Dr BR Ambedkar Jayanthi Celebrations At YSRCP Central Office Tadepalli - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

Published Fri, Apr 14 2023 11:25 AM | Last Updated on Fri, Apr 14 2023 6:05 PM

Ambedkar Jayanti Celebrations At Ysrcp Central Office Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్ర పటానికి  రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి,  పోతుల సునీత. పలువురు నాయకులు పూల మాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌పై వైఎస్సార్‌సీపీ నాయకుడు పెరికె వరప్రసాద్‌ రచించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..

  • అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన
  • నాడు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని నిల్చిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌
  • అప్పటి సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేశారు
  • ఏ కులంలో జన్మించినా ప్రతి ఒక్కరికీ సమాజంలో బతికే అవకాశం ఉందన్న ఆయన, ఆ సమ సమాజ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతో చొరవ చూపారు. 
  • మన దేశం సమైక్యంగా ముందుకు సాగడంలో, నాడు అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రధాన కారణం. 
  • అంతటి మహనీయుడైన అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. 
  • ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 
  • అంతే కాకుండా బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లోని పేదల కోసం ఆయన పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 
  • నాడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందాలని ఆశించారో.. నేడు సీఎం జగన్‌ సరిగ్గా అదే బాటలో నడుస్తూ.. ఆ మహనీయుని ఆశయాలు నిలబెడుతున్నారు.
  • అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిత్యం రాజ్యాంగం అపహస్యం పాలయ్యేలా.. దళితులు, అణగారిన వర్గాల వారు అవమానాలకు గురయ్యేలా వ్యవహరించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వారిపై తనకున్న అక్కసును కూడా చంద్రబాబు వెళ్లగక్కారు. ఇంకా బీసీల తోకలు కత్తిరిస్తామంటూ వారినీ అవమానించారు. అందుకే గత ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాయి. 
  • ఇక నారా లోకేష్‌ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్‌ జయంతి అని తెలిసి కూడా.. ‘దళితులు ఏం పీకుతారు?’ అని నిన్న వ్యాఖ్యానించిన లోకేష్‌ తన కండకావరాన్ని ప్రదర్శించారు. అందుకే చంద్రబాబు మాదిరిగా, లోకేష్‌కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ..

  • దళితులకు సమాన హక్కులు, సాధికారతకు సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యం:
  • బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్, వారి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 
  • ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం  జగన్‌ దళితులకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. నిజానికి దళితులు జాతి సంపద.
  • తన పాలనలో దళితులను తీవ్రంగా అవమానించి, వారి కోసం ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు, ఈరోజు తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారు. కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్‌

  • భారతీయులంతా గర్వించదగిన వ్యక్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌
  • భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజిల్లడానికి కారణం అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం. జాతి యావత్తూ పవిత్ర గ్రంధంగా భావించే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, సమసమాజ స్థాపనకు ఎంతో దోహదం చేశారు
  • అంబేద్కర్‌ ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగుతోంద

చదవండి: బీఆర్ అంబేడ్కర్‌ జయంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement