Bay Area
-
బే ఏరియాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
కాలిఫోర్నియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్‌రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జులై 10వ తేదీ ఉదయం,ఆహా ఇండియన్ హోటల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం,. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని వైఎస్సార్సీపీ అమెరికా గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రీ ఎంబర్సుమెంట్, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు . వైఎస్సార్ స్పూర్తి, ఆశయాలతోవారి కుమారుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్స పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్సీపీ అమెరికా కమిటీ ముఖ్య సభ్యులు సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిభట్ల , సహదేవ్ బోడె , తిరుపతిరెడ్డి , వెంకట్ , అంకిరెడ్డి , ఆనంద్ బందార్ల, అశోక్, ప్రశాంతి, అమర్ బడే తదితరులు వైఎస్సార్ సేవలను, సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వారి తనయుడు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమలో బే ఏరియా వైస్సార్ అభిమానులు హరి, కొండారెడ్డి , త్రోలోక్ , సుబ్బారెడ్డి , రామిరెడ్డి , నరేంద్ర కొత్తకోట, వినయ్, ఇతర వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. -
అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం
తిరుమల: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా తొలుత అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ అయిన పుణ్యాహవాచనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధనను చేపట్టారు. తరువాత కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం వైదిక క్రతువు అయిన అంకురార్పణలో భాగంగా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. వేద మంత్రాల నడుమ ప్రతిష్టా బంధన నిర్వహించారు. ప్రాయశ్చిత హోమం నిర్వహించి దేవతామూర్తలకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం చేపట్టారు. చివరిగా శ్రీదేవిని కుడి వైపున, భూదే విని ఎడమ వైపున కూర్చోబెట్టి స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి ఇవ్వడంతో కల్యాణోత్సవం ముగిసింది. ఈ ఘట్టాలను తిలకించి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కాలిఫోర్నియాలో మహానేత వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా (బే ఏరియా) ప్రాంతంలో ఉన్న సంక్రాంతి రెస్టారెంట్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మహనేతకు ఘనంగా నివాళులు అర్పించారు. బేఏరియా వైఎస్సార్ సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూఎస్ వైఎస్సార్ సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కె. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బే ఏరియా ప్రముఖులు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వైఎస్సార్‌ఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మద్దూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బేఏరియా టీమ్ సురేంద్ర అబ్బవరం, మధు వంగా, గోపిరెడ్డి, శ్రీధర్, త్రిలోక్ ఆరవ, సహదేవ్, అమరనాథ్ రెడ్డి, కొండారెడ్డి, చంద్రహాస్, నరేష్, శివ, రమాకాంత్, చెన్నకేశవ, వీర, అమర్, నరేంద్ర అట్టునూరి, వెంకట్, విజయ్ ఎద్దుల, శ్రీధర్, కోటిరెడ్డి, డాక్టర్ రాఘవ, సుగుణ, ప్రవీణ, హరీంద్ర, రామచంద్ర, ఆదిత్య, రాంకీ, రవి, సురేంద్ర వల్లూరి, నరేంద్ర కొత్తకోట, నారాయణ, పెంచలరెడ్డి, సురేష్‌లతో పాటు ‘నాటా’ సభ్యులు విజయ్ చవ్వా(టీసీఏ), ధనిరెడ్డి అరికట్ల, సూర్య కురలి, చంద్ర కావలి, రవి కర్రి, సురేంద్ర పులగం, లోకేష్, సునీల్, శేషాద్రి పోలిశెట్టి, విశ్వనాధ్, శేషారెడ్డి, ధర్మేంద్ర జంబుల, సత్య బండారు, సంకీర్త్, వైఎస్సార్ సీపీ యూఎస్ స్టూడెంట్ నాయకులూ పాల్గొన్నారు. -
ఘనంగా తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్- యూఎస్ఏ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనని సంక్షేమ పథకాలు తెలంగాణ లో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సస్యమలంగా మార్చేందుకు సీఎం ప్రాజెక్టులను రూపకల్పన చేశారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు విడుదల చేశామన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కుల వృత్తులను పోత్సహిస్తుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించమని తెలిపారు. పేదింటి ఆడపడుచుల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. ఆసరా పథకం ద్వారా వృదులకు, వికలాంగులకు, వితంతువులకు, వంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కలిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో నెంబర్ వన్ చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు పెట్టుబడి కోసం వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4000 అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. అమరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం అన్నారు. అమరులు కళలు కన్నా బంగారు తెలంగాణ సాకరం అవుతుందన్నారు. అందుకు తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ జలగం స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీ ని రజనీకాంత్ ఖొసనం పుష్ప గుచంతో స్టేజి మీదకి ఆహ్వానించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రొఫెసర్ జయశంకర్, జల వనరుల నిపుణులు విద్య సాగర్రావుకి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో నవీన్ జలగం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలే కాకుండా తెలంగాణ ప్రజల కోసం వాటర్ గ్రిడ్, నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలని చేపట్టారని అన్నారు. ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీ మాట్లాడుతూ నగరంలో వివిధ రకాల కల్చర్స్ ని పోత్సహిస్తున్నమని వెల్లడించారు.తనను ఆహ్వానించినందుకు తెలుగుతో ధన్యవాదాలు తెలిపారు. భాస్కర్ మద్ది ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్మయి ప్రదర్శించిన తెలంగాణ నృత్యం రూపకం పేరిణి అందరిని ఆకట్టుకుంది. జానపద గేయాలను ప్రసాద్ ఊటుకూరు, భాస్కర్ కాల్వ, కృష్ణ వేముల పాడారు. ఆనంతరం చిన్నారుల నృత్యాలతో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనిత్ ఎర్రబెల్లి మాట్లాడుతూ సంక్షేమం పథకాల గురించి వివరించారు. రిషేకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాల వాళ్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపోందుతుందని వెల్లడించారు. అభిలాష్ రంగినేని మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఉద్యమ సమయంలో, ప్రస్తుతం చేస్తున్న సేవలను కొనియాడారు. బే ఏరియాలో తెలంగాణ రాష్ట్ర అవతరాణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు శ్రీనివాస్ పొన్నాల, తేజస్విని వడ్డెరాజ్, వంశీ కొండపాక, ఉదయ్ జొన్నల, కరునకర్, సాగర్, రాజ్, రామ్, షషాంక్, శశి, క్రిష్ణ, హరింధర్, సంతోష్, రవి, నవీత్ విజయ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగలకు ఫేవరెట్‌గా మారిన ఆపిల్ స్టోర్లు
-
దొంగలకు ఫేవరెట్‌గా మారిన ఆపిల్ స్టోర్లు
దొంగలకు అమెరికాలోని ఆపిల్ స్టోర్స్ చాలా ఫేవరెట్‌గా మారిపోతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ స్టోర్లను లూఠీ చేస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న ఆపిల్ స్టోర్‌లో దొంగలు చోరికి పాల్పడ్డారు. అయితే ఒక్కసారి కాదు.. కేవలం నాలుగు రోజుల్లో వరుసగా రెండు సార్లు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.. స్టోర్ స్టాఫ్‌ను అయోమయంలో పడేసి, చేతికి దొరికిన ఫోన్లన్నంటిన్నీ వారు ఎత్తుకుని పోతున్నారు. ఈ హఠాత్తు పరిణామానికి ఆపిల్ స్టోర్ ఉద్యోగులు కూడా ఏమీ చేయలేక అయోమయంలో బిత్తరపోతున్నారు. మొదటి దాడి నవంబర్ 25న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శాన్ఫ్రాన్సిస్కోలోని చెస్ట్నట్ వీధిలో ఆపిల్ స్టోర్‌లో చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను శాన్ఫ్రాన్సిస్కో పోలీసు డిపార్ట్మెంట్ విడుదల చేసింది. సాధారణ వ్యక్తులాగానే వేగంగా స్టోర్‌లోకి ప్రవేశించి, కొన్ని క్షణాల్లోనే ఫోన్లను ఎత్తుకుని పారిపోతున్నారు. నవంబర్ 29న అదేస్టోర్లో నలుగురు వ్యక్తులుగా వచ్చి ఇదే మాదిరి దొంగతనానికి పాల్పడినట్టు మరో వీడియోలో వెల్లడైంది. ఈ సమయంలో స్టాఫ్ వారిని అడ్డుకోవడానికి కొంచెం యాక్టివ్‌గా ప్రయత్నించినా.. ఎలాంటి ఉపయోగం లేకుండా వారు మొబైళ్లను తీసుకుని వేగంగా పారిపోయారు. అయితే ఆపిల్ స్టోర్లలో దొంగలు పడటం ఇదేమీ కొత్త కాదని, వ్యాపార సమయాల్లో ఆపిల్ స్టోర్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వినియోగదారులు స్టోర్‌లో ఉండగానే దొంగలు అదే అదునుగా భావించి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. బెర్కెలీలోని స్టోర్‌లో కూడా తొమ్మిది రోజుల్లో మూడు సార్లు దొంగలు పడ్డారు. అయితే ఈ విషయంపై ఉద్యోగులు ఆపిల్ దగ్గర ఫిర్యాదు చేసినా.. కంపెనీ పట్టించుకోన్నట్టే వ్యవహరిస్తుందని తెలుస్తోంది. అయితే దొంగతనానికి గురైన ఫోన్లు పనిచేయనవని వెల్లడవుతోంది. ఆ డివైజ్‌లు పనిచేస్తాయనే భ్రమలో వారు దొంగతనం చేసి, అమ్మడానికి తీసుకెళ్తున్నారు.