tamilanadu police
-
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత మీసాల రాజిరెడ్డి!
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ మీసాల రాజిరెడ్డి దంపతులను తమిళనాడులోని కొయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రాష్ర్ట పోలీసు వర్గాలు ధృవీకరించడం లేదు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన రాజిరెడ్డి గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా కొయంబత్తూరు పోలీసులు స్థానికంగా తలదాచుకున్న కొందరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో రాజిరెడ్డి దంపతులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. -
తోపులాటలో సొమ్మసిల్లిన వైగో
చిత్తూరు: చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన వైగోను తమిళనాడు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా బయల్దేరిన ఆయనను గాంధీపురం వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైగో అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో వైగో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయననకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సుమారు 400మంది వైగో అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరిని ఓ కల్యాణమండపానికి తరలించారు. మరోవైపు చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి వైగో వస్తున్నట్లు సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ...జిల్లా సరిహద్దుల్లో భారీగా మోహరించారు. -
చిత్తూరు జిల్లా కోర్టుకు అల్-ఉమ్మా ఉగ్రవాదులు
చిత్తూరు : గత ఏడాది అక్టోబర్ 5న పుత్తూరులో పట్టుబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 13 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వేలూరు జైలుకు తరలించారు. కాగా పుత్తూరులో ఉగ్రవాదులు మకాం వేశారన్న పక్కా సమాచారం తమిళనాడు పోలీసులకు అందటంతో రాష్ట్ర పోలీసులతో కలిసి కమాండో ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను గత ఏడాది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల కమాండో ఆపరేషన్‌లో బిలాల్ మాలిక్, మున్నా ఇస్మాయిల్ ప్రాణాలతో చేతికి చిక్కగా, వారితోపాటు బిలాల్ భార్య హుస్సేన్ బాను (27), కుమార్తెలు అయేషా (4), ఫాతిమా (3), కుమారుడు యాసిన్ (1)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరినుండి 80 జిలిటెన్‌టిక్స్, ఐఇడిలు, పిస్టల్స్, రెండు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులైన బిలాల్ బృందాన్ని పట్టుకోవడంలో ఆక్టోపస్ పోలీసులుకాని తమిళనాడు, చిత్తూరు జిల్లా పొలీసులు ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా టియర్ గ్యాస్‌తో ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించడం గమనార్హం.