
ప్రతి పౌరుడు సైనికుల్లా దేశభక్తి కలిగి ఉండాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
సాక్షి, గుంటూరు: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, దేశంలోని ప్రతి పౌరుడూ సైనికుల్లా దేశభక్తి కలిగి ఉండాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరేశారాయన. అనంతరం
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి రాజకీయ పార్టీ కూడా దేశభక్తితో ఉండాలన్నారు. కానీ, దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులు, కుతంత్రాలతో పనిచేస్తున్నాయన్నారు. అయితే దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని, దేశ సమగ్రత, సౌరభౌమత్వాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఇటు అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా వైఎస్సార్‌సీపీ ముందు ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
చదవండి: పేదలు గెలిచి, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం: సీఎం జగన్