ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆ పార్టీ ఆస్ట్రేలియా విభాగం తీవ్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా సోషల్ మీడియా ఇంచార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేశ్ సక్కమురి, వైఎస్‌ఎన్ ప్రసాద్, కౌషిక్ మామిడి, ధనుష్, శరణ్ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే ఒక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.