దొంగలకు ఫేవరెట్గా మారిన ఆపిల్ స్టోర్లు
దొంగలకు ఫేవరెట్గా మారిన ఆపిల్ స్టోర్లు
Published Mon, Dec 12 2016 1:36 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
దొంగలకు అమెరికాలోని ఆపిల్ స్టోర్స్ చాలా ఫేవరెట్గా మారిపోతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ స్టోర్లను లూఠీ చేస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న ఆపిల్ స్టోర్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. అయితే ఒక్కసారి కాదు.. కేవలం నాలుగు రోజుల్లో వరుసగా రెండు సార్లు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.. స్టోర్ స్టాఫ్ను అయోమయంలో పడేసి, చేతికి దొరికిన ఫోన్లన్నంటిన్నీ వారు ఎత్తుకుని పోతున్నారు. ఈ హఠాత్తు పరిణామానికి ఆపిల్ స్టోర్ ఉద్యోగులు కూడా ఏమీ చేయలేక అయోమయంలో బిత్తరపోతున్నారు.
మొదటి దాడి నవంబర్ 25న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శాన్ఫ్రాన్సిస్కోలోని చెస్ట్నట్ వీధిలో ఆపిల్ స్టోర్లో చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను శాన్ఫ్రాన్సిస్కో పోలీసు డిపార్ట్మెంట్ విడుదల చేసింది. సాధారణ వ్యక్తులాగానే వేగంగా స్టోర్లోకి ప్రవేశించి, కొన్ని క్షణాల్లోనే ఫోన్లను ఎత్తుకుని పారిపోతున్నారు. నవంబర్ 29న అదేస్టోర్లో నలుగురు వ్యక్తులుగా వచ్చి ఇదే మాదిరి దొంగతనానికి పాల్పడినట్టు మరో వీడియోలో వెల్లడైంది.
ఈ సమయంలో స్టాఫ్ వారిని అడ్డుకోవడానికి కొంచెం యాక్టివ్గా ప్రయత్నించినా.. ఎలాంటి ఉపయోగం లేకుండా వారు మొబైళ్లను తీసుకుని వేగంగా పారిపోయారు. అయితే ఆపిల్ స్టోర్లలో దొంగలు పడటం ఇదేమీ కొత్త కాదని, వ్యాపార సమయాల్లో ఆపిల్ స్టోర్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వినియోగదారులు స్టోర్లో ఉండగానే దొంగలు అదే అదునుగా భావించి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. బెర్కెలీలోని స్టోర్లో కూడా తొమ్మిది రోజుల్లో మూడు సార్లు దొంగలు పడ్డారు. అయితే ఈ విషయంపై ఉద్యోగులు ఆపిల్ దగ్గర ఫిర్యాదు చేసినా.. కంపెనీ పట్టించుకోన్నట్టే వ్యవహరిస్తుందని తెలుస్తోంది. అయితే దొంగతనానికి గురైన ఫోన్లు పనిచేయనవని వెల్లడవుతోంది. ఆ డివైజ్లు పనిచేస్తాయనే భ్రమలో వారు దొంగతనం చేసి, అమ్మడానికి తీసుకెళ్తున్నారు.
Advertisement
Advertisement