jyotirao phule
-
వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...
మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న ఫూలే దంపతులు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు ‘భారతరత్న’ ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవా నికి ఫూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనస్సుతో జీవితాంతమూ మానవ మార్పునకు కృషి చేసిన జంట మరోటి లేదు. అది ఒక్క ఫూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారిపట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి.మహాత్మా ఫూలే 1827 ఏప్రిల్ 11న పుడితే, 1831 జనవరి 3న సావిత్రి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త ఇటు అటు ఈ దేశంలో సంఘ సంస్క ర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్ర లోనే గోవింద రణడే, బెంగాల్లో ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు.వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ ఫూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పే వారు. బెంగాల్లో కొద్దిపాటిగా ఉన్న భద్రలోక్ స్త్రీల సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వరచంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. కందుకూరి గురించి సరేసరి. కానీ ఫూలే గురించి నాకు తెలిసింది 1986–87 ప్రాంతంలో! ఆయన గురించి కాస్తా వివరంగా చదవడానికి ఒక్క పుస్తకం కూడా లేదు. వెతగ్గా, వెతగ్గా కోఠి ఫుట్‌పాత్ పాత పుస్తకాల్లో ధనుంజయకర్ ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగి పోయింది. అందులో సావిత్రి బాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం వల్ల!ఇప్పుడు ఒక ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం, అదీ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్ ఎందుకు పాస్ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేడ్కర్ వాళ్ళు ప్రారంభించిన శూద్ర–దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు, దళితులకు ఓటుహక్కు వచ్చింది కనుక! వారి సంఖ్యా బలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆరె స్సెస్ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది ఫూలేనే!ఆరెస్సెస్ మాత్రమే కాదు, అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదార వాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్ మేధా వులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్లను దేశం మొత్తం విద్యా రంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా ఫూలేను, సావిత్రిబాయిని, అంబేడ్కర్‌ను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు. మండల్ కమిషన్ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం ఫూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర–దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రమూ పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. ఫూలే జంట కేవలం భారత దేశానికే కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్ వంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీసెస్ శిలువేసి చంపబడ్డారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి అర్థాన్నే మార్చారు. అందుకు దీటుగా ఆమె భార్య అనే అర్థాన్నే మార్చారు.వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యా భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదా హరణలతో చూద్దాం. సావిత్రీబాయికి 9వ ఏట, ఫూలేకు 13వ ఏట పెండ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే ఫూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచరై అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పనిచేస్తే పూనా పండితులు తిలక్ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి, బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమేయించారు. ఆ యువ దంప తులు దళిత వాడల్లో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్ళకు స్కూలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు ఫూలే.అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు – యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకు ముందు వాళ్ళి ద్దరూ 30 ఏండ్ల వయస్సులో ఉండగా సావిత్రి తండ్రి,ఖండోజీ పాటిల్ వచ్చి ఫూలేతో... ‘నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్ళి చేసుకో’ అని కోరాడు. దానికి ఫూలే... ‘లోపం సావి త్రిలో లేదు, నాలో ఉంది. ఆమెకు మరో పెండ్లి చేద్దాం. ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం’ అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా!ఫూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు. ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు (తలకొరివి) పెట్టడానికి వీలులేదు అని గొడవ చేశారు. ఫూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడ తానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి ‘నేనే నా భర్తకు తలగోరు పెడతాన’ని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారత స్త్రీ ఆమె. 1898లో బుబానిక్ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రీబాయి, డా‘‘ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు.ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆరె స్సెస్ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది ఆరెస్సెస్‌కు పెద్ద ఆయుధమౌతుంది. అంబేడ్కర్‌కు భారతరత్న వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చినా ఆరెస్సెస్–బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫూలేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫూలే లను దీటుగా ఓన్ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది.కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్ చేసి కేంద్రానికి పంపడం, ఫూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియవ్‌ులను కట్టించడం చెయ్యాలి. ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా ఫూలేలను చూడటం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడటం చెయ్యడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికీ నిదర్శనం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతి) -
జ్యోతిరావు పూలే వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు సామాజిక ఉద్యమ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. స్త్రీలకు విద్య ఎందుకు అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శ్రీ వైయస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ… pic.twitter.com/2pE6xHV50l— YSR Congress Party (@YSRCParty) November 28, 2024 -
మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎమ్మెల్సీ కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని నిలదీశారామె. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని కవిత తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నామన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంత్రి గారూ! అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?? అసెంబ్లీలో… https://t.co/Eb6nPs2YN0 — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 22, 2024 చదవండి: ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం -
పూలే బాటలో సీఎం జగన్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, తెలుగు, సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పూలే బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, పూలే ఆశించిన సామాజిక సాధికారత సీఎం జగన్ సాధించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అణగదొక్కాలనుకున్నారని, బలహీన వర్గాల గుండె చప్పుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సీఎం జగన్‌కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. -
జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్ నివాళులర్పించారు. చదవండి: 4న విశాఖకు రాష్ట్రపతి రాక -
నెల్లూరులో జ్యోతిరావుపులే జయంతోత్సవం
-
ప్రధాని మోదీకి లేఖ రాస్తాను: నటుడు సుమన్
పూలే జయంతి రోజున సెలవు ప్రకటించాలి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి ఉస్మానియా యూనివర్సిటీ: దేశ చరిత్రలో మహాత్మ జ్యోతిరావు పూలేకు సముచిత స్థానం కల్పించాలని, ఆయన జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, పాఠ్యాంశాలలో ఫూలే జీవిత చరిత్రను చేర్చాలని సినీ నటుడు సుమన్ కోరారు. ఈ మేరకు తాను ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, ఓయూజేఏసీ, తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్, బీసీ జేఏసీ, విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫూలే 189వ జయంతి ఉత్సవాల సందర్భంగా సభ నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ జేఏసీ ఛైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు సుమన్ మాట్లాడుతూ హక్కుల సాధనకు బీసీలందరూ ఏకమై పోరాడాలన్నారు. ఆదివారం విశాఖపట్టణంలో సరైనోడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పటికీ పూలే జయంతి సభకు హాజరయ్యానని సుమన్ వివరించారు. బీసీల సభలు ఎక్కడ జరిగినా ప్రతి బీసీ హాజరుకావాలన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, విశిష్ట అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, యువజన నాయకుడు అనిల్‌కుమార్‌యాదవ్, బీసీ జేఏసీ చైర్మన్ బొమ్మ హన్మంతరావు, కన్వీనర్ పుప్పాల మల్లేష్, తెలంగాణ విద్యార్థి సెఫ్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్‌గౌడ్, చెన్న శ్రీకాంత్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రీ, టీఆర్ఎస్వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ద్వాత్రిక స్వప్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, రాజ్యసభ సభ్యులు వీహెచ్ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన పై విరుచుకపడ్డారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. -
పాఠ్యాంశంగా పూలే జీవితం
♦ మంత్రి గంటా వెల్లడి ♦ ఘనంగా పూలే జయంతి అల్లిపురం : మహాత్మా జ్యోతిరావుపూలే జీవితం ఆదర్శప్రాయమైనదని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చే అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీపీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జ్యోతిరావు పూలే 189వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత మంత్రి గంటా, కలెక్టర్ ఎన్.యువరాజు, ఎంపీలు కె.హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్, విష్ణుకుమార్‌రాజు జిల్లా కోర్టు వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సామాజికంగా అణగారిన వర్గాల్లో చైతన్యం కలిగించిన గొప్ప వ్యక్తి పూలే అని చెప్పారు. రాష్ట్రంలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు మహానీయుల జీవిత చరిత్రలను సిలబస్‌లో చేర్పిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, జేసీ జె.నివాస్, ఏజేసీ డి.వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డి ప్యూటీ డెరైక్టర్ నాగేశ్వరరావు, బీసీ కార్పొరేషర్ ఈడీ జీవన్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు జ్యోతిరావ్‌పూలే - మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
చిత్తూరు (అగ్రికల్చర్) : మహాత్మా జ్యోతిరావ్‌పూలే భారతదేశం గర్వించదగ్గ చిరస్మరణీయుడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొని యాడారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం జ్యోతిరావ్‌పూలే జయంతిని పండుగలా జరుపుకోవడం అభినందనీయమన్నారు. బలహీన వర్గాల బాలబాలికలకు విద్య చాలా అవసరమని 1873లోనే గుర్తించి సత్యశోధక సమాజాన్ని నిర్మించిన మహాత్ముడు జ్యోతిరావ్‌పూలే అని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో జ్యోతిరావ్‌పూలే విగ్రహాల ఏర్పాటుకు, చిత్తూరులో బీసీల భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బీసీల రిజర్వేషన్లో, ఇతర కులాలను చేర్చడంలో మార్పులు తీసుకు రావాలని పలువురు బీసీ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఇందుకోసం బీసీలందరూ కలసికట్టుగా ముందుకు వచ్చి వారి కేటగిరీకి ఎలాంటి కులాలను తీసుకోవాలనే జాబితాలను తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయం పరిష్కారానికి తోడ్పడతానని ఆయన చెప్పారు. బడుగు బలహీన వర్గాల్లో దాదాపు 90 శాతం మంది నిరుపేదలు ఉన్నారని తెలిపారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. బీసీలు ఇంతవరకు ఎంత అభివృద్ధిని సాధించాం, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధిని సాధించాలనే విషయాలపై ప్రణాళికలు సిద్ధం చే సుకోవాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బీసీలందరూ ఐక్యంగా మెలగి మానవతా స్ఫూర్తిని అలవరచుకుని జ్యోతిరావ్‌పూలే ఆశయాలను నెరవేర్చాలన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పోడాడిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావ్‌పూలే అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనియాడారు. బలమైన సామాజిక ఉద్యమకారుడైన జ్యోతిరావ్‌పూలే శతాబ్దమున్నర క్రితమే విద్యపై ఉద్యమాన్ని తీసుకువచ్చిన దార్శనికుడని ఆయన తెలియజేశారు. అన్నింటికీ విద్యే ప్రధానమని గుర్తించి, ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించడంలో ప్రధాన భూమిక పోషించడమే కాకుండా, ఆయన సతీమణి సావిత్రీబాయి పూలేను కూడా సేవకు అంకితం చేశారన్నారు. స్త్రీలలో సమానత్వం, విద్య గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి జ్యోతిరావ్‌పూలే అని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. సావిత్రీబాయి పూలే స్త్రీ విద్య ప్రోత్సాహానికి వసతి గృహాలు ఏర్పాటు చేసిన మొదటి వనితగా ఘనతను దక్కించుకున్నారని ఆమె కొనియాడారు. అంతకు మునుపు నగరంలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సభలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణీ, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కఠారి అనూరాధ, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనంజయరావు, డ్వామా, డీఆర్డీఏ పీడీలు రాజశేఖర్‌నాయుడు, రవిప్రకాష్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రామచంద్రరాజు, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలేకి వైఎస్ జగన్ నివాళి
-
పూలేకు డిప్యూటీ సీఎం కడియం నివాళి
వరంగల్: జ్యోతిరావు పూలే 189వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఉదయం వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు జంక్షన్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, జిల్లా కలెక్టర్ వాకాటి కర్ణ పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలేకి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే 189వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. అంబర్‌పేటలో పూలే విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.