BR Ambedkar Jayanti celebrations
-
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల అభ్యన్నతికోసం అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ కొనియాడారు. పార్లమెంట్ ప్రాంగణంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నేలంతా ఘనంగా నివాళులర్పించారు. ప్రమాదకర ధోరణి: ఖర్గే ప్రత్యర్థులపై జాతి వ్యతిరేక ముద్ర వేయడం, బలవంతంగా నోరు మూయించడం వంటి ప్రమాదకర ధోరణులు పాలకుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. ఇది అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. పార్లమెంటు చర్చా వేదికను కూడా అధికార బీజేపీ పోరాటస్థలిగా మార్చిందని దుయ్యబట్టారు. ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వద్రా తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. -
వ్యవస్థలపై వికృత దాడి: సోనియా
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని జాతి వ్యతిరేకిగా మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభివర్ణించారు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడటమే గాక రాజ్యంగ వ్యవస్థలన్నింటినీ తన తాబేదార్లుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం ఓ పత్రికకు ఆమె వ్యాసం రాశారు. రాజ్యాంగ విజయం పాలకుల ప్రవర్తనపైనే ఆధారపడుతుందని అంబేడ్కర్ పదేపదే హెచ్చరించేవారని గుర్తు చేశారు. మోదీ సర్కారు దెబ్బకు దేశంలో స్వేచ్ఛ పూర్తిగా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ‘‘చట్టాలను ప్రజల హక్కుల పరిరక్షణకు బదులుగా వారిని వేధించేందుకు ఉపయోగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే విద్వేష వాతావరణం సృష్టించి సమాజంలో సౌభ్రాతృత్వాన్ని మంటగలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలే నడుం బిగించాలి’’ అని పిలుపునిచ్చారు. -
ఘనంగా అంబేడ్కర్ 133వ జయంతి
సాక్షి, చైన్నె: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని శుక్రవారం వాడవాడల్లో ఘనంగా నిర్వహించారు. రాజకీయ పక్షాల నేతలు అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, పుష్పాంజలితో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సమత్తువ దినోత్సవంగా అధికారిక వేడుకలు జరిగాయి. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడల్లో ఉన్న ఆయన విగ్రహాల్ని ఆయా ప్రాంతాల్లోని సంఘాలు, రాజకీయ పక్షాల ప్రతినిధులు ముస్తాబు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాయకులు, సంఘాల ప్రతినిధులు తరలివచ్చి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అలాగే, ఆయా విగ్రహాల వద్ద ఉంచిన అంబేడ్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. డీఎంకే, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సమత్తువ ( సమానత్వం) దినోత్సవం అంబేడ్కర్ జయంతి వేడుక నిర్వహించారు. సీఎం నివాళి.. ఆర్ఏ పురంలోని అంబేడ్కర్ స్మారక మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి శేఖర్‌బాబు, ఎం సుబ్రణియన్ , కేఎన్ నెహ్రు ఏవి వేలు, సెంజి మస్తాన్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, వీసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత సెల్వ పెరుంతొగై, చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. సేలంలో జరిగిన కార్యక్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. తేనీలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం, చైన్నె కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, టీ నగర్‌లోని నివాసంలో జయలలిత నెచ్చెలి శశికళ అంబేడ్కర్ చిత్రపటానికి అంజలి ఘటించారు. -
ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగమయ్యను..
-
ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి మహా విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-
అంబేడ్కర్ విగ్రహానికి హెలికాఫ్టర్ పైనుంచి పూలాభిషేకం
-
అంబేడ్కర్ ఆశయాలతో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన
-
ప్రపంచం గర్వించదగ్గ మేథావి అంబేడ్కర్
-
బీజేపీ ఆఫీసులో ఘనంగా డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
-
తనకంటే ముందే పూలమాల వేయడంపై ఎమ్మెల్యే కంచర్ల అభ్యంతరం
-
జ్ఞానానికి, మేధస్సుకు అంబేద్కర్ ఓ సింబల్ అని కొనియాడిన రాష్ట్రపతి ముర్ము
-
హైదరాబాద్‌లో ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా పేరు దక్కించుకుంది. ఈ విగ్రహాన్ని రాష్ట్ర సెక్రటేరియట్ పక్కన, బుద్ధ విగ్రహానికి సమీపంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న (శుక్రవారం) సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం విశేషాలపై ఓ లుక్కేద్దాం! ►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్ విగ్రహాం నిర్మాణాన్ని చేపట్టింది. భారీ ఎత్తున రూపొందిన ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్‌లో అమర్చారు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది. ►విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహం తయారీ కోసం 425 మంది శ్రామికులు పని చేశారు. ఇందులో 2 లిఫ్ల్లను ఏర్పాటు చేశారు. ( ఒక్కోదానిలో 15 మంది సామర్థ్యం) ►విగ్రహం ఏర్పాటు కోసం 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు కోసం 1.35 ఎకరాలు, చుట్టు పచ్చదనం కోసం 2.93 ఎకరాలు, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం కోసం 1.23 ఎకరాలు, కామన్ పార్కింగ్ కొరకు 4.82 ఎకరాలను కేటాయించారు. ►ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు. ►11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ►అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు రెండేళ్లు పట్టింది. ►ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విగ్రహ శిల్పి 98 ఏళ్ల రామ్ వంజీ సుతార్‌ను ఆహ్వానించారు. ►అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35 వేల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ►750 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రజల రావాణా కోసం ఉపయోగించనున్నారు. ►ఈ కార్యక్రమం కోసం హాజరయ్యే ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, 1.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పోతుల సునీత. పలువురు నాయకులు పూల మాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు పెరికె వరప్రసాద్ రచించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన నాడు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని నిల్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటి సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేశారు ఏ కులంలో జన్మించినా ప్రతి ఒక్కరికీ సమాజంలో బతికే అవకాశం ఉందన్న ఆయన, ఆ సమ సమాజ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతో చొరవ చూపారు. మన దేశం సమైక్యంగా ముందుకు సాగడంలో, నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాన కారణం. అంతటి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాకుండా బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లోని పేదల కోసం ఆయన పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందాలని ఆశించారో.. నేడు సీఎం జగన్ సరిగ్గా అదే బాటలో నడుస్తూ.. ఆ మహనీయుని ఆశయాలు నిలబెడుతున్నారు. అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిత్యం రాజ్యాంగం అపహస్యం పాలయ్యేలా.. దళితులు, అణగారిన వర్గాల వారు అవమానాలకు గురయ్యేలా వ్యవహరించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వారిపై తనకున్న అక్కసును కూడా చంద్రబాబు వెళ్లగక్కారు. ఇంకా బీసీల తోకలు కత్తిరిస్తామంటూ వారినీ అవమానించారు. అందుకే గత ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాయి. ఇక నారా లోకేష్ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి అని తెలిసి కూడా.. ‘దళితులు ఏం పీకుతారు?’ అని నిన్న వ్యాఖ్యానించిన లోకేష్ తన కండకావరాన్ని ప్రదర్శించారు. అందుకే చంద్రబాబు మాదిరిగా, లోకేష్‌కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. దళితులకు సమాన హక్కులు, సాధికారతకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం: బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్, వారి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం జగన్ దళితులకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. నిజానికి దళితులు జాతి సంపద. తన పాలనలో దళితులను తీవ్రంగా అవమానించి, వారి కోసం ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు, ఈరోజు తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారు. కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్ భారతీయులంతా గర్వించదగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజిల్లడానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. జాతి యావత్తూ పవిత్ర గ్రంధంగా భావించే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, సమసమాజ స్థాపనకు ఎంతో దోహదం చేశారు అంబేద్కర్ ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోంద చదవండి: బీఆర్ అంబేడ్కర్ జయంతి.. సీఎం జగన్ ట్వీట్ -
దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం
‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు..జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. – అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది – సీఎం కేసీఆర్ ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. అవును.. అలా చెప్పడమేకాదు.. జనం కోసమే జీవించి జనంలో నిలిచిపోయిన మహా మనిషి బాబాసాహెబ్ అంబేడ్కర్. ‘నేను, నా దేశం అని చెప్పాల్సి వస్తే.. నా దేశమే నాకు అత్యంత ముఖ్యమైన’దని చాటిన ఆయనను దేశమంతా స్మరించుకునే రోజు ఏప్రిల్ 14. ఆ మహనీయుడి జయంతి. ఈ రోజునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లో కెల్లా ఇదే అతిపెద్దది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ విగ్రహంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు. తర్వాత బౌద్ధ గురువుల ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. దాదాపు 50వేల మంది దీనికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహావిష్కరణ, సభ, ఇతర కార్యక్రమాల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభకు హాజరైనవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీటు ప్యాకె ట్లను పంపిణీ చేయనున్నారు. విగ్రహావిష్కరణ, సభ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌వాదులు, అభిమానులు పాల్గొననున్నారు. రూ.146.50 కోట్ల ఖర్చుతో.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహ నిర్మాణం, డిజైన్, పనులు తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాల్లోని భారీ విగ్రహాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్ ఉంటాయి. విగ్రహంలో గ్రంథాలయం, హాల్స్ విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేడ్కర్ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంటాయి. భవనంలోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేడ్కర్ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు. 36 ఎకరాల్లో స్మృతివనం: అంబేడ్కర్ స్మృతివనం కోసం విగ్రహం పక్కనే 36 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్స్, శాండ్‌స్టోన్ వర్క్ ఉంటాయి. దాదాపు 450 కార్లు పాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. జీవం పోసిన వంజి సుతార్ హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజి సుతార్. మహారాష్ట్రకు చెందిన ఆయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్ రూపొందించినవే. పార్లమెంట్ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్)’కు రూపమిచ్చి నదీ ఆయనే కావడం విశేషం. భారత ప్రభుత్వం సుతార్‌ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది కూడా. -
రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భాగస్వామ్యం
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అంబేడ్కర్ ఆలోచనలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కేవలం ఓట్ల కోసం వాడుకుని వదిలేసిందని.. కానీ, జగన్ మాత్రం వారిని రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేస్తున్నారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఘనంగా నిర్వహించింది. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభకు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిగా అంబేడ్కర్ జయంత్యుత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 66 దేశాల్లో అంబేడ్కర్ జయంత్యుత్సవాలను జరుపుకుంటున్నారని.. అలాగే, అంబేడ్కర్ పుట్టిన రోజుని ప్రపంచ జ్ఞానదినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని మంత్రి గుర్తుచేశారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. అంబేడ్కర్, పూలే ఆలోచన విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలు ముఖ్యమంత్రులుగా పనిచేసినా సామాజిక న్యాయాన్ని ఏపీలో జగన్ తరహాలో చేయలేకపోయారన్నారు. సీఎం జగన్‌ను మరో 25 ఏళ్లపాటు అధికారంలో కొనసాగేలా ఆయనకు మనం అండగా నిలవాలని, సీఎంగా జగన్ ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మనుగడ అని అన్నారు. మహనీయులకు వర్థంతులుండవు : తమ్మినేని మహనీయులకు జయంతులే కాని వర్థంతులుండవని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలుచేస్తున్న అభినవ అంబేడ్కర్ íసీఎం జగన్ అని కితాబిచ్చారు. విజయవాడ మేయర్ స్థానం జనరల్ అయితే.. బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. గత పాలకులు అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును ప్రకటించి ఐదేళ్లు గడిచినా పట్టించుకోలేదని, సీఎం వైఎస్ జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో స్మృతివనాన్ని ఏర్పాటుచేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్‌ను ఒక్కసారి చేజార్చుకుంటే మన భవిష్యత్ అంధకారమేనన్నారు. కార్యక్రమంలో.. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొని మాట్లాడారు. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం బయట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, సభ ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గడువులోగా అంబేడ్కర్ విగ్రహం పూర్తి మరోవైపు.. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటుచేసిన 25 అడుగుల అంబేడ్కర్ నమూనా కాంస్య విగ్రహానికి మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 125 అడుగుల విగ్రహం, స్మృతి వనం పనులను గడువులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థను మంత్రుల బృందం ఆదేశించింది. బాబుకు అంబేడ్కర్ పేరెత్తే అర్హతే లేదు రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబుకు అంబేడ్కర్ పేరెత్తే అర్హతేలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. బాబు పాలనలో దళితులపై అతిపెద్ద దాడి జరిగిందని, ఆ వర్గాలకు ప్రధాన శత్రువు చంద్రబాబేనని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న పాలనలో దళితులకు అన్నింటా అగ్రతాంబూలం ఇస్తున్నారని చెప్పారు. అంబేడ్కరిజాన్ని గుండెల నిండా నింపుకొని సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. రాజధాని అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం అంటూ ఐదేళ్లు కాలయాపన చేసి, ఆఖరికి ఆ ప్రాంతాన్ని పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మార్చిన టీడీపీ నేతలు సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కానీ, రూ.కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలంలో, విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా వైఎస్ జగన్ అంబేడ్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఈరోజు కూడా ఆ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారని.. గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారని.. ఇదీ ఆయన చిత్తశుద్ధని చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడి హోదాలో తాను అమరావతిలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసే ప్రాంతాన్ని చూడటానికి వెళ్తే తనని ముప్పతిప్పలు పెట్టి అరెస్తుచేశారని గుర్తుచేశారు. -
అంబేడ్కర్ దార్శనికత స్ఫూర్తిగా జగన్ సర్కారు
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి, పార్టీ నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవితంలో యదార్థ ఘటనలను సేకరించి వరప్రసాద్ ప్రచురించిన పుస్తకాన్ని సజ్జల రామకష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమసమాజం గమ్యంగా జాతిని నడిపించడానికి అంబేడ్కర్ కృషిచేశారని కొనియాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. అంబేడ్కర్ ఆలోచన విధానం, ఆయన దార్శనికత స్ఫూర్తిగా పనిచేస్తోందన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జగన్ వాటిని అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత, రాజకీయంగా దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, కులమతాలకు అతీతంగా పేదల అభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ ఎస్సీలను బంధువులుగా భావించి, వారి సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారని తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీని చేశారన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలే ఊపిరిగా అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, ఇతర పార్టీలకు దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని చెప్పారు. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల
సాక్షి, హైదరాబాద్: దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ దళితులను దగా చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కావాలని ఏ దళితుడు అడగలేదని, కేసీఆరే మాట ఇచ్చి, దగా చేశారని మండిపడ్డారు. ఇప్పటి పాలకులకు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని బుధవారం ఆమె తన కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంకా వారిపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని మండిపడ్డారు. మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇలా ఎన్నో హామిలిచ్చి నెరవేర్చకుండా దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. రాజయ్య మీద ఒక్క ఆరోపణ రాగానే పదవి నుంచి తప్పించిన కేసీఆర్.. మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. దళితులపై కేసీఆర్ ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు అంబేద్కర్ జయంతి వేడుకలకు మాత్రం అడ్డొస్తాయా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్‌ను రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని ఇప్పటికీ దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు. సమానత్వం కోసం అంబేడ్కర్ పోరాడితే.. సమాన అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కృషి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేసిన నేత వైఎస్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దళిత నేత, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, బి.సంజీవరావు, డేవిడ్ శాంతరాజ్, జార్జ్ హెర్బర్ట్, పాకాల డానియేల్, దయానంద్, బి.మరియమ్మ, పోలీసు రాంచందర్, బి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా నడవాలి
మెదక్‌జోన్: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ సూచించారు. ఆదివారం భారతరత్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెదక్‌లోని జీకేఆర్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని రాందాస్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్ చౌరస్తాల్లో గల అంబేడ్కర్ విగ్రహాలకు జేసీ నగేష్, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి జ్యోతి పద్మ, మెదక్ ఆర్డీఓ సాయిరాం, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతోపాటు ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీకేఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను జేసీ నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమాజాభివృద్ధి కోసం కొంత మంది నేతలు సూచనలు మాత్రం చేస్తారని, అంబేడ్కర్ అలా కాకుండా ఆచరణలో చూపిన మహనీయులు అని కొనియాడారు. దేశంలో ఉన్నత విద్యావంతుడిగా ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో అంబేడ్కర్ ఒకరని తెలిపారు. బరోడాలో జరిగిన చేదు అనుభవం తరువాత స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి జీవించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి ఒక వర్గానికి, కులానికి పరిమితం చేసే పరిస్థితులు ప్రస్తుతం ఉండటం దురదృష్టకరమన్నారు. కేవలం చదువు ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అంబేడ్కర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందనేది వాస్తవమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని, కేవలం చదువు మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై పట్టు సాధించాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువకులు ఈ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. 128వ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో కూడా ఇంకా వివక్ష గురించి మాట్లాడుకోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ నిజంగా అర్థం చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మించే అంబేడ్కర్ భవనానికి త్వరలో కలెక్టర్ స్థలాన్ని ఎంపిక చేస్తారని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జిల్లా జనాభాకు అనుగుణంగా సీట్ల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుందన్నారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి వివక్ష లేకుండా విధులను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాంటి సంఘటనలు ఏవైనా ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం అనేక రకమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని పథకాలను తెలుసుకొని అర్థికంగా అభివృద్ధి చెంది ఇతరులకు ఆదర్శంగా ఉండేందుకు కృషిచేయాలని సూచించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లి గ్రామం నుంచి ప్రత్యేకంగా బైక్‌లపై వచ్చిన కొంతమంది యువకులను జేసీ ప్రత్యేకంగా అభినందించారు. భారతీ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు నేర్పించడం అనే అంశంపై చైనా వెళ్లిన కృపాకర్ అనే విద్యార్థిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షెడ్యూల్టు కులాల అభివృద్ధిశాఖ అధికారి జ్యోతిపద్మ, మెదక్ ఆర్డీఓ సాయిరాం, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, ఏడీ ఉద్యానవనశాఖ నర్సయ్య, ఏడీ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ గంగయ్య, డీటీఓ రమేష్, సీఐ వెంకటయ్యతోపాటు ఏఎస్డబ్లు్యఓలు సుధాకర్‌రావు, కవిత, నర్సాపూర్ వార్డెన్ మల్లేశం ఇతర అధికారులు, దళిత సంఘాలు, ప్రజాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళి మెదక్‌జోన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 128వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం సీపీఎం మెదక్‌జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలకే కాకుండా దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కే.నర్సమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కే.మల్లేశం, బస్వరాజ్, నాయకులు సంతోష్, నరేష్, మోహిన్, టీమాస్ జిల్లా కన్వీనర్ సి.హెచ్. దేవయ్య, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు భాస్కర్ రిటైర్డ్ టీచర్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మెదక్‌జోన్: మెదక్ పట్టణంలో ఆదివారం జరిగిన డాక్టర్ అంబేడ్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సామాజిక సేవకులను సన్మానించారు. అందులో భాగంగా సామాజిక కార్యకర్తగా, స్వేరో స్వచ్ఛంద సంస్థ సభ్యుడిగా, జర్నలిస్టుగా, (టీయూడబ్ల్యూజే). (ఐజేయూ)ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న దొందుగుల నాగరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేసీ నగేష్, సాంఘిక సంక్షేమశాఖ అధికారిణి జ్యోతి పద్మ తదితరులు పాల్గొన్నారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేడ్కర్ కృషి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ మున్సిపాలిటీ: దేశ నవనిర్మాణం, సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటాకోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు అంబేడ్కర్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని కొనియాడారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ ఆర్కెశ్రీనివాస్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, నాగ్సాన్పల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ జీవన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సతీష్, నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్, రాజు, లింగారెడ్డి, జయరాంరెడ్డి, దుర్గయ్య, ఉమర్, బాలాగౌడ్, అమీర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్
-
బీఆర్ అంబేద్కర్‌కు వైఎస్ జగన్ ఘన నివాళులు
సాక్షి, అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏపీ అంతటా ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్ జగన్‌తోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతపురం: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి తలారిరంగయ్య, అనంతపురం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నదీంఅహ్మద్‌లు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. వైఎస్సార్ జిల్లా: కడపలో అంబేద్కర్ జయంతి వేడుకను వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా జరిపారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ సురేష్ బాబు, కడప కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు అంజాద్ బాషా,రవీంద్రనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంబేద్కర్ జయంతి వేడుకను వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శివ ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. విజయవాడ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పొట్లూరి వీరప్రసాద్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, కాలే పుల్లారావు,శ్యామ్, రమేశ్, బూదల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ దార్శనికుడు బీఆర్ అంబేడ్కర్
ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యక్తిత్వ నిర్మాణయుగం. ఈ యుగ సంకేతంగా ప్రపంచంలో వెలుగొందుతున్న మేధావుల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రసిద్ధులు. విద్య మానవుడిని ప్రపంచీకరించాలని కుల వివక్ష కోరల్లోకి దింపకూడదని అంబేడ్కర్ ఆశించారు. ఆ కోణంలో ఆయన ప్రపంచ మానవ సంస్కృతికి ప్రతీక. గతంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను నిరసించి, నిరాకరించి, అపహాస్యం చేసిన వారంతా ఈ రోజు ఆయన్ని భుజాలకెత్తుకుని మోస్తున్నారు. భారత రాజ్యాంగ శిల్పిగా, స్త్రీ విముక్తి ప్రదాతగా, మానవతా దార్శనికుడిగా, బౌద్ధ తత్వబోధకుడిగా, వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడిగా,యుగకర్తగా సామాజిక విప్లవ మార్గాన్ని నిర్దేశించిన అంబేడ్కర్ బోధనలను చిత్తశుద్ధితో పాటించడమే ఆయనకు మనమిచ్చే నివాళి. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక రాజకీయ వేత్త. భారత రాజ్యాంగ శిల్పి, స్త్రీ విముక్తి ప్రదాత, మానవతా దార్శనికుడు, బౌద్ధ తత్వబోధకుడు, వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడు. యుగకర్త, సామాజిక విప్లవ మార్గాన్ని నిర్దేశించిన బోధకుడు. సమాజాన్ని మార్చిన చరిత్రకారుడు. ఈ రోజు ఆయన 128వ జయంతి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన ప్రపంచ మేధావిగా విస్తరిస్తున్నారు. గతంలో అంబేడ్కర్‌ను నిరసించి, అపహాస్యం చేసిన వారంతా ఈ రోజు ఆయన్ని భుజాలకెత్తుకుని మోస్తున్నారు. తాను పొందిన విద్యా సౌగంధ్యాన్ని మొత్తం సమాజానికి పంచటం అంబేడ్కర్ ప్రారంభించాడు. అందుకే ఆయన మాటలను వినడానికి ప్రజలు లక్షలాదిగా సమీకృతులయ్యారు. ఆ మాటలలో సత్యనిష్టమైన శక్తి ఉంది. చీకటిని తొలగించే వెలుగు దివ్వెలలా ఆయన మాటలు ప్రజ్వలనాలయ్యాయి. 1923కే ఆయన బారెట్ లా కూడా పూర్తి చేసి బాంబే వచ్చాడు. ఆయనకు 32 ఏళ్ల వయస్సు నాటికి భారతదేశంలో పేరెన్నిక గన్న విద్యా సామాజికవేత్తగా నిలబడ్డాడు. 1927లో జరిగిన మహద్ చెరువు పోరాట సందర్భంగా అంబేడ్కర్ మనుస్మృతిని దగ్ధం చేశారు. కులానికి, అస్పృశ్యతకి మూలమైన మనుస్మృతిని తగులబెట్టడంతో ఒక్కసారిగా హిందూ సమాజం ఉలిక్కిపడి ఆయన వైపు చూసింది. మనుస్మృతిని తగులబెట్టిన సంఘటన చారిత్రాత్మకమైంది. అంబేడ్కర్ గొప్ప పరిశోధకునిగా భారతదేశానికి నూతన వెలుగులు ఆవిష్కరించారు. తన కుల నిర్మూలన గ్రంథం ద్వారా ‘కులం ఒకనాడు జనించింది, మరొకనాడు అంతరిస్తుంద’ని స్పష్టం చేశారు. కులం, అస్పృశ్యత పోయి, ప్రధాన స్రవంతిలోకి దళితులు రావడం వల్ల, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయని, జ్ఞాన సంపద పెరుగుతుందని స్పష్టం చేశారు. దళితులు గొప్ప ఉత్పత్తి శక్తులు. గిరిజనులు ప్రకృతి శక్తులు. వీరిని నిర్లక్ష్యం చేయడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందదని తేల్చి చెప్పారు. ప్రగాఢ అధ్యయనం, లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ ఉన్నందునే ఆయన మాటలు సత్యనిష్ఠం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబేడ్కర్ తన రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొదుగుతూ వెళ్ళారు. విద్య శూద్రులకు, అతి శూద్రులకు చెప్పగూడదనే నిర్ణయం వలన భారతదేశం నిరక్షర భారతంగా మిగిలిపోయింది. మళ్ళీ అక్షర భారతంగా అంబేడ్కర్ మలచాడు. భారతదేశంలో విద్య సార్వత్రికం కావడానికి, దేశంలోని అన్ని కులాల విద్యార్ధులు ప్రపంచ దేశాల్లో అత్యున్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ అందరికీ చదువుకునే హక్కుతోపాటు ఉపకార వేతనాల సౌకర్యాన్ని ప్రతిపాదించడం, రిజర్వేషన్ల సౌకర్యాన్ని కలిగించడం వల్లనే జరిగింది. విద్యను శూద్ర, అతిశూద్ర, ఆదివాసీలందరికి కలిగించడం ఒక చారిత్రక మలుపునకు దారితీసింది. అంబేడ్కర్ గొప్ప రాజ నీతిజ్ఞుడు. నీతికి, నిజాయితీకి ఆయన నిలువెత్తు సాక్ష్యం. దళితులు తమ రాజకీయ పార్టీలను తాము నిర్మించుకొని ఓటు వేసుకొనే స్థాయికి ఎదగాలని ప్రబోధిం చారు. రాజ్యాధికారం ప్రధానమైన ‘కీ’ అని, ఆ తాళాలు చేతిలో ఉంటే అన్ని తలుపులు మనం తీయవచ్చని చెప్పారు. భారతదేశ పునర్నిర్మాణానికి ప్రజాస్వామ్యం పునాది అని మాట్లాడే, పోరాడే స్వేచ్ఛ వల్లే సామాజంలో మార్పు వస్తుందని చెప్పారు. లౌకిక, సామ్యవాదాల వైపు దేశం నడవకపోతే మత ఘర్షణలు, కులాధిపత్య దాడులు జరుగుతాయని, అందుకే దళితుల్లో చదువుకున్న వారు కుల నిర్మూలన వైపుగా సామాజిక సమానత వైపుగా సమాజాన్ని నడిపించే బాధ్యతను కలిగి ఉండాలని చెప్పారు. అంబేడ్కర్ మానవ హక్కుల కోసం పోరాడే క్రమంలో హిందూకోడ్ బిల్లు కోసం కేంద్ర న్యాయమంత్రిగా రాజీనామా ఇవ్వడానికి వెనుకాడని పోరాటయోధుడు. 1956 అక్టోబర్‌లో నాగపూర్‌లో 5 లక్షల మంది అణగారిన ప్రజలకు బౌద్ధ దీక్షనిచ్చి తన సమీకరణశక్తిని ప్రపంచానికి చాటినవాడు. విద్యనభ్యసించడం కాదు విద్యా వ్యవస్థల నిర్మాణంలో భాగంగా ఔరంగాబాదులో అత్యున్నత విద్యా సంస్థల నిర్మాణం గావించాడు. ఆయన నీతి, వ్యక్తిత్వం, దేశ భవితవ్యం, స్త్రీ ఔన్నత్యం కోసం నిరంతరంగా ఒక యోధుడులా పనిచేశాడు. 1932 తరువాత ఆయన గడిపిన ప్రతిరోజూ భారతదేశ చరిత్రకి ఒక డాక్యుమెంట్ వంటిది. బుద్ధుడిని, అంబేడ్కర్‌ని అధ్యయనం చెయ్యకుండా భారతదేశంలో సమసమాజ నిర్మాణం సాధ్యపడదు. అంబేడ్కర్ గొప్ప సామాజిక శాస్త్రవేత్త, మానవ పరిణామ శాస్త్రవేత్త. మానవ పరిణామ శాస్త్రవేత్తలు, భారతీయ చరిత్రకారులు, సామాజిక శాస్త్రకారులు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఇప్పటివరకు చరిత్రకు సామాజిక శాస్త్రానికి అన్వయించలేక పోతున్నారు. అందుకే ఏ దేశాలు వెళ్ళినా వీళ్ళకు కులభావాలు పోవడం లేదు. కులం అనేది దేశం మారితే పోదు. గాంధీ, నెహ్రూ ఎందరో భారతీయ మేధావులు ఇతర దేశాలలో చదివారు. వాళ్ళ కులం బలపడింది కానీ పోలేదు. దానివల్ల వాళ్ళు ప్రపంచ మానవులు కాలేకపోయారు. ప్రపంచ మానవులు కావాలంటే మానవ పరిణామ శాస్త్రం అర్థం కావాలి. ప్రపంచం ఈనాడు శాస్త్రీయ వైజ్ఞానిక ప్రగతిలో పయనిస్తుంది. కులాలు, మతాలు, స్త్రీ అణచివేత, ఇతరులను పీడించే గుణాలు మనిషిని ఎదగకుండా చేస్తాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భారతీయులు అక్కడి అలవాట్లుకు కూడా బానిసలు అవుతున్నారు. విద్యను ఒక వ్యాపారంగా భావించి విద్య ద్వారా ధనార్జన కోసం పాకులాడుతున్నారు. అందుకే ఏ దేశంలో వ్యాపారం చేసినా, వాళ్ళు ధనం సంపాదించగలుగుతున్నారు గాని ప్రపంచ వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేక పోతున్నారు. అంబేడ్కర్ విద్య మానవుణ్ణి ప్రపంచీకరించాలని చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యక్తిత్వ నిర్మాణయుగం. ఈ యుగ సంకేతంగా ప్రపంచంలో వెలుగొందుతున్న మేధావుల్లో అంబేడ్కర్ ప్రసిద్ధులు. ఈ ప్రపంచ దార్శనికునికి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్మృతివనాలు వెలిశాయి కాని, నిర్మాణం త్వరితగతిన సాగడం లేదు. భారతదేశంలో వున్న అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పీఠాలు వెలిశాయి. కానీ తగిన నిధులు విడుదల కావడం లేదు. అంబేడ్కర్‌ను విస్మరించడం అంటే, దేశ భవిష్యత్తు్తను దెబ్బతీయడమే. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాతగా అంబేడ్కర్‌ను విస్మరించడం అంటే, దేశ భవిషత్తును దెబ్బతీయడమే మానవీయ సంస్కృతీ నిర్మాతగా అంబేడ్కర్ ప్రపంచ మానవ సాంస్కృతిక ప్రతీక, ఆయన మార్గంలో నడుద్దాం.. (నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 128వ జయంతి సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ముఖ్య అతిధిగా వ్యాస రచయిత సమర్పిస్తున్న స్మారకోపన్యాస పత్రం) వ్యాసకర్త : డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సెల్ : 98497 41695 -
కులాల మధ్య చిచ్చుపెడుతున్న బాబు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా మచిలీపట్నం (చిలకలపూడి) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి మానికొండ శ్రీధర్ మాదిగ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు, ఏడాదంతా బాబుజగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చేపడతామని చెప్పిన చంద్రబాబు ఎస్సీలను విభజించడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడును ఓటమి పాలు చేయాలని గ్రామగ్రామాన తిరిగిన జూపూడి ప్రభాకర్, కారెం శివాజీలకు పదవులను కట్టబెట్టి కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరికి పదవులు కట్టబెట్టడంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అఖిలపక్ష నాయకులను తీసుకువెళ్లి చర్చించాలని కోరారు. అనంతరం డీఆర్వో సీహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు డి సుధాకర్ మాదిగ, ఎం. ఆదినారాయణమాదిగ, పేటేటి ప్రభాకర్, డి. అంజమ్మ, కె డానియల్, దొండపాటి సుధాకర్ పాల్గొన్నారు.