చిత్తూరు జిల్లా కోర్టుకు అల్‌-ఉమ్మా ఉగ్రవాదులు | Tamilanadu Police produce three Al-Ummah terrorists in court | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లా కోర్టుకు అల్‌-ఉమ్మా ఉగ్రవాదులు

Published Sat, May 31 2014 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

చిత్తూరు జిల్లా కోర్టుకు అల్‌-ఉమ్మా ఉగ్రవాదులు

చిత్తూరు జిల్లా కోర్టుకు అల్‌-ఉమ్మా ఉగ్రవాదులు

చిత్తూరు : గత ఏడాది అక్టోబర్ 5న పుత్తూరులో పట్టుబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 13 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వేలూరు జైలుకు తరలించారు. కాగా  పుత్తూరులో ఉగ్రవాదులు మకాం వేశారన్న పక్కా సమాచారం తమిళనాడు పోలీసులకు అందటంతో రాష్ట్ర పోలీసులతో కలిసి కమాండో ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను గత ఏడాది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

పోలీసుల కమాండో ఆపరేషన్‌లో బిలాల్ మాలిక్, మున్నా ఇస్మాయిల్ ప్రాణాలతో చేతికి చిక్కగా, వారితోపాటు బిలాల్ భార్య హుస్సేన్ బాను (27), కుమార్తెలు అయేషా (4), ఫాతిమా (3), కుమారుడు యాసిన్ (1)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరినుండి 80 జిలిటెన్‌టిక్స్, ఐఇడిలు, పిస్టల్స్, రెండు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులైన బిలాల్ బృందాన్ని పట్టుకోవడంలో ఆక్టోపస్ పోలీసులుకాని తమిళనాడు, చిత్తూరు జిల్లా పొలీసులు ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా టియర్ గ్యాస్‌తో ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement