పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జోగి రమేశ్ తదితరులు
గన్‌ఫౌండ్రీ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ గత ప్రభుత్వాలు కల్లు, నీరాలపై తప్పు డు ప్రచారం చేసి అమ్మకాలను నిషేధించగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ గీతవృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ నెల 22న రూ.5 కోట్ల ఇ గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మాణం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
మంచి రాజుగా గుర్తింపు పొందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ గుర్తించినా ఇక్కడి పాలకులు ఇంకా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఏపీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ విద్యతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బహుజనుల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment