Chandra banu
-
రెండు బటన్లు నొక్కి.. వైఎస్సార్సీపీకి అండగా నిలవాలి: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు మంత్రి రోజా. సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని ప్రశంసించారు. రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురుచూసే రోజులు పోయాయని.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. పూత్తురు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు(ప్రజలు) తమ కోసం రెండు బటన్లు నొక్కాలని తెలిపారు. మొదటి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని కోరారు. ప సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల స్థాయికే వెళ్లే పని లేకుండా ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా సమస్యకు పరిష్కారం అందుతోందని మంత్రి రోజా అన్నారు. ఇంటి వద్దే అర్హులను గుర్తించి స్వయంగా లబ్ధిదారుల అకౌంట్లోకి రుణాన్ని పొందడం జరుగుతుందన్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల రైతులకు నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాల ద్వారా గుర్తించి రైతులకు సాయం అందుతోందని తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది: కేశినేని నాని ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగాన్ని గుర్తించి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నామని రోజా తెలిపారు. సీఎం జగన్ గొప్ప గొప్ప వ్యవస్థలను నెలకొల్పాడని, ఇలాంటి సౌకర్యవంతమైన పరిపాలన ఎవరైనా అందించారా అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు. నాడు నేడు కింద పాఠశాలలను మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను తీసుకు రావడం వల్ల పిల్లలు చదువులు చక్కబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు స్టేట్ ర్యాంకుల స్థాయికి ఎదిగారని అన్నారు. విద్యలో జగనన్న తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా లబ్ధి అందించే సహాయ సహకారాలను ప్రజలు గమనించాలని ప్రజలు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
ఆవేశంతో ఊగిపోవడం ఆపై 'సారీ' చెప్పడం 'మెగా బ్రదర్స్'కు అలవాటే..
మెగా బ్రదర్ నాగబాబు తన మిగిలిన ఇద్దరు సోదరులతో పోల్చుకుంటే సినిమాల్లో రాణించలేకపోయాడు. ఏదో అడపాదడపా ఆయన సినిమాల్లో కనిపించీ కనిపించకుండా ఉంటాడు. తమ్ముడు పవన్ పుణ్యమా అని పార్ట్ టైమ్ పొలిటీషయన్‌గా ఎన్నికల సమయంలో మాత్రమే జనాల్లో కనిపిస్తాడు. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ పోలీస్ పాత్రల గురించి ఆయన కామెంట్ చేశాడు. సినిమాలలో ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండే వారు పోలీస్ ఆఫీసర్ పాత్రలు వేస్తే అంతగా నమ్మేలా ఉండవని సెటైర్లు వేశాడు నాగబాబు. పోలీస్ క్యారెక్టర్ తన కొడుకు లాంటి వారు మాత్రమే చేయాలి తప్పా మిగత వారు అందుకు పనికి రారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే అవి కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ హీరో అయిన జూ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని నెట్టింట్ట వైరల్ అయింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇవ్వడం ఆపై నాగబాబుపై విమర్శలు చేయడంతో ఫైనల్‌గా సారీ చెప్పాడు. 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది.. 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కు తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ ఒక పోస్ట్ చేశాడు. గతంలో కూడా బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం తర్వాత వాటికి గుడ్ బై చెప్పి కాంప్రమైజ్‌కావడం వంటివి జరడం మనం చూసిందే.. తాజాగా తారక్‌ను ఉద్దేశించే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎన్నికల సమయంలో ఈ తలనొప్పి ఎందుకులే అనుకున్నాడేమో సింపుల్‌గా ఇలా సారీ చెప్పేశాడు. గతంలో కూడా నాగబాబు ఏబీఎన్ అధినేత రాధాక్రిష్ణపై ఫైర్ అవుతూ ఒక వీడియో విడుదల చేశాడు. చంద్రబాబుపై మీరు చేసిన 'భట్రాజ్' పొగడ్తల్ని నేను ఒక వీడియో ద్వారా చూపించానంటూ రాధాక్రిష్ణపై కామెంట్లు చేశాడు. అయితే అందులో 'భట్రాజ్ పొగడ్తలు' అనే పదం వల్ల ఆయనకు చిక్కులు వచ్చాయి. ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఫైర్ కావడంతో నాగబాబు క్షమాపణలు చెప్పాడు. ఇలా ఆవేశంలో నోటికి వచ్చింది మాట్లాడటం తర్వాత సారీ చెప్పడం పవన్- నాగబాబుకు సర్వసాధారణం అయింది. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా అంతే.. ఆవేశంలో ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. కేవలం సినిమా డైలాగుల మాదిరి రాజకీయం చేయాలనుకుంటే అయ్యే పని కాదని ఇప్పటికీ ఆయనకు అర్దం అయినట్లు లేదు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సుమారు 10 ఏళ్లకు పైగానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఈ పదేళ్లలో పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా అదఃపాతాళానాకి చేరుకున్నాడు. అందుకే ఆయన నోటి నుంచి ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం తణుకు సభలో విడివాడ రామచంద్రరావుకు తణుకు టిక్కెట్ అంటూ ఆవేశంగా ప్రకటించాడు. గత ఎన్నికల్లో మీలాంటి వ్యక్తి వెనుక నేను నిలబడలేనందుకు మనస్పూర్తిగా చింతిస్తున్నాను. 2019లో టిక్కెట్ ఇవ్వలేకపోయినందుకు ఇలా పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పుకుంటున్నానంటూ పవన్ అన్నారు. ఆ సమయంలో రామచంద్రరావుకు క్షమాపణలతోనే సభను ప్రారంభించాడు పవన్. కానీ ఈసారి కూడా పవన్ మాట నిలబెట్టుకోలేకపోయాడు. తణుకు అభ్యర్థిగా రాధాకృష్ణకు టిక్కెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో రామచంద్రరావుకు మళ్లీ సింపుల్‌గా సారీతో గుడ్‌బై చెప్తాడని తెలుస్తోంది. చంద్రబాబు కోసం పవన్ రాజకీయం చేస్తున్నాడు అనేది నిజం.. ఆయన ఇచ్చిన 24 సీట్లతో సంబరపడిపోతూ ప్రస్తుత రాజకీయ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. కానీ తన పార్టీకి కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయిన జనసేన అధినేత తన జెండా అదఃపాతాళానాకి చేరుకోవాడానికి కారణం ఎవరు..? దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవంటారు. ఇందుకు పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయమే నిలువెత్తు నిదర్శనం. పవన్ కల్యాణ్ పైకి ఎన్ని సినిమా డైలాగ్స్ పేల్చినా ఉపయోగం లేదు. జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని ఆయన పట్టరాని ఆక్రోశంతో మాట్లాడుతున్నాడు. కానీ టీడీపీ కోసమే జనసేన పుట్టింది అని పవన్ పరోక్షంగా చెప్పినట్లు అయింది. దీంతో తన ఫ్యాన్స్‌తో పాటు తన వర్గం వారు కూడా పవన్‌ను ప్రశ్నిస్తున్నారు.. పలు సలహాలు ఇస్తున్నారు... కానీ ఆయన ఐ డోంట్ కేర్ అంటూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకే జై కొడుతున్నాడు. పవన్‌కు ఎంత ప్యాకెజీ ఇస్తే అంతలా స్టేజీ డైలాగ్స్‌తో ప్రస్తుతం రెచ్చిపోతున్నాడు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి నాలగు లాజిక్ లేని మాటలను తన ఫ్యాన్స్‌కు చెప్పాడు.. 2019లో మళ్లీ అలాంటి కాకమ్మ కథలే చెప్పి చంద్రబాబు కోసం సొంతంగా బరిలోకి దిగాడు. 2024 వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలంటూ టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టేశాడు. ఇలాంటి కొత్త కథలు విని తట్టుకోలేక పవన్ ప్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. పవన్‌ను తిడుదామంటే అభిమానం అడ్డొస్తుంది.. దీంతో వారందరూ చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ఎన్ని చేసినా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కష్టం అని జనసేన అభిమానులో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోయాక 2029 ఎన్నికల్లో చంద్రబాబుతో తూచ్ అని ... జనసైనికులకు ఒక సారీ చెప్పి సింగిల్‌గా పోటీకి దిగుతానని ఏదో ఒక సినిమా కథ చెప్పడం ఖాయం. -
పేదలకు సేవ చేయడమే లక్ష్యం..
సత్తుపల్లి: పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చంద్రభాను సత్పతి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో నిర్మించనున్న 250 పడకల ఆస్పత్రి భవనానికి సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వారు శంకుస్థాపన చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి, చంద్రభానును ఎమ్మెల్యే సండ్ర సన్మానించారు. -
సాయం చేయి.. సమానంగా చూడు
సాక్షి, హైదరాబాద్: షిరిడీ సాయిబాబా.. ఎందరికో ఆధ్యాత్మిక గురువు.. మరెందరికో దైవం! మనిషి తనను తాను తెలుసుకునేందుకు, దైవత్వం గురించి అర్థం చేసుకునేందుకు ఆధ్యాత్మికత ఒక మార్గం. సాయిబాబా మహా సమాధి అయి వందేళ్లు అయిన సందర్భంగా.. సాయితత్వం ఏమిటి? ఆయన బోధనలు ఎవరి కోసం తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాయి గ్లోబల్ మూవ్మెంట్ సూత్రధారి చంద్రభాను శతపతిని కలిసింది. ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాట్లాడింది. ఆ వివరాలివీ.. షిరిడీ సాయిబాబా మహా సమాధి అయి వందేళ్లు అయింది. దాని ప్రాముఖ్యతను వివరించగలరా? సాధారణ పరిభాషలో ఒక వ్యక్తి తన శరీరాన్ని వదలడాన్ని మృత్యువు అంటాం. శరీరం సమాధిలో కప్పబడితే అతడు సమాధి అయ్యారు అంటాం. కానీ ఆధ్యాత్మిక రంగానికి వస్తే.. వేదాంతం ప్రకారం భౌతిక ఉనికి అన్న పరిమితిని దాటి సూక్ష్మ శరీరంతో కొనసాగించగలిగే వారు తమ శరీరాన్ని వదిలివేయడాన్ని మహా సమాధి అంటాం. సాధారణ వ్యక్తి మరణిస్తే అతడు మళ్లీ రాడన్న బెంగతో బాధపడే వాళ్లు ఉంటారు. షిరిడీ సాయి వంటి వారు శరీరాన్ని వదిలినా తమ సూక్ష్మ శరీరంతో ఉంటారు. వారు నిత్యం దేవుడితో మమేకమవుతుంటారు. ఇది వారిని అనుసరించే వారు ఆనందించే విషయం. మరణానికి ముందు.. తర్వాత అన్న హిందూ ఆధ్యాత్మిక వాదం తాలూకూ సైన్స్ ఇదే. ఈ నేపథ్యంలోనే షిరిడీ సాయి మహా సమాధి పొంది వందేళ్లయిన సందర్భాన్ని చూడాల్సి ఉంటుంది. షిరిడీ సాయి తత్వం ఏమిటి? భక్తులు అనుసరించాల్సిన మార్గం ఎలా ఉండాలి? సాయి అన్న పదం వేర్వేరు అర్థాలను సూచిస్తుంది. సాయి అంటే భగవంతుడు.. పాలకుడు.. రక్షకుడు.. తండ్రి. మీ ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలు ఎవరైతే తీరుస్తారో వారు ఆధ్యాత్మిక పురుషులవుతారు. ప్రాపంచిక అవసరాలు మన అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ.. ఆశలకు తగ్గట్టు కాదు. ఆధ్యాత్మిక గురువులు అందరూ దీన్నే ఆచరించారు. షిరిడీ సాయి తత్వం మొత్తం ఆధ్యాత్మిక స్థాయిలో మానవులందరూ ఇతరులకు సాయం చేసేలా, మార్గదర్శనం చేసేలా ఎదగాలని చెబుతుంది. అందరినీ సమానంగా చూడాలని చెబుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు సమాజంలో ధర్మం గతి తప్పినప్పుడు అంటే సమాజపు కట్టుబాట్లను అనుసరించని.. లేదా ఆ కట్టుబాట్లు ఆయా కాలపు సమాజాలకు పనికిరాకుండా పోయిన సందర్భాల్లో వాటిని మార్చాలి. లేదంటే ప్రకృతి స్వయంగా వాటికి అడ్డుకట్ట వేస్తుంది. ఇటీవల షిరిడీ సాయిబాబాపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి. మీరేమంటారు? చరిత్రను చదివితే షిరిడీ సాయి బాబా ఉన్నప్పుడు ఈ వివాదాలు లేవని స్పష్టమవుతుంది. వందేళ్ల తర్వాత ప్రజలకు వారివైన ఆలోచనలు ఏర్పడ్డాయి. బాబాతో అనుబంధం ఉన్న వారి అనుభవాలు గమనిస్తే వివాదాలేవీ కనిపించవు. సాయి తత్వంతో మీ ప్రయాణం ఎలా మొదలైంది? సాయిబాబాపై తీసిన ఒక సినిమా చూసిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలని అనుకున్నా. చదివిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం నచ్చింది. అతడి దయాగుణం.. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరించడం.. అందరికీ అతడు ఆదరణీయుడు కావడం... ఆయన గొప్పతనానికి కొన్ని నిదర్శనాలు. సమాజంలో అసంతృప్తి ఎక్కువైందన్న వాదనలున్నాయి. నిర్మాణాత్మక చర్చకు తావు లేకుండా పోతోంది. దీనిపై బాబా సూచించే మార్గం ఏమిటి? ఇదో సామాజిక, రాజకీయ పరిస్థితికి సంబంధించిన ప్రశ్న. తన జీవితం మొత్తం సాయి చెప్పింది ఒక్కటే.. ఓపికతో ఉండ మని. సమాజం ఎప్పుడు ఒకే రీతిలో ఓపికతో లేదు. హెచ్చు తగ్గులున్నాయి. ఇంతకంటే ఎక్కువగా ఈ అంశంపై వ్యాఖ్యానించడం సరికాదు. మీరు నమ్మే సత్యం? మంచితనానికి మించిన దైవత్వం లేదన్నది నేను నమ్మే అంశంహేతువాదం, ఆధ్యాత్మిక వాదాల్లో మనిషి ఏది ముందు ఆచరించాలి? రెండూ వేర్వేరు కాదు. హేతువాదం అంటే ఆధునిక శాస్త్రం సృష్టించిన వ్యవస్థ. పరిక రాలు, పద్ధతులు అభివృద్ధి చేయడం తర్కబద్ధంగా ఆలోచించడం వంటివన్నీ ఇందు లో ఉంటాయి. ఆధ్యాత్మికతకు ఇవేవీ అవసరం లేదని అనుకుంటారు. ప్రాథమికం గా ఈ ఆలోచనే తప్పు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారు తమ శక్తులన్నిం టినీ కేంద్రీకరించి.. తమ ఉనికి, దేవుడి గురించి ఆలోచనలు చేస్తుంటారు. పూర్వం యజ్ఞాలు, హోమాల ద్వారా దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఆధునిక యుగంలో మనిషి సైన్స్ ద్వారా పదిమందికి ఉపయోగపడే పనిచేస్తున్నాడు. సామాజిక అభ్యున్నతి కోసం జీవితాలను అంకితం చేసిన శాస్త్రవేత్తలు కూడా దేవుడిని అన్వేషిస్తున్న వారిగానే చూడాలి. బాబా భక్తులకు మీరిచ్చే సందేశం? సాయిబాబా భక్తులకు అందాల్సిన సందేశం వారికి ఎప్పుడో అందింది. ఒక భక్తుడిగా నాకేం తెలుసో.. వారికీ అది తెలుసు. -
'ఉరి శిక్ష విధిస్తారని అనుకోలేదు'
ముంబయి: ఉరి శిక్ష విధిస్తారని తాను అస్సలు ఊహించలేదని అనూహ్యపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన నేరస్తుడు చంద్రభాన్ అన్నాడు. తాను అసలు ఎలాంటి నేరం చేయలేదని అనవసరంగా తనపై ఈ నేరాన్ని రుద్దుతున్నారని చెప్పాడు. కోర్టు తీర్పు వినగానే కోర్టు హాల్లోనే కూలబడ్డ చంద్రభాన్ సనాప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అనూహ్యపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను చంద్రభాన్ హత్య చేసినట్లు కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో 2012నాటి ఢిల్లీ అత్యాచారానికి సంబంధించిన స్పందనే వచ్చిందని కోర్టు తెలిపింది. మహిళలకు సురక్షితంగా ఉన్న ముంబై ప్రతిష్టను ఈ నేరం దెబ్బతీసిందని కూడా కోర్టు పేర్కొంది. అతడు అరుదై నేరం చేశాడని, అందుకే ఉరి శిక్ష విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజానికి ఓ సంకేతం కావాలని, గట్టి హెచ్చరిక గా ఉంటుందని పేర్కొంది. -
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
-
అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీ చంద్రభాన్కు ఉరిశిక్ష విధించారు. శుక్రవారం ముంబై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముంబై కోర్టు చంద్రభాన్‌ను దోషీగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. శిక్షను ఈ రోజు ఖరారు చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసులో చంద్రభాన్కు శిక్ష ఖరారుకు సంబంధించి బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే.. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. -
'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'
ముంబై: తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. తుది తీర్పును 30కి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే దాదాపు 80 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. చంద్రభాన్కు ఉరి శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టును కోరారు. చంద్రభాన్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని, అనూహ్యను అత్యాచారం చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చివేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి కేసుల్లో కోర్టులు కఠినంగా వ్యవహరించాయని, చంద్రభాన్కు అత్యంత కఠిన శిక్ష విధించాలని రాజన్ థాక్రే కోర్టుకు విన్నవించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ.. 2014 జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అనూహ్య అదృశ్యమైంది. టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ముంబై కోర్టు చంద్రభాన్‌ను దోషీగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
'చంద్రభాన్కు ఉరిశిక్ష విధించండి'