ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారంతో పుత్తూరులో దాడులు | Firefight reported in Puttur district between 'terrorists' | Sakshi
Sakshi News home page

ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారంతో పుత్తూరులో దాడులు

Published Sat, Oct 5 2013 12:13 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

Firefight reported in Puttur district between 'terrorists'

పుత్తూరు : చెన్నై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు ఈ మధ్యే పట్టుబడ్డ అల్-ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారు. పుత్తూరు ఇంట్లో దాక్కున్నవారంతా అల్-ఉమ ఉగ్రవాదులే. వీరు తమిళనాడు బీజేపీ నేత రమేష్ హత్యకేసు నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 18 నెలల్లో 16మందిని అల్-ఉమ ఉగ్రవాదులు హతమార్చారు. 2011లో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కుట్ర చేశారు.

అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్‌-ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు జరిగింది కూడా అల్‌-ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement