
రిటైర్డ్ ఐపీఎస్ చంద్రభాను, డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డిని సత్కరిస్తున్న వెంకటవీరయ్య
సత్తుపల్లి: పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చంద్రభాను సత్పతి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో నిర్మించనున్న 250 పడకల ఆస్పత్రి భవనానికి సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వారు శంకుస్థాపన చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి, చంద్రభానును ఎమ్మెల్యే సండ్ర సన్మానించారు.