
ఆస్టిన్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించాలని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలని కాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆస్టిన్‌లో పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అన్ని ఆటంకాలు, దుష్ప్రభావాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ.. సెడార్ పార్కులో గల సాయిబాబా దేవాలయంలో విఘ్నేశ్వర పూజ, శివునికి అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి ఆవుల, మల్లాది రాజ శేఖర శర్మ, నారాయణ రెడ్డి గండ్ర, రమణా రెడ్డి కిచిలీ, మురళి బండ్లపల్లి, శ్రీ కొత్తపల్లి, వెంకట్ ఉప్పాల, సుబ్బారెడ్డి ఎర్రగుడి, శివ ఎర్రగుడి, రాజశేఖర రెడ్డి, రాఘవ రెడ్డి, కొండా రెడ్డి ద్వారసల పాల్గొన్నారు.
వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. పార్టీకి సేవలందిస్తున్న అభిమానులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment