
దుబాయ్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డికి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్(యూఏఈ) సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ భారీ విజయాన్ని పురస్కరించుకుని లేబర్ క్యాంపుల్లో పనిచేస్తున్నవారికి ఆహారాన్ని వితరణ చేశారు. 250 ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
యూఏఈలో ఉంటున్న కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేశ్ రెడ్డి, సోమిరెడ్డి, అక్రమ్, నాజీర్, రమణ, బ్రహ్మానంద్ రెడ్డి, కుమార్ చంద్ర, దిలీప్, కోటి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రావులు పాల్గొన్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment