RK Roja: Appreciation To Roja Selvamani By South Indian Film Chamber - Sakshi
Sakshi News home page

Roja Selvamani: ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ?

Apr 29 2022 11:51 AM | Updated on Apr 29 2022 1:10 PM

Appreciation To Roja Selvamani By South Indian Film Chamber  - Sakshi

చెన్నై సినిమా : ప్రముఖ నటి రోజా సెల్వమణి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తమిళ నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, సంగీత కళాకారుల సంఘాలు మే 7న చెన్నైలో ఆమెను ఘనంగా సత్కరించనున్నాయి. ఈ అభినందన సభకు  ప్రముఖ దర్శకుడు భారతీరాజా నేతృత్వ వహించనున్నారు. దీనికి సంబంధించి బుధవారం (ఏప్రిల్‌ 27) సాయంత్రం స్థానిక అన్నాశాలైలోని ఫిలింఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 

దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు భారతీరాజా, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి పూర్వ అధ్యక్షుడు సి. కల్యాణ్, ప్రస్తుత అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ ఉదయ్‌ కుమార్, పెప్సీ అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి, సంగీత దర్శకుడు దీన తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ రోజా విజయం వెనుక ఆమె భర్త దర్శకుడు ఆర్‌.కె సెల్వమణి సహకారం ఎంతో ఉందన్నారు.  కాగా రోజాను సత్కరించాలని నిర్ణయించిన  దక్షిణ భారత సినీ పరిశ్రమకు ఈ సందర్భంగా సెల్వమణి ధన్యవాదాలు తెలిపారు.



చదవండి: ఆచార్యను వెంటాడుతున్న రాజమౌళి సెంటిమెంట్‌!
ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement