
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, తెలుగు, సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పూలే బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, పూలే ఆశించిన సామాజిక సాధికారత సీఎం జగన్ సాధించారని కొనియాడారు.
ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అణగదొక్కాలనుకున్నారని, బలహీన వర్గాల గుండె చప్పుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సీఎం జగన్‌కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment