
లండన్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు సోమవారం లండన్ లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యూకే అండ్ యూరప్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్ పర్యటనలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విభాగం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యూకే అండ్ యూరప్ వింగ్ కన్వీనర్ సందీప్ రెడ్డి వంగల, పీసీ రావ్, ప్రదీప్ కత్తి, మన్మోహన్ రెడ్డి, అమరనాథ్ కల్లం, రవీంద్రారెడ్డి, ఎన్‌ఆర్ రెడ్డిలతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment