హైదరాబాద్ సిటీ: వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. గల్ఫ్, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్ (యుఏఇ), కువాయిత్ ఎన్నారై కమిటీల్లో జరిగిన నియామకాలు కింది విధంగా ఉన్నాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్‌షిప్ టీమ్ కన్వీనర్‌గా బీహెచ్ ఇలియాస్(కువాయిత్)ను, కువాయిత్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్‌గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు.
ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువాయిత్), మంత్రాల న్యామతుల్లా(సౌదీ అరేబియా), నాసర్ వలీ సయ్యద్, జి.విజయభాస్కర్‌రెడ్డి(యూఏఇ), ఆనంద్ ఈద, మందల వర్జిల్‌బాబు (ఖతార్), కుంతం దేవేందర్ (బహరిన్), షేక్ అల్లాఉద్దీన్ (ఎమెన్) నియమితులయ్యారు. వీరు కాక గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు
Published Mon, Jun 15 2015 11:22 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement