
జ్యోతిరావు పూలేకి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే 189వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. అంబర్పేటలో పూలే విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. కేసీఆర్తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.