తమిళంలో ఎంట్రీ ఇచ్చిన 'ఆహా'.. లాంచ్‌ చేసిన సీఎం | Tamil Nadu CM Stalin Launches AHA Tamil Version | Sakshi
Sakshi News home page

AHA: ఇప్పుడు తమిళంలోనూ ఆహా.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం

Published Sun, Apr 17 2022 8:34 AM | Last Updated on Sun, Apr 17 2022 9:27 AM

Tamil Nadu CM Stalin Launches AHA Tamil Version - Sakshi

ఆహా 100 శాతం తమిళ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తమిళ ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ నేతృత్వంలో తెలుగులో ప్రారంభమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమిళంలో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించారు. దీనిని తమిళంలోనూ నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు.

100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్, టాక్‌షోలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళం ప్రేక్షకులను అలరించే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. దీనికి నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్‌ను అంబాసిడర్లుగా నిర్మించారు.

కాగా ఈ వేడుకలో తమిళ సినిమా నాయకులుగా విశేష సేవలు అందించిన దర్శకుడు ఎస్‌.పి.ముత్తురామన్‌ భారతీరాజా దివంగత నిర్మాత ఎ.వి.మెయ్యప్పన్, ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, సంగీత దర్శకుడు ఎం.ఎస్‌.విశ్వనాథన్, గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం, నటి శ్రీదేవి సేవలను గుర్తుచేసుకుంటూ.. గౌరవించే విధంగా కలైంజ్ఞర్‌ పెరుమై అనే అవార్డులను ప్రదానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement