సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎమ్మెల్సీ కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని నిలదీశారామె. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని కవిత తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నామన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
మంత్రి గారూ!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 22, 2024
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ?
భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా??
అసెంబ్లీలో… https://t.co/Eb6nPs2YN0
చదవండి: ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం
Comments
Please login to add a commentAdd a comment