సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు సామాజిక ఉద్యమ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
స్త్రీలకు విద్య ఎందుకు అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శ్రీ వైయస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ… pic.twitter.com/2pE6xHV50l— YSR Congress Party (@YSRCParty) November 28, 2024
Comments
Please login to add a commentAdd a comment