పుత్తూరు : విద్యుత్ ఉత్పత్తి, వినిమయం వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వ విధానాల్లో సరళీకరణ జరగాలని శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.మునస్వామి అన్నా రు. శుక్రవారం కళాశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోజిత పునరుత్పాదక ఎలక్ట్రికల్ ఎనర్జీ టెక్నాలజీ అండ్ ఆటోమిషన్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 145 మంది విద్యార్థులు సమర్పించిన పరిశోధనాత్మక పత్రాల్లో 74 మందివి మాత్రమే అనుమతించినట్లు తెలిపారు.
అమర్‌రాజా ఇండస్ట్రియల్ ప్రైవేట్ సర్వీస్ లిమిటెడ్ తిరుపతి హెడ్ దామోదర్‌రావు మాట్లాడుతూ నాణ్యత, స్వచ్ఛత, పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పాదనే దేశ ప్రగతికి మూలమని అన్నారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ హెచ్‌వోడీ డాక్టర్ ఆర్వీఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సదస్సుకు సంబంధించిన బ్రోచర్స్‌ను విడుదల చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దామోదరం, ఆర్ అండ్ డీ డెరైక్టర్ డాక్టర్ జి.నరేష్‌కుమార్, ఈఈఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఎ.హేమశేఖర్, కో-కన్వీనర్ కె.విజయభాస్కర్ పాల్గొన్నారు.
విద్యుత్ విధానాల్లో సరళీకరణ అవసరం
Published Sat, Jul 16 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement