు గురయ్యూరు. అంతకముందు కన్యాకుమారిలో బీజేపీ న్యాయవాది గాంధీపై హత్యాయత్నం జరిగింది. తమిళనాడులోని హిందూ ప్రముఖులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. అదే సమయంలో బీజేపీ జాతీయ నేతలు తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి జయలలిత ఆగస్టులో సీబీసీఐడీ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ నరేంద్రపాల్ సింగ్ నాయకత్వంలో ఐజీ మహేష్‌కుమార్ అగర్వాల్, ఎస్పీలు అన్బు, నాగజ్యోతి, జయగౌరీలతో ఏర్పడిన ఈ బృందం వేట ప్రారంభించిం ది. మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెంది న పోలీస్ ఫక్రుద్దీన్ (48), తిరునల్వేలి మేల్పాలయూనికి చెందిన ఇస్మాయిల్ (35) తదితరులు వెల్లయప్పన్ హత్య జరిగిన ముందురోజు ఆ ప్రాంతంలో సంచరించినట్లు పోలీసులకు ఆధారా లు దొరికాయి. అలాగే బీజేపీ అగ్రనేత అద్వానీ మదురై రథయాత్ర సమయంలో కల్వర్టు కింద బాంబు పెట్టింది పోలీస్ ఫక్రుద్దీన్, ఇతనిఅనుచరులు ఇస్మాయిల్, బిలాల్మాలిక్ (25), అబూబకర్ సిద్ధిక్ (48) అని నిర్ధారించుకున్నారు. వీరిని పట్టిస్తే రూ.20 లక్షలు, సమాచారమిచ్చినా ఒక్కో నిందితుని పేరున రూ.5 లక్షలు బహుమతి ఇస్తామని డీజీపీ రామానుజం ప్రకటించారు. ఇదీ నేర చరిత్ర మదురైలో ఉంటూ స్థానిక తగాదాల్లో తలదూర్చే స్వభావంతో నేరమయ జీవితాన్ని ప్రారంభించాడు పోలీస్ ఫక్రుద్దీన్. తర్వాత సేలంలో ఒక హత్య కేసులో అరెస్టయి జైలు జీవితం గడిపాడు. బాంబులు తయారుచేయడం, అమర్చడం, వాటిని పేల్చడం వంటి విషయాల్లో కాశ్మీర్‌లోని తీవ్రవాదుల వద్ద శిక్షణ పొందాడు. ఇమాం అలీ అనే తీవ్రవాదిని 2002లో కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతుండగా పోలీసులపై బాంబులు విసిరి అతన్ని విడిపించుకుపోయాడు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి పోలీస్ ఫక్రుద్దీన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరులో పోలీసులతో ఘర్షణ పడిన సంఘటనలో కాల్పులకు గురై ఇమాం అలీ మృతి చెందాడు. ఈ కసితోనే ఇటీవల కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యాలయ సమీపంలో పోలీస్ ఫక్రుద్దీన్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు అరెస్ట్ చెన్నైలో శుక్రవారం జరిగిన తిరుమల గొడుగుల ఉత్సవంలో కల్లోలం సృష్టించేందుకు కొందరు తీవ్రవాదులు కుట్ర పన్నారని చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌కు సమాచారం అందింది. చెన్నై పెరియమేడులోని ఒక లాడ్జీలో పోలీస్ ఫక్రుద్దీన్ ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అదనపు ఎస్పీ తామరైకన్నన్ నాయకత్వంలో రెండువేల మందికిపైగా పోలీసులు మోహరించారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీస్ ఫక్రుద్దీన్ ఒక ఇన్స్పెక్టర్ గొంతునులిమి బాహాబాహికి దిగాడు. మరో ఇన్స్పెక్టర్ కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎట్టకేలకు పోలీస్ ఫక్రుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తీవ్రవాదులు బిలాల్, ఇస్మారుుల్లను అరెస్ట్ చేశారు. రహస్యంగా చెన్నైకి తరలించారు. రహస్యంగా జీవనం పుత్తూరు పట్టణంలోని గేటు పుత్తూరు మేదరవీధిలో బిలాల్, ఇస్మాయిల్ రహస్యంగా జీవనం సాగించారు. ఓ పెంకుల ఇంట్లో బిలాల్, అతని భార్య, ముగ్గురు పిల్లలు ఉండేవారు. పక్కనే ఉన్న ఇంటి మిద్దిపైన గదిలో ఇస్మాయిల్ ఉండేవాడు. ఇరుగుపొరుగు వారితో అంటీముట్టనట్లు ఉండేవారు. శనివారం సోదా జరిపిన బాంబుస్క్వాడ్ ఒక ట్రంకు పెట్టెను స్వాధీనం చేసుకుంది. ఇందులో పెద్ద ఎత్తున కరెన్సీ ఉన్నట్లు సమాచారం. అలాగే బాంబులు తయారు చేసేందుకు వాడే విడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, ఇతర రద్దీ ప్రాంతాలు, ఆలయాల వద్ద బాంబులు పేల్చాలనే లక్ష్యంతో పేలుడు పదార్థాలు తయారీ సొంతంగా చేస్తున్నట్లు సమాచారం. -
పుత్తూరు ఘటనలో కరుడుగట్టిన ఉగ్రవాదులు
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్) చేపట్టిన మొట్ట మొదటి ఆపరేషన్ విజయవంతమైంది. ఆక్టోపస్ కమాండోలు చాకచక్యంగా వ్యవహరించి కరుడుగట్టిన ఇద్దరు తీవ్రవాదులను పట్టుకున్నారు. గేటుపుత్తూరు మేదరవీధిలోని ఒక ఇంట్లో దాక్కున్నవారిలో ఒకరు ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా కాగా, రెండవ వాడు అల్-ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ మాలిక్. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని చెన్నై తరలించారు. ఈ ఆపరేషన్‌లో తమిళనాడు, స్థానిక పోలీసులతోపాటు ఆక్టోపస్ కమాండోలు, ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) సిబ్బంది పాల్గొన్నారు. అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది పోలీస్ ఫక్రుద్దీన్‌ను తమిళనాడు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నైలో దాడులు చేయాలన్న లక్ష్యంగా అతను చెన్నై పెరియార్ మేడలోని ఒక లాడ్జిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. శనివారం తెల్లవారు జామునుంచి పోలీసులను ఉగ్రవాదులు నానా తిప్పలు పెట్టారు. తమిళనాడుకు చెందిన సిఐ లక్ష్మణన్‌ను కత్తితో అయిదారు చోట్ల పొడిచారు. అతను తీవ్రంగా గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆక్టోపస్ కమాండోలను 50 మందిని తిరుమల నుంచి పుత్తూరుకు రప్పించారు. పోలీసులు బెదిరించడంతో బిలాల్ తన భార్య, ముగ్గురు పిల్లలను మధ్యాహ్నం బయటకు పంపించాడు. లొంగిపోయిన వారిని పోలీసులు పుత్తూరు ఆస్పత్రికి పంపారు. సుమారు 11 గంటల సేపు పోరాడి బిలాల్, ఇస్మాయిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో తీవ్రవాది అలీం తప్పించుకున్నాడు. తప్పించుకుపోయిన ఉగ్రవాది జాడ కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వీరు అనేక పేలుడు సంఘటనలలో నిందితులని తెలుస్తోంది. ఆ ఇంట్లో పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్-ఉమా తీవ్రవాదుల లక్ష్యం తిరుమలేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బిలాల్, ఇస్మాయిల్ మరో ఇద్దరు కలిసి తిరుమలలో రెక్కీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు ఫక్రుద్దీన్ కోసం ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. ఇమాం అలీ అనే తీవ్రవాదిని 2002లో మదురై కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతుండగా ఫక్రుద్దీన్ పోలీసులపై బాంబులు విసిరి అతడిని విడిపించుకుపోయాడు. బీజేపీ అగ్రనేత అద్వానీపై 2011లో హత్యాయత్నం, హిందూమున్నని తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఆడిటర్ రమేష్ హత్యకేసుల్లో ఫక్రుద్దీన్ నిందితుడు. మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెందిన పోలీస్ ఫక్రుద్దీన్ (48), ఇతని అనుచరులైన తిరునల్వేలి మేల్పాలయూనికి చెందిన ఇస్మాయిల్ (35), బిలాల్మాలిక్ (25), అబూబకర్ సిద్ధిక్ (48) కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వీరిని పట్టిస్తే 20 లక్షల రూపాయలు, సమాచారమిచ్చినా ఒక్కోక్కరికి 5 లక్షలు రూపాయల బహుమతి ప్రకటించారు. బాంబులు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడం వంటి విషయాల్లో కాశ్మీర్‌లోని తీవ్రవాదుల వద్ద పోలీస్ ఫక్రుద్దీన్ శిక్షణ పొందాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం ముమ్మరంగా వేట సాగించారు. ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడైన ఇస్మాయిల్ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఇస్మాయిల్, మాలిక్, ఫక్రుద్దీన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది. -
పుత్తూరులో ఆపరేషన్ పూర్తి: కౌముది
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆపరేషన్ పూర్తయింది. ఉగ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు. ఓ మహిళ సహా ముగ్గురు పిల్లలు లొంగిపోగా, వారిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు సంఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ లక్ష్మణ్‌కు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అదనపు డీఐజీ వీఎస్కే కౌముది తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆక్టోపస్ ఆపరేషన్ పూర్తయిందని, బిలాల్ మాలిక్, ఇస్మాయిల్ అనే ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఒక మహిళ, ముగ్గురు పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. సీఐ లక్ష్మణ్‌ను గాయపరిచిన కేసులో వీరిపై కేసు నమోదు చేసినట్లు అదనపు డీఐజీ కౌముది వివరించారు. కాగా, ఉగ్రవాదులు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నుతున్నట్లు వచ్చిన కథనాల గురించి మాత్రం తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కౌముది చెప్పారు. శుక్రవారం రాత్రినుంచి కొనసాగిన ఆపరేషన్.. శనివారం సాయంత్రానికి ముగిసింది. ఉగ్రవాదులున్న ఇంటి గోడలను డ్రిల్లింగ్ చేసి మరీ ఈ ఆపరేషన్‌ను ఆక్టోపస్ పోలీసులు దిగ్విజయంగా పూర్తిచేశారు. -
పుత్తూరులో పూర్తయిన ఆక్టోపస్ ఆపరేషన్
-
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర!
గత అర్థరాత్రి నుంచి తమ బలగాలు పుత్తూరులో చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తి అయిందని ఆక్టోపస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్‌తోపాటు మున్నాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిద్దరిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అంబులెన్స్‌లో చెన్నైకు తరలించినట్లు చెప్పారు. తిరుమలలో నేటి నుంచి ప్రారంభంకానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని వివరించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోలీసులకు చిక్కిన ఉగ్రవాదిని దర్యాప్తులో భాగంగా విచారించగా కీలక సమాచారాన్ని అందించాడని తెలిపారు. దాంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేసి చెప్పారు. అయితే ఉగ్రవాదులతోపాటు ఉన్న మహిళ ముగ్గురు చిన్నారులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆక్టోపస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ ముఖ్య నిందితుడు అన్న విషయం తెలిసిందే. -
పుత్తూరులో మహిళ, ఇద్దరు చిన్నారుల లొంగుబాటు
చిత్తూరు: పుత్తూరు ఘటనలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు. పుత్తూరు ఇంట్లో దాక్కున్నవారంతా అల్-ఉమ ఉగ్రవాదులేనని తేలింది. పుత్తూరులో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ఇంట్లో మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చెన్నై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అరెస్ట్ చేసిన అల్-ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారు. దుండగులు ఇంట్లోనే ఉండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఒక కానిస్టేబుల్ మరణించినట్లు సమాచారం. సీఐ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా యావత్తు బెంబేలెత్తిపోతోంది. పుత్తూరులో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తనిఖీలు చేపట్టిన పోలీసులపై దుండగులు కత్తి, రాళ్లతో దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా ఎస్పీ కాంతిరాణా, తమిళనాడు ఎస్ఐబీ ఎస్పీ, తిరువళ్లూరు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న డీజీపీ బి. ప్రసాదరావు వెంటనే పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు... ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను అల్-ఉమా సంస్థకు చెందిన అబూ బకర్, ఫక్రుద్దీన్ అహ్మద్, బిలాల్‌గా అనుమానిస్తున్నారు. శుక్రవారం చెన్నై పోలీసులు ఫక్రుద్దీన్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు గత రాత్రి పుత్తూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు, స్థానిక సీఐ సాయంతో ఆపేరషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు.... ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్‌దళ్ నేతలు లక్ష్యంగా పలుసార్లు హత్యప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేత రమేష్‌ను హత్య చేశారు. గత 18 నెలల్లో హిందూ సంస్థలకు చెందిన 16 మందిని అల్-ఉమా ఉగ్రవాదులు హతమార్చినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. తమిళనాడు బీజేపీ నేత రమేష్ హత్యకేసు నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2011లో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కూడా కుట్ర చేశారు. అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్-ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు జరిగింది కూడా అల్-ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు. -
ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారంతో పుత్తూరులో దాడులు
పుత్తూరు : చెన్నై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు ఈ మధ్యే పట్టుబడ్డ అల్-ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారు. పుత్తూరు ఇంట్లో దాక్కున్నవారంతా అల్-ఉమ ఉగ్రవాదులే. వీరు తమిళనాడు బీజేపీ నేత రమేష్ హత్యకేసు నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 18 నెలల్లో 16మందిని అల్-ఉమ ఉగ్రవాదులు హతమార్చారు. 2011లో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కుట్ర చేశారు. అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్-ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు జరిగింది కూడా అల్-ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు. -
పుత్తూరులో ఉగ్రవాదుల దాడి: సీఐ, కానిస్టేబుల్ మృతి
దేవదేవుడు కొలువై ఉన్న చిత్తూరు జిల్లా గజగజ వణికిపోతోంది. ఉగ్రవాదుల దాడిలో సీఐ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకుముందే ఒక కానిస్టేబుల్ కూడా మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా యావత్తు బెంబేలెత్తిపోతోంది. పుత్తూరులో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తనిఖీలు చేపట్టిన పోలీసులపై దుండగులు కత్తి, రాళ్లతో దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాదుల దాడిలో ఓ ఎస్.ఐ, ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అటు దుండగులు ఇంట్లోనే ఉండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై దాడి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ కాంతిరాణా, తమిళనాడు ఎస్ఐబీ ఎస్పీ, తిరువళ్లూరు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న డీజీపీ బి. ప్రసాదరావు వెంటనే పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు... ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను అల్-ఉమా సంస్థకు చెందిన అబూ బకర్, ఫక్రుద్దీన్ అహ్మద్, బిలాల్‌గా అనుమానిస్తున్నారు. శుక్రవారం చెన్నై పోలీసులు ఫక్రుద్దీన్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు గత రాత్రి పుత్తూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు, స్థానిక సీఐ సాయంతో ఆపేరషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు.... ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్‌దళ్ నేతలు లక్ష్యంగా పలుసార్లు హత్యప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేత రమేష్‌ను హత్య చేశారు. గత 18 నెలల్లో హిందూ సంస్థలకు చెందిన 16 మందిని అల్-ఉమా ఉగ్రవాదులు హతమార్చినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. -
పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం?
చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఆ ఇంట్లో మరో నలుగురి వరకు అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. అంబులెన్స్‌ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ బృందం పుత్తూరుకు చేరుకుంది. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30 మంది ఆక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందటంతో చెన్నై పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ నిందితుడు. ఇక్కడి ఉగ్రవాదులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పుత్తూరు మేదర వీధిలోని ఓ నివాసంలో శుక్రవారం రాత్రి నుంచే తమిళనాడు, ఆంధ్రా పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. సీఐ కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను రుయా ఆస్పత్రికి, అక్కడినుంచి చెన్నైకి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం నలుగురు వ్యక్తులు బీడీ కార్మికులుగా ఇల్లు అద్దెను తీసుకున్నారు. అయితే వాళ్లు రాత్రిళ్లే ఇంట్లో ఉండేవారని, వారి గురించి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీడియా సహకరించాలని.... పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి ఓ అంబులెన్స్ చేరుకోవటంతో ఏం జరిగిందా అనే ఉత్కంఠ నెలకొంది. -
పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం?
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. కాల్పులు జరిపిన నివాసంలో వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. అంబులెన్స్‌ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ బృందం కాసేపట్లో పుత్తూరుకు చేరుకోనున్నారు. మృతులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో పేలుళ్లు జరిగాయి. 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు. -
పుత్తూరులో ఉగ్రవాదుల దాడి.. కానిస్టేబుల్ మృతి
-
ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదు: డీజీపీ
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా పుత్తూరు ఘటనపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆక్టోపస్ బృందాన్ని పుత్తూరుకు పంపించినట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఆ ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదని డీజీపీ చెప్పారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పుత్తూరు మేదర వీధిలోని ఓ ఇంటిని చుట్టుముట్టి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
పుత్తూరులో టెన్షన్ టెన్షన్
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పుత్తూరు మేదర వీధిలోని ఓ నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీసుల సోదాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఇన్స్పెక్టర్తో పాటు ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సోదాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. కాగా సోదాల్లో గాయపడ్డ సీఐ కళ్యాణ్‌ను చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలల క్రితం నలుగురు వ్యక్తులు బీడీ కార్మికలుగా ఇంటిని అద్దెను తీసుకున్నట్లు సమచారం. అయితే వారు రాత్రి సమయంలోనే ఇంట్లో ఉండేవారని, వారి గురించి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించటంతో స్థానికులు ...ఏం జరుగుతుందో అని భయాందోళనలకు గురి అవుతున్నారు. కొంతమంది స్థానికులు తమ నివాసాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు వారు నిరాకరిస్తున్నారు. మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీడియా సహకరించాలని.... పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి ఓ అంబులెన్స్ చేరుకోవటంతో ఏం జరిగిందా అనే ఉత్కంఠ నెలకొంది.