సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, సుధాకర్‌బాబు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
మహనీయుల స్ఫూర్తితో..
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో.. సమ సమాజం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. మహనీయుల స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కుబడి మాటలు కాకుండా ఆచరణాత్మకంగా సీఎం చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికీ మేలు జరిగేలా సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment