టెక్సాస్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆ పార్టీ అమెరికా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై దాడిని ఆస్టిన్, టెక్సాస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లిఖార్జున రెడ్డి ఆవుల, రవి బల్లాడ, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, వెంకట శివ నామాల, మురళి బండ్లపల్లి, కొండారెడ్డి ద్వారసాల, స్వాదీప్ రెడ్డి, ప్రవర్ధన్ చిమ్ముల, వంశి, రమణ రెడ్డి కిచ్చిలి, శివ ఎర్రగుడి, యశ్వంత్ రెడ్డి గట్టికొప్పుల, శ్రీనివాస్ సలుగుటి, శివ శంకర్ వంకదారు, ప్రవీణ్ కర్నాటి, సుజిత్, దిలావర్, శ్రీకాంత్ రెడ్డి ఐనాల, తదితరలు ఖండిస్తున్నామని తెలిపారు.
ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దాడికి నిరసనగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment