చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. కాల్పులు జరిపిన నివాసంలో వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ బృందం కాసేపట్లో పుత్తూరుకు చేరుకోనున్నారు. మృతులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో పేలుళ్లు జరిగాయి. 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు.